BigTV English

Telangana Latest News: బావ మాట బంగారు బాట!

Telangana Latest News: బావ మాట బంగారు బాట!

Telangana Latest News: ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. జైలుకు వెళ్లాల్సి వచ్చినా రెడీ అంటూ కేటీఆర్ స్వయంగా ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు కేసీఆర్ ఫాంహౌస్ విడిచి రావడం లేదు. కవిత దాదాపు వేరు కుంపటి పెట్టుకున్నారు. కేటీఆర్‌తో హరీష్‌రావుకి విభేదాలున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితేంటని గులాబీశ్రేణుల్లో గుబులు కనిపించింది. అయితే తనపై ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ కేటీఆర్ విచారణ సందర్భంగా హరీష్‌రావు ఆయన వెన్నంటే ఉండటం ఆసక్తికరంగా మారింది


కేటీఆర్‌ని 8 గంటలు విచారించిన ఏసీబీ

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ విచారణ చేశారు. ఈ సారి ప్రధానంగా ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ సంస్థతో పరిచయం, రేసు నిర్వహణ కోసం జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల చెల్లింపుల వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే కేసులో కేటీఆర్‌ను జనవరి 9న ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం… రేస్‌ నిర్వహణపై ఎఫ్‌ఈవో ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండుసార్లు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే కేటీఆర్‌పై విచారణ సాగినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పి పంపించి వేశారు.


సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ అప్పగింతకు అంగీకరించిన కేటీఆర్

విచారణలో 2021 జనవరి నుంచి 2023 డిసెంబరు వరకు వాడిన సెల్‌ఫోన్‌తోపాటు ల్యాప్‌టాప్‌లను తమకు అప్పగించాలని అధికారులు కోరగా… కేటీఆర్‌ అంగీకరించినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది గంటలపాటు రెండు, మూడు విడతలుగా ఆయనను ప్రశ్నించారు. మధ్యలో భోజన విరామమిచ్చారు. విచారణ తతంగం మొత్తాన్నీ వీడియో చిత్రీకరించారు. ఆయన చెప్పిన వివరాలను నమోదు చేసి సంతకం తీసుకున్న తర్వాత విచారణ ముగిసిందని, అవసరమైతే మరోమారు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పి కేటీఆర్‌ను పంపించారు. అక్కడ నుంచి నేరుగా కేటీఆర్‌ బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు.

మహా అయితే అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యనించిన కేటీఆర్

ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయితే.. స్వయంగా కేటీఆరే తన అరెస్టుపై లీకులు ఇవ్వడం మరింత ఉత్కంఠ రేపింది.ఏసీబీ విచారణకు హాజరవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారాయన. ఎన్నిసార్లైనా విచారణకు వస్తానంటూనే.. మహా అయితే అరెస్ట్ చేస్తారంటూ.. మళ్లీ జైలుకెళ్లాల్సి వచ్చినా రెడీ అని వ్యాఖ్యానించారాయన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అయితే ఎట్టా? అసలే కేసీఆర్ ఆరోగ్యం బాలేదు. ఫ్యామిలీలో సఖ్యత లేదు. గులాబీ బాస్ ఫాంహౌజ్ విడిచిరావట్లేదు. ఎమ్మెల్సీ కవిత కారు దిగేశారు. అటు కేసీఆర్ రాక.. కవిత లేక.. కేటీఆర్ జైలు కెళితే ఏంటి పరిస్థితి? గులాబీ దండులో తీవ్ర ఆందోళన కనిపించింది.

విభేదాల ప్రచారానికి చెక్ పెట్టేలా వ్యవహరించిన హరీష్‌రావు

అయితే దానికి సమాధానంగా అన్నట్లు ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి హరీష్‌రావు వ్యవహరించారు. కేటీఆర్‌, హరీష్‌రావులకు విభేదాలున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో దానికి చెక్ పెట్టేలా హరీష్‌రావు వ్యవహరిస్తున్నారు. కవిత ఎపిసోడ్ తో కేసీఆర్ కుటుంబంలో మొదలైన రాజకీయ విభేదాలు, బిఆర్ఎస్ లో మొదలైన రాజకీయ ఆధిపత్య పోరుపై పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. అందులో భాగంగా కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్, హరీష్ లను ఉద్దేశించినవే అన్న ప్రచారం తెలంగాణ రాజకీయాలలో గట్టిగా జరిగింది.

హరీష్ రావుకి నోటీసులపై స్పందించని కవిత

కుటుంబ విభేదాలపై ప్రచారాన్ని బలపరుస్తూ కవిత కూడా తన జాగృతి సంస్థతో సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత మెల్లిమెల్లిగా దూరమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, హరీష్‌లకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నోటీసివ్వడంతో తన తండ్రికి మద్దతుగా గళం వినిపించిన కవిత హరీష్ విషయంలో మౌనంగా ఉండిపోయింది. అలాగే ఇటు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ విచారించడంపైనా కవిత రియాక్ట్ కాలేదు. దీనితో కవిత కు ఇప్పుడు అన్న కేటీఆర్, మామ హరీష్ ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు ఏసీబీ విచారణకు హాజరయిన కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

కేటీఆర్‌కు మద్దతుగా నిలిచిన హరీష్‌రావు

అయితే ఆ సమయంలో కేటీఆర్‌కు మద్దతుగా హరీష్‌రావు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పగ్గాలను కేటీఆర్ చేతిలో పెడితే హరీష్ పార్టీని రెండు ముక్కలుగా చీలుస్తారని, కేటీఆర్ ఎదుగుదలకు హరీష్ అడ్డగోడలా నిలబడ్డారని ప్రత్యర్ధులు విమర్శలు గుప్పించారు. అయితే ఆ ఆరోపణలన్నిటి సమాధానంగా హరీష్ పార్టీ పరంగా నాయకత్వ మార్పు నుంచి మరే ఇతర మార్పులకైనా కేసీఆర్ సిద్ధపడితే అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని, అది కేటీఆర్ నాయకత్వమైన తానూ స్వాగతిస్తానని గతంలోనే ప్రకటించారు. దానికి తగ్గట్లే తర్వాత కేటీఆర్, హరీష్‌రావులు వరుసగా భేటీ అయి తమ విభేదాలు లేవని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. తాజాగా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు హరీష్‌రావు ఆయన వెన్నంటే ఉండటంతో గులాబీశ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Also Read: పల్నాడులో పిన్నెల్లి పనికిరాడా?

హరీష్‌రావుకి సముచిత ప్రాధాన్యత ఇస్తున్న కేటీఆర్

అటు కేటీఆర్ కూడా తన తండ్రి కేసీఆర్ తో సమానంగా హరీష్ కు ప్రాముఖ్యత ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే కాళేశ్వరం వివాదంపై విచారణకు నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ తో పటు హరిష్‌ను కూడా సమర్థిస్తూ రేవంత్ సర్కార్ పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. మొత్తానికి బీఆర్ఎస్‌లో కవిత రేపిన చిచ్చు హరీష్, కేటీఆర్ లను దగ్గర చేసిందా? అన్న చర్చ మొదలైందిప్పుడు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×