E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెట్రోల్ బంకుల దగ్గర అసలేం జరుగుతోంది? ఒక్క రూమర్.. రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం!

పెట్రోల్ బంకుల దగ్గర అసలేం జరుగుతోంది? ఒక్క రూమర్.. రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం!
Advertisement

Petrol Shortage: ఎందుకైనా మంచి కొనేద్దామనే లెక్కలు! మొత్తంగా.. పెట్రోల్, డీజిల్ కష్టాలు మళ్లీ మొదలైపోయాయ్. కొన్నిరోజుల కిందటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ప్రాబ్లమ్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఈసారి.. ముందుగా ఏపీలో మొదలైంది. అక్కడి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు మొదలయ్యాయ్. నో స్టాక్ బోర్డులు కనిపించాయ్. పెట్రోల్ షార్టేజ్ అనే మెసేజ్ వైరల్ అయింది. అక్కడ మొదలైన రెండు, మూడు రోజుల్లోనే.. తెలంగాణలోనూ, హైదరాబాద్‌లోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ బంక్‌కు వెళ్లినా రద్దీ కనిపిస్తోంది. కిలోమీటర్ల క్యూలు, గంటలకొద్దీ పడిగాపులు తప్పడం లేదు. కొన్ని చోట్ల అయితే.. నో స్టాక్ బోర్డులు, ఖాళీగా మారిన పెట్రోల్ బంకులే దర్శనమిస్తున్నాయ్. అధికారులేమో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చెబుతున్నారు. కానీ.. జనం మాత్రం వాళ్లు అలాగే చెబుతారు.. పెట్రోల్ దొరక్కపోతే మా పరిస్థితేంటి? అనే ఆలోచనలతో.. బంకులకు పరుగులు పెడుతున్నారు. అవసరం కొద్దీ కొనేవాళ్లకన్నా.. ప్యానిక్ కొనుగోళ్లతోనే బంకులు రద్దీగా మారిపోయాయ్.

బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

ఏపీలో సిచ్యువేషన్ చూస్తే.. అక్కడ పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరడం లేదు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే.. స్టాక్ ఉన్న బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయ్. కొన్ని చోట్ల బంకులు పూర్తిగా మూతపడ్డాయ్. దాంతో.. అక్కడిదాకా వెళ్లి.. వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు వాహనదారులు. ఆంధ్రాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా డీజిల్ డిమాండ్ ఎక్కువగా ఉంది. స్టాక్ ఉన్న బంకుల దగ్గర.. ట్రాక్టర్లు, లారీలు క్యూ కట్టాయ్. కొందరైతే.. డబ్బాలు వెంట తెచ్చుకొని మరీ పెట్రోల్, డీజిల్ తీసుకెళ్తున్నారు. కొన్ని పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులు మాత్రం లిమిట్‌గానే పెట్రోల్ పోస్తున్నారు.

అవసరానికి మించి కొనొద్దు

Advertisement

ఈ షార్టేజ్‌తో.. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. కనీసం.. ఐదారు పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగితే తప్ప పెట్రోల్ దొరికే పరిస్థితి లేదు. కొన్నిసార్లు.. ఎన్ని బంకులు తిరిగినా అవసరమైనంత పెట్రోల్ దొరుకుతుందనే గ్యారంటీ కూడా లేకుండా పోయింది. చాలా నియోజకవర్గాల్లో పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయ్. కొన్ని పట్టణాల్లో.. ఒకట్రెండు బంకుల్లో మాత్రమే స్టాక్ ఉండటంతో.. అంతా బారులు తీరారు. ఇంధన కొరతతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొద్దని అధికారులు కోరుతున్నారు.

తెలంగాణలోనూ ఇంధన టెన్షన్

తెలంగాణలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయ్. చాలా బంకుల దగ్గర భారీ క్యూలు మొదలయ్యాయ్. ముఖ్యంగా.. డీజిల్ స్టాక్ ఉన్న బంకుల దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది. అధికారులు మాత్రం పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చెబుతున్నా.. జనం మాత్రం అవేవీ పట్టించుకోవట్లేదు. ఎంతకైనా మంచిదనే ఆలోచనతో కొందరు, స్టాక్ అయిపోతే మళ్లీ ఎప్పటికి దొరుకుతుందోనన్న భయంతో కొందరు.. పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తున్నారు.

ఫుల్ ట్యాంక్ ట్రెండ్

Advertisement

చాలా మంది వాహనదారులు.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఆయిల్ రాదని భావిస్తున్నారు. ముఖ్యంగా.. యుద్ధం వల్ల నెలకొన్న ఉద్రిక్తతలతో.. చమురు సప్లై ఆగిపోతుందని, ఆయిల్ దిగుమతులు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారాలతో.. పబ్లిక్‍‌లో ప్యానిక్ మొదలైంది. దాంతో.. సాధారణంగా బైక్‌లో 200 నుంచి 300 పెట్రోల్ పోయించుకునే వాళ్లంతా.. ఇప్పుడు కొరత తలెత్తుతుందనే భయంతో అంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీనివల్ల.. బంకుల్లో స్టాక్ ఒక్కసారిగా ఖాళీ అవుతోంది.

ఏపీలో వందల బంకులు మూత

బేసిగ్గా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ డిమాండ్‌కు తగ్గట్లుగా.. పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తాయి. కానీ, ఒక్కసారిగా డిమాండ్ 50 శాతం పెరగడంతో.. ట్యాంకర్లు బంకులకు చేరేలోపే నిల్వలు అయిపోతున్నాయ్. ఏపీలో అయితే.. వందలాది బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయ్. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లాంటి నగరాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అధికారులు కూడా ఎప్పటికిప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్యానిక్ బయింగ్ కనిపిస్తోంది.

ఇంధనంపై రూమర్లు ఫేక్

తెలంగాణ సివిల్ సప్లైస్ అధికారులు అయితే, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నారు. అనవసరంగా బంకులకు వెళ్లొద్దంటున్నారు. నిజానికి.. పెట్రోల్ సప్లై నిలిచిపోతుందనే వార్తల్లో నిజం లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. భయంతో అంతా ఫుల్ ట్యాంక్ బాట పట్టడంతో.. కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఇది.. ఇతర అత్యవసర వాహనాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికే.. అధికార యంత్రాంగం కూడా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్యానిక్ బయింగ్‌తో.. పెట్రోల్, డీజిల్ సప్లై చైన్‌పై ప్రెజర్ పెరిగింది. అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తే.. ఒకట్రెండు రోజుల్లోనే పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఒక్క ‘నో స్టాక్’ బోర్డు.. రెండు రాష్ట్రాల్లో కలకలం

ఒక్క నో స్టాక్ బోర్డు.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్‌ని మార్చేసింది. అప్పుడప్పుడూ అరుదుగా కనిపించే సీన్లని.. ఇప్పుడు రోజూ చూపిస్తోంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే మాట.. అగ్గిలా వ్యాపించింది. జనంలో భయం పుట్టించింది. నిజానికి.. దేశంలో చమురు నిల్వలు అయిపోలేదు. సప్లై చైన్ దెబ్బతినలేదు. మరి.. ఎందుకింత గందరగోళం తలెత్తింది? దీని వెనకున్న కారణమేంటి?

పనులు మానేసి బంకుల వద్ద క్యూ

ఈ జమానాలో.. అబద్ధం అన్నింటికంటే వేగంగా ట్రావెల్ చేస్తుంది. ఎలాంటి.. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండానే! ఇందుకు.. పెట్రోల్ ప్యానిక్.. సూపర్ ఎగ్జాంపుల్. ఇంధన కొరత మొదలైందని, పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోతుందనే భయాందోళన.. అందరినీ పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టేలా చేసింది. పబ్లిక్ అంతా పనులు మానుకొని మరీ బంకుల ముందు వాలిపోయారు. ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు.. బారులు తీరారు. కొందరైతే, బాటిళ్లు, డబ్బాలు, క్యాన్లలోనూ నింపుకొని వెళ్తున్నారు. కానీ.. ఇదంతా నిజమైన కొరత వల్ల వచ్చిన పరిస్థితి కాదు.

ఏపీ న్యూస్.. తెలంగాణలో టెన్షన్

ఎక్కడ కొరత వస్తుందోనని తలెత్తిన భయం వల్ల వచ్చిన పరిస్థితులివి! పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోతోంది.. ఇంకొన్నాళ్ల వరకు పెట్రోల్ దొరకదన్న వదంతులు బాగా సర్క్యులేట్ అయ్యాయ్. ఏపీలో పెట్రోల్ దొరకట్లేదనే న్యూస్.. పక్కనున్న తెలంగాణలోనూ దడ పుట్టించింది. ఇప్పటికే, పశ్చిమాసియా యుద్ధంతో ఆయిల్ సప్లైపై అనిశ్చితి నెలకొందనే న్యూస్ చూసిన జనం.. నిజంగా పెట్రోల్ కొరత ఉందా? లేదా? అని పూర్తిగా తెలుసుకోకుండానే.. పెట్రోల్ బంకులకు క్యూ కట్టేశారు. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల ముందు దర్శనమిచ్చిన నో స్టాక్ బోర్డులు కూడా జనాన్ని మరింత భయంలోకి నెట్టేశాయ్. అంతే, దెబ్బకు అంతా బండ్లేసుకొని.. బంకుల ముందు బారులు తీరారు. అంతే.. బంకుల్లో ఉండాల్సిన సాధారణ స్టాక్ ఖాళీ అయిపోయింది. ఇది.. చైన్ రియాక్షన్‌లా మారి లేని ప్యానిక్‌ని క్రియేట్ చేసింది.

పబ్లిక్ ప్యానిక్‌తో పెరిగిన ఇంధన ఒత్తిడి

అవసరం లేకపోయినా.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు చేస్తుండటంతో.. రోజువారీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్యానిక్ వల్ల.. 50 శాతానికి పైగా కృత్రిమ కొరత పెరిగింది. జనం కూడా పెద్దగా ఆలోచించకుండా, నిజాలని నిర్ధారించుకోకుండా, పెట్రోల్ దొరుకుతుందో, లేదోననే టెన్షన్‌తో ఎక్కువగా కొనేస్తున్నారు. దాంతో.. నిజంగా అవసరమున్న వాళ్లకు దొరకట్లేదని చెబుతున్నారు. పబ్లిక్ అనవసరంగా ప్యానిక్‌ అవ్వొద్దని.. పెట్రోల్ బంక్ డీలర్లు చెబుతున్నారు.

సప్లై సేఫ్.. ప్యానిక్ వల్లే సమస్య

నిజానికి.. ఆయిల్ సప్లై దెబ్బతినలేదు. పెట్రోల్ నిల్వలు బాగానే ఉన్నాయ్. ఇంధన సరఫరాకు అంతరాయం లేదు. ఆయిల్ డిపోల దగ్గర తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయ్. రిఫైనరీల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు రావడంలో కొంత ఆలస్యమవుతోంది అంతే! కానీ, సప్లై ఎక్కడా ఆగలేదు. సివిల్ సప్లైస్ అధికారులు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దని, బంకుల దగ్గర రద్దీ పెరగడం వల్లే స్టాక్ త్వరగా అయిపోతోందని చెబుతున్నారు. అయినాసరే, జనం ఫుల్ ట్యాంకులు చేయించేసుకోవాలని.. ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు.

బంకుల వద్ద టైమ్ వేస్ట్

ఒక్కసారిగా పెట్రోల్ బంకులపై పడటంతో.. డిమాండ్ వర్సెస్ సప్లై గ్యాప్ పెరిగి బంకులు ఖాళీ అవుతున్నాయ్. పబ్లిక్ కూడా వదంతులు నమ్మి, లేనిపోని భయాలకు పోతే.. బంకుల దగ్గర టైమ్ వేస్ట్ అవడమే కాదు, అనవసరమైన గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయ్. ఇలాంటి సమయాల్లో.. అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలి. సరైన సమాచారం ఎంత బలమో, తప్పుడు సమాచారం అంతకంటే ప్రమాదకరం. పెట్రోల్, డీజిల్ కొరత మొదలైందనేది కేవలం భ్రమ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఇంకొన్నాళ్లకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.

Also read: ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

Story by: Anup, Big Tv

Related News

త్యాగాల ప్రతిరూపం నాన్న.. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం!?

Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

Black Rain: ఆకాశం నుంచి కురుస్తున్న మరణ శాసనం.. బ్లాక్ రెయిన్ దెబ్బకు మాస్కో వదిలి పారిపోతున్న జనం!

Yoga Benefits: ఫోన్ చూస్తూ డిప్రెషన్‌లోకి వెళ్తున్నారా?.. రోజుకు 10 నిమిషాల ఈ ట్రిక్‌తో మెదడు పవర్‌ఫుల్..!

NEET Reexam: నీట్ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్లు కొట్టేస్తూ పరీక్షకు గ్రీన్ సిగ్నల్!

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!

El Niño: నైరుతి రుతుపవనాలను మింగేస్తున్న ఎల్ నినో.. ఈ ఏడాది పంటలు దెబ్బతినే ఛాన్స్..!

Big Stories

×