Air India flight: ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం కొన్ని గంటల తర్వాత వెనక్కి మళ్లింది. మూడు గంటలపాటు గాల్లో చక్కర్లు కొట్టింది ఆ విమానం. చివరకు ముంబైకి చేరుకుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. అసలు విషయం తెలిసి కాస్త కూల్ అయ్యారు. అసలేం జరిగింది?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీని కారణంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్ గగన తలాన్ని శుక్రవారం మూసి వేసింది. ఈ విషయం తెలియక శుక్రవారం తెల్లవారుజామున ముంబై నుంచి లండన్‌కు బయలుదేరింది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ131 విమానం.
మూడుగంటలపాటు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. అసలేం జరుగుతుందో తెలియక ప్రయాణికులు కంగారుపడ్డారు. తిరిగి ముంబైకి చేరుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇరాన్ తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. ఈ కారణంగా ఎయిరిండియా విమానం వెనక్కి వచ్చినట్టు సంబంధించి వర్గాలు చెబుతున్నమాట.
ఇదొక్కటే కాదు మొత్తం 16 విమానాలను దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడం చేసినట్టు తెలుస్తోంది. ఆకస్మిక నిర్ణయంతో ప్రయాణంలో ఉన్న విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం వెనక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
ALSO READ: తిరుమల భక్తులు గమనించండి.. గరుడ వారధి రూల్స్ మీ కోసం
ఈ సమస్య కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడంలో కొంత ఆలస్యం అయ్యింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలాగే ఇరాన్ తన గగనతలం ఎప్పటివరకు మూసి ఉంటుంది అనే దానిపై స్పష్టత రావాల్సివుంది. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నపరిణామాల నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సర్వీసులను నడపాలని ఆలోచన చేస్తున్నారు.
ఈ పరిస్థితులు చక్కబడే వరకు విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఎయిరిండియా ప్రయాణికుల కోసం ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఎయిరిండియా విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
AI130 – లండన్ హీత్రో-ముంబై – వియన్నాకు మళ్లించారు
AI102 – న్యూయార్క్-ఢిల్లీ – షార్జాకు మళ్లించారు
AI116 – న్యూయార్క్-ముంబై – జెడ్డాకు మళ్లించారు
AI2018 – లండన్ హీత్రో-ఢిల్లీ – ముంబైకి మళ్లించారు
AI129 – ముంబై-లండన్ హీత్రో – ముంబైకి తిరిగి వచ్చారు
AI119 – ముంబై-న్యూయార్క్ – ముంబైకి తిరిగి వచ్చారు
AI103 – ఢిల్లీ-వాషింగ్టన్ – ఢిల్లీకి తిరిగి వచ్చారు
AI106 – న్యూవార్క్-ఢిల్లీ – వియన్నాకు మళ్లించారు
AI188 – వాంకోవర్-ఢిల్లీ – జెడ్డాకు మళ్లించారు
AI101 – ఢిల్లీ-న్యూయార్క్ – ఫ్రాంక్‌ఫర్ట్/మిలన్‌కు మళ్లించారు
AI126 – చికాగో-ఢిల్లీ – జెడ్డా
AI132 – లండన్ హీత్రో-బెంగళూరు – షార్జాకు మళ్లించబడింది
AI2016 – లండన్ హీత్రో-ఢిల్లీ – వియన్నాకు మళ్లించబడింది
AI104 – వాషింగ్టన్-ఢిల్లీ – వియన్నాకు మళ్లించబడింది
AI190 – టొరంటో-ఢిల్లీ – ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించబడింది
AI189 – ఢిల్లీ-టొరంటో – ఢిల్లీకి తిరిగి రావడం
#TravelAdvisory
Due to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…
— Air India (@airindia) June 13, 2025