BigTV English

Perni Nani Arrest: అడ్డంగా ఇరుక్కున్న పేర్ని నాని.. అరెస్ట్ తప్పదా?

Perni Nani Arrest: అడ్డంగా ఇరుక్కున్న పేర్ని నాని.. అరెస్ట్ తప్పదా?

వరుసగా జైలు బాట పడుతున్న జగన్ సన్నిహితులు

వైసీసీ సీనియర్లు, కీలక నేతలు, జగన్‌కు సన్నిహితులైన అధికారులుఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి, కొమ్మినేని, రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప.. ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తరువాత ఒకరుగా జైలు పాలవుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.


జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు

అధికారంలో ఉండగా నిబంధనలకు తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా చేసిన అక్రమాలు, అవినీతి కారణంగానే ఈ అరెస్టులు అన్న క్లారిటీ ఇప్పటికే ప్రజలలో కనిపిస్తోందంటున్నారు. ఇక వైసీపీ మౌత్ పీస్ లాంటి చానల్ ఇటీవల నిర్వహించిన చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, వాటికి వంతపాడినట్లుగా వ్యవహరించిన సదరు చానల్ ఇన్ పుట్ ఎడిటర్ కొమ్మినేని అరెస్టయ్యారు.

సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి

కృష్ణంరాజుల వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను ఉద్దేశించి వైసీపీ సీనియర్ నేత, పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. సజ్జలపై కేసులు నమోదవుతుండటంతో ఆయన కూడా నేడో రేపో కటకటాలు లెక్కించక తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఇరుక్కున్న పేర్ని నాని

సరిగ్గా ఈ తరుణంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో గత ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారంట. ఆ కేసులో పేర్ని నాని అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.

అనుచరులతో అత్యవసర సమావేశం పెట్టిన మాజీ మంత్రి

ఆ భయంతోనే హడావుడిగా నాని పార్టీ నాయకులు, శ్రేణులు, తన అనుచరులతో తాజాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారంట. ఈ సమావేశంలో ఆయన పోలీసులపై, తెలుగుదేశం కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సందర్భం లేకుండా గతంలో రేషన్ బియ్యం అక్రమాల విషయంలో తన భార్యను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, వైసీపీ నేతలను జైల్లో వేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తనతో పాటు తన భార్యపై తప్పుడు కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. తన భార్యను సీఐ ఇష్టమొచ్చినట్లు తిట్టారని… ఆ రోజే మానసికంగా చనిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకు ఇంతా తిరిగి ఇస్తామని వార్నింగులు

రాజకీయాల్లో తిరిగే వాళ్ళు భార్యల పేరుతో వ్యాపారాలు పెట్టొద్దని పేర్ని నాని సూచించారు. అద్దెకు ఇవ్వడానికి గోడౌన్స్ నిర్మించి.. అక్కడ తన నమ్మకస్తుడిని పెడితే, సదరు వ్యక్తి అధికారులతో కలిసి తనను మోసం చేశారని అన్నారు. బియ్యం లెక్కల్లో తేడా వచ్చిన డబ్బును కడతానని జేసీకి చెప్పానన్నారు. కానీ ఆ తర్వాత ఆ లెటర్ పైవాళ్లకు చేరడంతో అక్రమ కేసులు పెట్టారన్నారు. కొంతమంది నాయకుల ఒత్తిళ్లతో అధికారులు గోడౌన్ సీజ్ చేస్తే.. కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి టైం నడుస్తోంది.. మన టైం వస్తుంది ఇంతకు ఇంతా తిరిగి ఇస్తాం అంటూ వార్నింగులకు దిగారు.

నకిలీ ఇళ్ల పట్టాలపై పేర్ని నాని వివరణలు

ఎన్నికల ముందు మచిలీపట్నం నియోజకవర్గంలో తన కొడుకు కిట్టు విజయం కోసం పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడా కేసులో అరెస్ట్ భయంతోనే ఆయన హడావుడిగా తనఅనుచరులతో మీటింగ్ పెట్టి మీడియా ముందుకొచ్చి ఇళ్ల పట్టాలపై వివరణలు ఇచ్చుకుంటున్నారు

అరెస్ట్ భయంతో పేర్ని నాని

తాను ఏ తప్పు చేయలేదని పేర్ని నాని చెప్పుకుంటున్నా.. నకిలీ పట్టాలకు సంబంధించి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారంట. ఆ కేసులో అరెస్టు భయంతోనే ఆయన టెన్షన్ పడుతున్నారంటున్నారు.

-Story By Apparao, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×