
టాప్ 1. చెంగీస్ ఖాన్
Ghengis Khan : ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అతి పెద్దది.. అతివిశాలమైన మంగోల్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్య స్థాపకుడు చెంగీస్ ఖాన్. అతని నాయకత్వంలో మంగోల్ జాతి మొత్తం ఏకమైంది. దీంతో మంగోల్ జాతీయలు ఒక శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారు. మంగోల్ సామ్రాజ్యం.. తూర్పు యూరప్ దేశాలైన రషియా, ఉక్రెయిన్, హంగేరిలతో పాటు గల్ఫ్ దేశాలు, పర్షియా(ఇరాన్) వరకు.. ఆ తరువాత, మెసపొటోమియా, టర్కీ, సెర్బియా, అల్బేనియా, స్లోవేనియా, మధ్య ఆసియా వరకు.. అలాగే చైనా నుంచి కొరియా వరకు విస్తరించి ఉండేది. దాదాపు ప్రపంచంలోని 22 శాతం భూమి వరకు మంగోల్ సామ్రాజ్యం సువిశాలంగా ఉండేది.
చెంగీస్ ఖాన్ అసలు పేరు టెముజిన్. అతను 1162లో తూర్పు మంగోలియాలోని అడవి తండాలో జన్మించాడు. 8 ఏళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. బాల్యం నుంచే టెముజిన్ చాలా కష్టాలు అనుభవించాడు. ఇంటి పెద్ద కొడుకు కావడంతో అతను కుటుంబ భారాన్ని మోసాడు. అలా పెద్దవాడైన చెంగీస్ ఖాన్ కేవలం ఇద్దరు మిత్రులతో కలిసి పెద్ద రాజ్యం స్థాపించాలని ప్లాన్ చేశాడు. అలా అతనితో యువకుడు కూడా కలిసి వచ్చారు. అలా అతను పెద్ద సైన్యం కూడాగట్టాడు. ముందుగా మంగోల్ జాతి తండాలతో యుద్ధం చేసి వారందరినీ ఏకం చేశాడు. ఆ తరువాత తన సైన్యాన్ని క్రమశిక్షణతో ఉండేలా రూపొందిచాడు. వెంటనే చైనా దేశంపై దండెత్తాడు. చైనాలో జిన్ సామ్రాజ్యం చాలా పెద్దది అయినా దానిపై పలుమార్లు గట్టి ప్లానింగ్‌తో దాడి చేసి చివరికి జిన్ చక్రవర్తిని ఓడించాడు.

ఆ తరువాత అనటోలియా ప్రస్తుత టర్కీ, గల్ఫ్ దేశాలతో యుద్ధాలు చేశాడు. వెళ్లిన ప్రతిచోట క్రూరంగా నరమేధం జరిపాడు. ముఖ్యంగా ముస్లిం దేశాలలో రక్తపాతం సృష్టించాడు. 1227 సంవత్సరంలో చెంగీస్ ఖాన్ చనిపోయాడు. అతని సువిశాల రాజ్యాన్ని అతని కొడుకులు కుబ్లాయి ఖాన్, హులాగు ఖాన్ పంచుకున్నారు. చెంగీస్ పాలనలో వ్యాపారం అభివృద్ధి చెందింది. మంగోల్ సామ్రాజ్యం చాలా సంవత్సరాలపాటు స్థిరంగా కొనసాగింది.
మంగోల్ సైన్యం ఎన్ని యుద్ధాలు గెలిచినా భారతదేశంలో ఓడిపోయింది. దానికి కారణం ఆ సమయంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ భారతదేశంలో వారిని చీల్చిచెండాడు. మంగోల్ సైనికుల తలలు తన రాజ్య సరిహద్దులకు వేలాడదీశాడు.
Top 7 World Conquerors : ప్రపంచంలోనే టాప్ 7 పరాక్రమవంతులు.. వీళ్లు చాలా పవర్‌ఫుల్!
క్లిక్ చేయండి