E-Paper
Advertisement

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం
Advertisement

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూనే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఇంధన సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, కలెక్టర్లు, ఉన్నతాధికారులు నేరుగా ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. రవాణాలో అడ్డంకులు తొలగించి, ట్యాంకర్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరేలా చూడాలని పేర్కొన్నారు.

Advertisement

ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఆర్టీజీ (RTG) సెంటర్‌ను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ కొరత ఉంది? ఏ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది? అనే అంశాలపై ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక అందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కొందరు స్వార్థపరులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడే అవకాశం ఉందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను హెచ్చరించారు.

ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ, స్టాక్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ చొరవతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×