BigTV English
Advertisement

Women’s World Cup 2025: కలగా మొదలై చరిత్రగా నిలిచిన ఇన్నింగ్స్.. జెమీమా TAKE A BOW

Women’s World Cup 2025: కలగా మొదలై చరిత్రగా నిలిచిన ఇన్నింగ్స్.. జెమీమా TAKE A BOW

Women’s World Cup 2025: 339.. వరల్డ్‌కప్‌లోనే కాదు.. విమెన్స్ వన్డే క్రికెట్ హిస్టరీలోనూ.. ఏ టీమ్ కూడా ఇంతటి భారీ టార్గెట్‌ని ఛేదించలేదు. పైగా.. ప్రత్యర్థి ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా. ఈ టార్గెట్ చూశాక.. ఇండియా దానిని ఛేదించడం కాదు కదా.. కనీసం ఆ స్కోరు దరిదాపులకు కూడా చేరదనుకున్నారు. కానీ.. కంగారూ జట్టుని కంగారెత్తించారు. కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చారు. రికార్డులు బద్దలయ్యేలా విక్టరీ కొట్టారు. ఇది.. నిజంగా అద్భుత పోరాటమే! అద్వితీయ విజయమే! అందుకే.. ఇండియా


మనల్ని ఎవడ్రా ఆపేది? అన్నట్లుగా బ్యాటింగ్
గెలవాలని మెంటల్‌గా ఫిక్స్ అయిన తర్వాత.. మనల్ని ఎవడ్రా ఆపేది? అన్నట్లుగా సాగింది టీమిండియా బ్యాటింగ్. ఇంకా చెప్పాలంటే.. అది బ్యాటింగ్ కాదు.. ఓరకంగా బీటింగ్. అందుకే.. గ్రౌండ్‌లో భారత్ అద్భుతం చేసింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అద్వితీయమైన విజయాన్ని అందుకుంది భారత్. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కి దూసుకెళ్లి.. టైటిల్ గెలిచేందుకు ఇంకొక్క అడుగుదూరంలో నిలిచింది.

ఆ టార్గెట్ చూశాక గెలుపు ఆశలు ఆవిరైపోతాయ్..
వన్డే మ్యాచ్‌ల్లో 339 పరుగుల టార్గెట్ చూశాక.. ఏ టీమ్‌కైనా గెలుపు ఆశలు ఆవిరైపోతాయ్. పైగా.. ప్రత్యర్థి టీమ్ ఆస్ట్రేలియా అయితే.. ఆవిరయ్యే ఆ ఆశలు.. ఆలోచనకు కూడా రావు. కానీ.. వన్డే క్రికెట్‌లో ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. కొండంత లక్ష్యం ముందున్నా.. రికార్డు బద్దలయ్యే విక్టరీని.. వరల్డ్ మొత్తం రీసౌండ్‌లో వినిపించేలా చేసింది. ఒక్క విమెన్స్ వరల్డ్‌కప్‌లోనే కాదు.. మహిళల వన్డే క్రికెట్ హిస్టరీలోనూ.. ఏ టీమ్ కూడా ఇంతటి భారీ టార్గెట్‌ని ఛేదించలేదు. ఫస్ట్ ఇన్ హిస్టరీ.. ఇండియా ఛేజ్ చేసి చూపించింది. అందుకే.. ఇప్పుడు ఇంత చర్చ జరుగుతోంది.


అద్భుతం చేసిన జెమీమా, హర్మన్ ప్రీతి జోడీ
అసలే.. భారీ టార్గెట్. పైగా.. 59 రన్స్‌కే రెండు వికెట్లు. ఇలాంటి టైమ్‌లో.. ఛేజింగ్ అంటే టీమ్ మొత్త మానసికంగా ఎంతో కుంగిపోతుంది. ఫోకస్ గెలుపు మీద నుంచి కొండంత కనిపించే టార్గెట్ మీదే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ జోడీ.. అద్భుతమే చేసి చూపించింది. ప్రెజర్‌ని పిచ్ కింద తొక్కిపెట్టి.. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. నెమ్మదిగా టార్గెట్ వైపు కదిలింది. ఆస్ట్రేలియా వైపు నిలిచిన విజయాన్ని.. మళ్లీ భారత తీరాలకు చేర్చింది. టీమ్‌లోని మిగతా ప్లేయర్లంతా.. అస్సలు ప్రెజర్‌కి లోనవకుండా.. పద్ధతిగా బ్యాటింగ్ చేయడంతో.. భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది. ఒత్తిడిని తట్టుకుంటూ, ఎలాంటి తడబాటుకు లోనవకుండా.. పట్టుదలతో గెలుపు తీరాలకు చేరింది భారత్. ఈసారి మ్యాచ్‌తో పాటు 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను కూడా గెలిచింది టీమిండియా. అందుకే.. ఈ రికార్డ్ ఛేజింగ్.. భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప చాప్టర్‌గా నిలిచిపోతుంది.

339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిచడం ఇదే తొలిసారి
వరల్డ్‌కప్ సెమీస్‌లో.. ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించింది కేవలం గెలుపు కాదు. అత్యంత పటిష్టమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై అసాధారణమైన పోరాట స్ఫూర్తికి నిదర్శనం. మహిళల వన్డే క్రికెట్‌లో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. పైగా.. ఆస్ట్రేలియా ఏడు సార్లు వరల్డ్ కప్ గెలిచి.. టోర్నీలో వరుసగా అజేయంగా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్. అలాంటి.. జట్టుపై సెమీ ఫైనల్‌లో గెలవడమంటే.. మామూలు విషయం కానే కాదు. పైగా.. ఇది నాకౌట్ మ్యాచ్. భారీ టార్గెట్. ప్రెజర్.. పీక్‌లో ఉంటుంది. అయినప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు ఆడిన తీరు, ఆ షాట్లు చూస్తే.. వారు ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదన్న విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. టార్గెట్ ఎంత భారీగా ఉన్నా.. అనవసరమైన రిస్క్‌లు తీసుకోలేదు. అవసరమైనప్పుడల్లా బౌండరీలు బాదారు. విజయం సాధించే దాకా.. పట్టుదలతో ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ప్రెజర్ ఫ్రీ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయిన భారత్
ఈ భారీ టార్గెట్‌ని ఛేదించడానికి.. భారత్ ప్రెజర్ ఫ్రీ అప్రోజ్ సూత్రాన్ని ఫాలో అయింది. క్రీజులోకి దిగినప్పటి నుంచే.. క్లియర్ ఇంటెంట్‌తో ఉన్నారంతా. ప్రారంభం నుంచే పరుగులు చేయాలనే స్పష్టమైన ఉద్దేశం కనిపించింది. వికెట్లు పడినా.. పరుగుల్లో వేగం తగ్గలేదు. జెమీమా-హర్మన్ చేసిన 167 రన్స్ పార్ట్‌నర్‌షిప్.. టార్గెట్‌ని చిన్నది చేసింది. ఇదే కేవలం.. ఆట మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం, నిలకడ, పట్టుదలకు అద్దం పట్టే అపూర్వమైన విజయం. గెలవాలనే ఆశ ఉంటే సరిపోదు.. గెలిచేందుకు ఆత్మవిశ్వాసం కూడా కావాలి. ప్రత్యర్థి గురించి ఆలోచించి.. భయానికి లొంగిపోవద్దు. కొండంత టార్గెట్ ఉన్నా.. ఛేదింగలమనే ధైర్యం కావాలి. లక్ష్యం ఎంత పెద్దదిగా ఉన్నా.. చేరాల్సిన గమ్యం ఎంత దూరమైనా.. ముందే ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అదే మనల్ని నిలబెడుతుంది. ప్రపంచం ముందు విజేతగా నిలుపుతుంది. టీమిండియా విక్టరీ నుంచి.. మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠమేంటి?

జీవితానికి అవసరమన గొప్ప జీవిత పాఠం
టీమిండియా.. ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయం, కేవలం క్రికెట్‌కు సంబంధించినది మాత్రమే కాదు. మన నిత్య జీవితానికి ఎంతో అవసరమైన గొప్ప జీవిత పాఠాన్ని నేర్పింది. సెమీస్‌ దాకా రాకముందే.. లీగ్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు మనల్ని చితక్కొట్టారు. అయినా సరే.. సెమీ ఫైనల్లో ప్రత్యర్థిని చూసి భయపడలేదు. 339 రన్స్ టార్గెట్ ఇచ్చినా.. గెలిచే దాకా క్రీజులోనే నిలబడ్డారు. దాదాపు అసాధ్యమైన భారీ టార్గెట్‌ని చూసి భయపడలేదు. టార్గెట్ ఎంత కష్టంగా అనిపించినా.. మన సామర్థ్యం ముందు అది చిన్నదేనని నమ్మారు. ముందుగా మన ప్లేయర్లు.. తమ మనసులో ఉన్న భయాన్ని గెలిచారు. ఆ తర్వాతే.. గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా రూపంలో ఎదురైన సవాల్‌ని అధిగమించి.. మ్యాచ్ గెలిచారు. నాకౌట్ మ్యాచ్‌లో అతిపెద్ద టార్గెట్ ఛేజ్ చేసేటప్పుడు.. ప్రెజర్ మామూలుగా ఉండదు. ఆ ఒత్తిడిని భయంగా కాకుండా.. తమ సత్తా నిరూపించుకునే అవకాశం చూశారు.. జెమీమా, హర్మన్ ప్రీత్. ఇదే పరిస్థితి.. ఉద్యోగం, వ్యాపారం, పరీక్షల్లో ఎదురైనా.. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒత్తిడికి లొంగితే.. ఓటమి తప్పదు. ఆ ప్రెజర్‌ని.. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు.. ఓ అవకాశంగా మలచుకోవాలి.

ఓటమి అంచుకు చేరినా.. గెలిచే దాకా పోరాడిన టీమిండియా
టార్గెట్ భారీగా ఉన్నప్పుడు.. వికెట్ పడకుండా, దూకుడుగా బ్యాటింగ్ చేయకుండా.. ప్రతి 10 ఓవర్లకు 50 నుంచి 60 పరుగులు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది.. మన లక్ష్యం ఎంత దూరంగా ఉన్నా.. ఎంత పెద్దదిగా ఉన్నా.. దాన్ని చేరుకునేందుకు ముందుగా చిన్న మైల్ స్టోన్స్‌ని ఏర్పరచుకోవాలి. ఒకేసారి భారీ లక్ష్యాన్ని చూస్తే నిరాశ ఆవరిస్తుంది. ప్రతి చిన్న గమ్యాన్ని దాటుకుంటూ ముందుకు సాగితే.. గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఓటమి అంచుకు చేరినా.. గెలిచే దాకా టీమిండియా ప్లేయర్లు పోరాడారు. మధ్యలోనే ఆగిపోయినా.. ఏమాత్రం తడబడినా.. అప్పటిదాకా చేసిన పోరాటం వృథా అవుతుంది. మన పట్టుదలే మనల్ని విజేతగా నిలుపుతుందనడానికి.. టీమిండియా సాధించిన విజయమే గొప్ప నిదర్శనం. మన మహిళా ప్లేయర్లు ఫాలో అయింది కూడా. పద్ధతిగా పని మొదలుపెట్టి.. తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. అందుకే.. కొండత లక్ష్యం కూడా చిన్నబోయింది. ఇలాంటి ఒక రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్‌కి.. వారి ధైర్యం, ఆత్మవిశ్వాసమే కారణం. టార్గెట్ పెద్దదిగా ఉందని.. ముందే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే.. చరిత్ర సృష్టించే విజయం సాధ్యమయ్యేది కాదు. క్రికెట్‌లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా.. మానసిక బలమే చాలా ముఖ్యం. అవతలి టీమ్ ఎలాంటిదైనా.. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో పోరాడే ధైర్యం కావాలి.

Also Read: గ్రేటర్ వరంగల్.. వరదలకు శాశ్వత పరిష్కారమే లేదా..?

ఛేజ్ చేయలేమనేంత టార్గెట్ ఉన్నా.. ఆస్ట్రేలియాపై గెలవగలమనే నమ్మకం హర్మన్ సేనలో ఉన్నట్లే.. మనలోనూ.. దేనినైనా సాధించగలమనే నమ్మకం కలగాలి. ఇతరుల విమర్శలను, పోటీని చూసి భయపడకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. టార్గెట్ చేరే దాకా.. స్థిరంగా, నిలకడగా ఉండాలి. ఎలాంటి సమస్యలొచ్చినా.. లక్ష్యం చేరే దాకా దృష్టి మరలకుండా చూసుకోవాలి. టీమిండియా ఆఖరి బంతి వరకు పోరాడినట్లే.. నిజ జీవితంలోనూ.. ఓటమి అంచుకు వచ్చినా.. అలాగే నిలబడిపోవాలి. వైఫల్యం ఎదురైనా.. వెనుతిరగకుండా పోరాడాలి. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునే పాఠమే.. మనల్ని విజయ తీరాలకు చేర్చుతుంది. టీమిండియా ఇచ్చే విక్టరీ మెసేజ్ ఒకటే. ఆత్మవిశ్వాసం అనేది కేవలం ఆశ కాదు. అదొక.. శక్తిమంతమైన సాధనం. మన శక్తిని మనం నమ్మినప్పుడే.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలం. అప్పుడే.. ప్రపంచం ముందు విజేతగా నిలవగలం.

Story By Anup, Bigtv

Related News

TS Cabinet: విస్తరణకు లైన్ క్లియర్ ఆ ఇద్దరికీ కీలక పదవులు?

CM Chandrababu: బాబు ముందుకు కొలికపూడి Vs కేశినేని చిన్ని పంచాయితీ!

AP Politics: జగన్, షర్మిల.. అవుట్ ఆఫ్ కవరేజ్..!

Jubileehills Bypoll: హీటెక్కిన జూబ్లీ వార్.. ఓటర్లు ఎటువైపు?

Trump Orders: అణు పరీక్షలకు ట్రంప్ ఆర్డర్.. ప్రపంచ యుద్ధానికి ఇది ఆరంభమా?

Bhairav Battalion: భారత్ ఆర్మీలోకి భైరవ్ బెటాలియన్.. పాక్, చైనాకు చుక్కలే!

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Big Stories

×