E-Paper
Advertisement

Jubilee Hills Bipole: బస్తిమే సవాల్.. జూబ్లీ గడ్డ.. ఎవరి అడ్డా?

Jubilee Hills Bipole:  బస్తిమే సవాల్.. జూబ్లీ గడ్డ.. ఎవరి అడ్డా?
Advertisement

Jubilee Hills Bipole: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ చేరుకుంటుంది. నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడుపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న జూబ్లీహిల్స్ రాజకీయంలో పైచేయి సాధించేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్యే అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోందట.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే ప్రధాన పోరు:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది. బైపోల్‌లో ఏపార్టీ గెలుస్తుందా అనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమై నెలరోజులు గడుస్తుంది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. నువ్వా..నేనా అన్నట్లుగా ప్రచార సరళి కొనసాగిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పార్టీల సీనియర్ నేతలందరికి ప్రధాన పక్షాలు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ రెండు పార్టీల మధ్యే పోరు కొనసాగబోతుందన్న టాక్ వినిపిస్తోంది.

పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్:

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఎలాగైనా జూబ్లీహిల్స్ లో విజయం సాధించి తన ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అంతేకాదు రాబోయే గ్రేటర్, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ విజయం దోహదపడుతుందని భావించి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే అభ్యర్థిని ఎంపికను చేసి బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. మరోవైపు మంత్రివర్గంతో పాటు సీనియర్ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది.

బీఆర్ఎస్ వైఫల్యాలే ప్రధాన ప్రచార అస్త్రాలు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను, కాంగ్రెస్ రెండేళ్లలో చేసిన అభివృద్ధి, జూబ్లీహిల్స్ లో గెలిస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. పేదల కోసం చేపడుతున్న సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు నియోజకవర్గంలో పదేళ్లుగా చేయని అభివృద్ధి పనులను ఎత్తిచూపుతున్నారు. ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్నివర్గాల ప్రజలతో భేటీ అవుతూ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకొని ప్రజల ముందుకు వెళ్తున్నారు.

కాంగ్రెస్ మైనార్టీలను విస్మరించిందంటున్న బీఆర్ఎస్:

Advertisement

బీఆర్ఎస్ పార్టీ సైతం అధికారంలో ఉన్న పదేళ్లు చేసిన అభివృద్ధి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను వివరిస్తోంది. గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కారు హైడ్రాతో ఇళ్లు కూలుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో వైఫల్యం, జాబ్ క్యాలెండర్, మహిళలకు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని, విద్యారంగం కుంటుపడిందని, మైనార్టీలను విస్మరించిందని, వక్ఫ్ చట్ట సవరణకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనే అంశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

డివిజనల్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించిన బీఆర్ఎస్:

అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలందర్నీ ప్రచారంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇలా అన్ని వర్గాలకు చెందిన నేతలతో వారివారి కులాల ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. డివిజనల్ల వారీగా వారందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ప్రతి ఓటర్ ను కలిసేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్:

ఆ క్రమంలో ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రత్యర్ధుల వైఫల్యాలను ఎత్తిచూపడమే కాకుండా… వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నారు. పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పోటీపడి మరి వారి వ్యక్తిగత అంశాలను సైతం ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ అవుతున్న ఘటనలు ఉన్నాయి. అంతేకాదు కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమకు సహకరిస్తున్నారని కాంగ్రెస్, లేదు తమకు ఆపార్టీలోని కొందరు తమకు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ ఇలా రెండు పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలు పెడుతూ ఎన్నికల వేడి పెంచేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన వారు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అంతేకాదు దూషణలు చేస్తున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు, కార్టూన్లతోనూ ప్రచారం ఊపందుకుంది.

ప్రచారంలో వెనుక పడ్డ బీజేపీ:

మరోవైపు బీజేపీ పార్టీ గట్టిపోటీఇస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ ఆపార్టీ ప్రచారంలోనే వెనుకబడిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో పాటు కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తుండగా…పార్టీ సీనియర్లు దూరంగా ఉండటం ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. తొలుత తామే విజయం సాధిస్తామని కొంతమంది నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం ప్రచారంలోనే వెనుకబడినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడోస్థానానికే పరిమితం అవుతుందని ఆపార్టీలోని కొందరు నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల భవిష్యత్ ను సైతం ఈ ఉప ఎన్నికల ఫలితాలతో వెల్లడికానుంది.

Story by Apparao, Big Tv

Related News

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. చిక్కుల్లో వెబ్ సైట్..?

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

నామినేటెడ్ పదవుల పంపిణీలో ఢిల్లీ హవా.. అసంతృప్తిలో కాంగ్రెస్ లీడర్లు!

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×