Top 7 World Conquerors : ప్రపంచంలోనే టాప్ 7 పరాక్రమవంతులు.. వీళ్లు చాలా పవర్‌ఫుల్!

Top 7 World Conquerors : ప్రపంచంలోనే టాప్ 7 పరాక్రమవంతులు.. వీళ్లు చాలా పవర్‌ఫుల్!

Share this post with your friends

Top 7 World Conquerors : ప్రపంచ చరిత్రలో కొంతమంది అసాధారణ వ్యక్తులు జన్నించారు. వారు తమ జీవితంలో సాధించిన విజయాలతో ప్రపంచ స్వరూపాన్నే మార్చేశారు. అలాంటి పరాక్రమవంతులలో టాప్ 7 లిస్టుని ఒకసారి చూద్దాం.

7. నెపోలియన్


నెపోలియన్ బోనపార్ట్ ఆగస్టు 15,1769 సంవత్సరం ఫ్రాన్స్‌లోని కార్సికా దీవిలో జన్మించాడు. 1792లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరుగిన ఫ్రెంచ్ విప్లవంలో నెపోలియన్ పాల్గొన్నాడు. ఫ్రెంచ్ నౌకాదళాన్ని నాశనం చేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం పంపిన భారీ నౌకలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ తరువాత 1795లో అతను ఫ్రెంచ్ దేశ కమాండర్ ఇన్ చీఫ్(సర్వ సైన్యాధ్యక్షుడు) అయ్యాడు. ఆ తరువాత యూరోప్ ఖండంలో ఆస్ట్రియో, ఇటలీ దేశాలతో యుద్ధం చేసి అద్భతమైన విజయాలు సాధించాడు. దీంతో అతని పేరు వేరే ఖండాల వరకు వ్యాపించింది. పరమ శత్రువు ఇంగ్లాండ్‌ను ఎన్నో యుద్ధాలలో ఓడించాడు. ఆ తరువాత 1804లో ఫ్రాన్స్ దేశానకి చక్రవర్తి అయ్యాడు.

నెపోలియన్ ఒక ఆరితేరిన మిలిటరీ ప్లానర్. ఫ్రాన్స్ దేశంలో ఒక పటిష్టమైన నావికా దళం ఏర్పాటు చేసిన ఘనగ నెపోలియన్‌కు దక్కుతుంది. చక్రవర్తి అయ్యాక ఇంగ్లండ్ మిత్ర దేశాలైన రషియా, ఆస్ట్రియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీలతో యుద్ధం చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. ఈ పరిణామాలతో నెపోలియన్ పేరు వింటే చాలు ఏ దేశ నాయకులకైనా వణుకు పుట్టేది.

1813లో లిప్‌జిగ్ యుద్ధంలో రషియా, ఆస్ట్రియా, ప్రషియా దేశాలు ఇంగ్లండ్ సహకారంతో నెపోలియన్ దళంతో భీకరంగా పోరాడాయి. ఆ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. అతడిని ఖైదు చేసి ఎల్బా అనే దీవిలో బంధించారు. కానీ అతను 1815లో ఆ జైలు నుంచి తప్పించుకొని మళ్లీ ఫ్రాన్స్ చేరుకొని మళ్లీ యుద్ద సన్నహాలు చేశాడు. అలా వంద రోజుల తరువాత మరో యుద్ధంలో 1815 జూన్ 15న అతను మళ్లీ ఓడిపోయాడు. ఆ తరువాత అతడిని సెయింట్ హెలెనా అనే ద్వీపంలో ఖైదు చేశారు.

ఆ జైలులో ఉన్నప్పుడు నెపోలియన్‌కు క్యాన్సర్ సోకి 1821లో మరణించాడు

6. జూలియస్ సీజర్

జూలియస్ సీజర్ క్రీస్తు పూర్వం రోమ్ నగరంలో 100 BCలో జన్మించాడు. రోమ్ దేశాన్ని రోమన్ మహా సామ్రాజ్యంగా మార్చడంలో కోలక పాత్ర పోషించాడు. రోమ్ దేశంలో అంతర్యయుద్ధం జరుగుతున్న సమయంలో అతని రాజకీయ జీవితం మొదలైంది. రోమ్ సైన్యంలో ఒక చిన్న అధికారిగా అతను ఉద్యోగం చేసేవాడు. ఆ తరువాత తన అద్భుతమైన ప్రతిభతో సైన్యంలో ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆ తరువాత గౌల్ దేశం (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల కూటమి)తో అతను 58 BC సంవత్సరం నుంచి 50 BC వరకు ఏడు సంవత్సరాలపాటు సుదీర్ఘ యుద్ధం చేసి విజయం సాధించాడు.

ఈ గెలుపుతో రోమ్ దేశ సంపద విపరీతంగా పెరిగింది. నలు దిక్కులా సీజర్ పేరు మార్మోగింది. ఆ తరువాత మళ్లీ 48 BC సంత్సరంలో పోంపెయి నగరంలో ఫార్సలస్ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో అతనికి వ్యతిరేకంగా రోమ్ దేశాన్ని పాలించే నాయకులున్నారు. వారందరినీ సీజర్ ఓడించాడు. సీజర్ యుద్ధం గెలిచాక వారంతా నగరం వదిలి పారిపోయారు. ఫలితంగా సీజర్ తనను తాను రాజుగా ప్రకటించాడు. ఒక నియంతలా పరిపాలన సాగించాడు.

ఆ తరువాత ఈజిప్ట్ దేశాన్ని జయించి అక్కడ అతని ప్రియురాలు క్లియోపాత్రాని సింహాసనంపై కూర్చోపెట్టాడు. కానీ 44 BC సంవత్సరంలో అతని అనుచరుడు బ్రూటస్, మరికొంతమంది శత్రవులు కుట్ర పన్ని సీజర్‌ని సింహాసనంపై కూర్చోబోతుండగా 25 సార్లకుపైగా పొడిచి చంపారు.

5. ఒట్టోమాన్ చక్రవర్తి సులేమాన్


భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఎలాగో.. ప్రపంచ చరిత్రంలో ఒట్టోమాన్ సామ్రాజ్యం కూడా అంతటి ప్రాముఖ్యం ఉంది. ఒట్టోమాన్ పాలకుల్లో చక్రవర్తి సులేమాన్ పాలన స్వర్ణ యుగంగా వర్ణించబడింది. పరిపాలనే కాదు.. రాజ్య విస్తరణ విషయంలోనూ సులేమాన్‌కు సరిసాటి ఎవరూ లేరు.

సులేమాన్ జీవితకాలంలో అతను మొత్తం యూరప్ ఖండాన్ని గడగడలాడించాడు. సెర్బియాతో యుద్ధంలో బెల్గ్రేడ్ నగరాన్ని జయించాడు. గ్రీస్‌తో యుద్ధం చేసి రోడ్స్ దీవిని ఆక్రమించాడు. ఆ తరువాత మహా శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం యుద్ధం చేసి వియన్నా నగరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. సులేమాన్ దండయాత్ర చేస్తున్నాడంటే యూరప్ రాజులు వణికపోయేవారు. సులేమాన్ శాసనలో ఒట్టోమాన్ సామ్రాజ్యంలో అనటోలియా(ప్రస్తుత టర్కీ దేశం), బాల్కన్(ప్రస్తుత అల్బేనియా, యుగోస్లేవియా), ఉత్తర ఆఫ్రికా ఖండం, దాదాపు గల్ఫ్ దేశాలన్ని, దక్షిణ యూరప్‌లోని కీలక భాగాలున్నాయి. సులేమాన్ జీవితంలో అతిముఖ్యమైనది హంగేరీతో చేసిన యుద్ధం. 1526 మోహాచ్ యుద్ధం అని దీనిని పిలుస్తారు. ఈ యుద్ధంలో యూరప్ దేశమైన హంగేరి సైన్యం గట్టిగా పోరాడింది. ఈ యుద్ధంలో హంగేరీ రాజు లూయిస్ చనిపోవడంతో అతని సైన్యం వెనుతిరిగింది. సులేమాన్ హంగేరిని కూడా ఆక్రమించుకున్నాడు.

సులేమాన్ పరాక్రమవంతుడే కాదు మంచి పరిపాలన కూడా కొనసాగించాడు. అతను తన రాజ్యంలో క్రమశిక్షణ ఉండే విధంగా చట్టాలు తీసుకువచ్చాడు. అతని హయాంలో సంస్కాృతిక, కళ, ఇంజినీరింగ్, వంటి విభాగాలు అభివృద్ధిని సాధించాయి. 1566 సెప్టెంబర్ 7న సులేమాన్ 71 ఏళ్ల వయసులో.. హంగేరిలోని షియర్ కోటను ఆక్రమించుకునేందుకు చేసే సమయంలో అనారోగ్యంతో చనిపోయాడు. అతని సమాధి పక్కనే ఒక మసీదు ఉంది. దాని కాపాలా దాదాపు 100 మంది ఉంటారు.

4. పర్షియా రాజు సైరస్ ది గ్రేట్


సైరస్ క్రీస్తు పూర్వం 600 BC సంవత్సరంలో పుట్టాడు. సైరస్ అకేమెనిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అకేమెనిడ్ సామ్రాజ్యాన్నిపర్షియా లేదా ఫార్సీ సామ్రాజ్యం అని కూడా అంటారు. పర్షియా అంటే ప్రస్తుత ఇరాన్ దేశం. సైరస్ కాలంలో పర్షియా సామ్రాజ్యం ప్రస్తుత టర్కీతో పాటు దాదాపు అరబ్బు దేశాల అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉండేది. 550 BC సంవత్సరంలో సైరస్ మహారాజు అయ్యాడు.

అతను మిడియా సామ్రాజ్యాన్ని యుద్ధంలో జయించాడు. ఆ తరువాత అతిపురుతనమైన బేబిలోన్ సామ్రాజ్యంపై దండెత్తి బేబిలోన్ నగరంతోపాటు మెసొటోమియా(ప్రస్తుత ఇరాక్, సిరయా దేశాలు)ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. సైరస్ తన జీవితకాలంలో చేసిన యుద్ధాలలో ఎప్పుడూ ఓడిపోలేదు. సైరస్ ఎక్కువగా యుద్ధంలో శత్రువులను మానసికంగా దెబ్బతీసేవాడు. అతని యుద్దనీతి తెలియక శత్రవులు తికమకపడేవారు.

సైరస్ మంచి పాలకుడని చరిత్రకారులు ప్రశంసిస్తారు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువులని, వారి కుటుంబాలను మర్యాదపూర్వకంగా చూసేవాడు. అతని పాలనలో మతకలహాలు లేవు. అన్ని మతాలకు సమప్రాధ్యానత ఇచ్చేవాడు. 530 BC సంవత్సరంలో సైరస్ మసజ్ అనే బంజారా జాతితో యుద్ధం చేస్తున్న సమయంలో మరణించాడు.

 టాప్ 3. క్రూర తైమూర్

క్లిక్ చేయండి


Share this post with your friends

ఇవి కూడా చదవండి

PM Modi Tupran | ప్రజలను పట్టించుకోకుండా ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం అవసరమా? : ప్రధాని మోదీ

Bigtv Digital

Telangana Elections : కీలకదశకు చేరుకున్న ఎన్నికల సమరం.. రాష్ట్రానికి జాతీయ నేతల క్యూ

Bigtv Digital

CM KCR: కేసీఆర్ నోట చంద్రబాబు మాట.. ప్రచారానికి వాడేసుకున్న సీఎం.. రేవంత్ కౌంటర్..

Bigtv Digital

Corporation Chairman | రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

Bigtv Digital

ODI : సిరీస్ పై బంగ్లాదేశ్ గురి.. గెలుపు కోసం టీమిండియా ఆరాటం..

BigTv Desk

Bandi Sanjay : ఓటమి భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం.. కేసీఆర్ బండి ఫైర్..

Bigtv Digital

Leave a Comment