BigTV English

KTR : లండన్‌కు కేటీఆర్.. పరారే పరారే!

KTR : లండన్‌కు కేటీఆర్.. పరారే పరారే!

KTR : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు కీలక దశకు చేరింది. A1 కేటీఆర్‌ను ఇటీవల సుదీర్ఘంగా విచారించారు. 8 గంటల పాటు ప్రశ్నించారు. రూ.44 కోట్ల గుట్టు లాగే ప్రయత్నం చేశారు. కానీ, కేటీఆర్ తెలివిగా తప్పించుకునేలా సమాధానాలు చెప్పారని అంటున్నారు. అయినా, వదిలేదేలే అనేలా ఏసీబీ మరింత డోసు పెంచింది. ఈసారి కేటీఆర్ సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్ తీసుకుని రమ్మని చెప్పింది. కారు రేసు జరిగిన కాలంలో ఆయన వాడిన గాడ్జె్ట్స్‌ను అందించాలని ఆదేశించింది. ఒకవేళ కేటీఆర్ ఆ ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఇచ్చినా అందులోని డేటాను డిలీట్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అలా చేసినా.. ఆ సమాచారం రీట్రీవ్ చేసేందుకు సైతం ఏసీబీ రెడీ అవుతోంది.


ఫోన్లు ఇచ్చేదేలే..?

అయితే, తన ఫోన్లు ఇవ్వాలా వద్దా? అనే దానిపై కేటీఆర్ తన న్యాయవాదుల బృందంతా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయవాదులు ప్రస్తావించినట్టు సమాచారం. లాయర్ల సలహా మేరకు తన సెల్‌ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఇవ్వకూడదని కేటీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయమూ వెలుగులోకి వచ్చింది.


లండన్‌కు కేటీఆర్.. అందుకేనా?

ఫార్ములా ఈ రేసు కేసు చాలా సీరియస్‌గా సాగుతోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఏ2 ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ సెలవులను అర్థాంతరంగా రద్దు చేసింది సర్కారు. ఈ నెల 21 కల్లా హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. సరిగ్గా ఇదే సమయంలో కేటీఆర్ సైతం లండన్ వెళుతుండటం ఆసక్తికరం. ఎందుకు..? ఐఏఎస్ అర్వింద్ ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఉన్నారు.. కేటీఆర్ బుధవారం నైట్ లండన్ వెళుతున్నారు.. ఈ రెండింటి మధ్య ఏదైనా లింక్ ఉందా? ఆ లింక్ అదేనా..? కేటీఆర్ లండన్ ట్రిప్ అందుకేనా..? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను కలిసి మేనేజ్ చేయడానికే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

ఏదో జరుగుతోందా?

ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో.. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పార్టిసిపేట్ చేస్తారనేది అఫిషియల్ ఇన్ఫర్మేషన్. “ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా” అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి కేటీఆర్ ప్రసంగిస్తారని చెబుతున్నారు. బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లి.. ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు కేటీఆర్. ఐఏఎస్ అర్వింద్ సైతం ఇంచుమించు ఆ సమయంలో ఫారిన్‌లోనే ఉండనున్నారు. మరి, ప్రచారం జరుగుతున్నట్టు వాళ్లిద్దరూ అక్కడ కలుస్తారా? ఫార్ములా-ఈ కేసులో ఏదో జరుగుతోందా?

Also Read : ఇజ్రాయెల్‌లో తెలంగాణ వాసి మృతి..

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×