BigTV English

Palnadu Politics: పల్నాడులో పిన్నెల్లి పనికిరాడా?

Palnadu Politics: పల్నాడులో పిన్నెల్లి పనికిరాడా?

Palnadu Politics: పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పుపై పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే దానిపై పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారంట. జిల్లా అధ్యక్షుడి మార్పుపై ఇప్పటికే అనేకసార్లు పల్నాడు పార్టీ శ్రేణులు డిమాండ్ చేసినా.. అధిష్టానం మాత్రం పాత నేత పిన్నెల్లి రామక‌ృష్ణారెడ్డినే కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఆయన సొంత నియోజకవర్గం మాచర్లకు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో తాజాగా మార్పులుపై మరోసారి చర్చలు మొదలయ్యాయంట. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి స్థానంలో ఇప్పటికే అనేక మంది పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..
పిన్నెల్లిని మారుస్తారా?


తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా వైసీపీ నేతలు

కూటమి ప్రబుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇష్టానుసారం చెలరేగిపోయిన పల్నాడు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సర కాలంగా పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితి గాడిలో పెట్టేందుకు అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో విఫలం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాటలు పార్టి అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ప్రదానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి గతంలో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చేస్తున్నారని గట్టి ప్రచారమే జరిగింది..


పాల్వాయి గేటు పోలింగు బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి

ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటు పోలింగు బూత్‌లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు …. ఈవీఎంను బద్దలుకొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు … దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు … అలాగే పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు.

పోలింగ్ ముగిసాక అరెస్ట్ భయంతో పరారైన పిన్నెల్లి

వీటన్నింటి మీదా పోలీసులు కేసులు నమోదు చేశారు… అప్పటికే హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిసాక అరెస్ట్ భయంతో పరారయ్యారు .. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపు పొందారు. ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. …

మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి అరాచకాలు

పిన్నెల్లి మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు … అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి‌ల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది … దీంతో పిన్నెల్లి పిటిషన్లపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరింది… మినహాయింపులను హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు… ఎన్నికల సమయంలో పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్తు రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి … మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి ఎవర్నీ లెక్కచేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి ..

జూన్ 26న అరెస్ట్ అయి 2 నెలలు జైల్లో ఉన్న పిన్నెల్లి

జూన్ 26న అరెస్ట్ అయిన పిన్నెల్లి దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు … అరెస్ట్ అయిన మొదటి వారంలో మాజీ సీఎం జగన్ నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లిని పరామర్శించి వచ్చారు … అప్పట్లో జైల్లో ఉన్న పిన్నెల్లిని మాజీ ముఖ్యమంత్రి గట్టిగానే సపోర్ట్ చేశారు …. ఈవీఎంను పగలగొట్టడాన్ని సమర్థించారు… అక్కడ అన్యాయం జరిగింది కాబట్టే.. అలా చేయాల్సి వచ్చిందంట…. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు వరుసగా గెలిచారంటేనే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థం అవుతుందని కితాబు కూడా ఇచ్చారు. ఆ క్రమంలో ఆగస్టులో పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది.

మాచర్లలో కనిపించడమే మానేసిన పిన్నెల్లి

బెయిల్ వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుల భయంతో పల్నాడు జిల్లాకే కాదు మాచర్ల నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. అయినా మాచర్ల వైసీపీ ఇన్చార్జ్‌తో పాటు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా జగన్ ఆయనకే కట్టబెట్టారు. అయితే సొంత నియోజకవర్గంలో కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నా పిన్నెల్లి పట్టించుకోవడం లేదంట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. జిల్లా లోని నియోజకవర్గ ఇన్చార్జ్‌లతో కూడా ఆయన టచ్‌లో లేరంట.

గురజాల, మాచర్ల క్యాడర్‌కు దిక్కవుతున్న అంబటీ, అప్పిరెడ్డి

జిల్లాలోని చిలకలూరిపేటలో వైసీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి విడదల రజని, నరసరావుపేట ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరికి వారు తమ కార్యకమాలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోఎక్కడా కార్యక్రమాలు నిర్వహించడంలేదు. గురజాల వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాసు మషేష్‌రెడ్డి కూడా నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. దాంతో గురజాల, మాచర్ల కార్యకర్తలకు సమస్య వస్తే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు , ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వచ్చి పరామర్నించే పరిస్తితులు ఏర్పడ్డాయని కార్యకర్తలు వాపోతున్నారు.

Also Read: ట్రయాంగిల్ వాటర్ వార్..? బనకచర్ల వివాదం ఏంటంటే..! తెలంగాణ వాటా ఎంతంటే..?

పార్టీ ఉనికి కోసం కొత్త అధ్యక్షుడు కావాలంటున్న క్యాడర్

వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. మరోవైపు పార్టీ శ్రేణులు కేసుల భయంతో వణికిపోతూ బయటకు రావడానికే భయపడుతున్నాయంట. మాజీ మంత్రి విడదల రజనీపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో పల్నడులో పార్టీకి పూర్వ వైభవం తేవడం కాదు.. కనీసం ఉనికిని కాపాడుకోవాలంటే జిల్లా అధ్యక్షుడ్ని మార్చాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

అధ్యక్షుడ్ని మారుస్తారా? పిన్నెల్లినే కొనసాగిస్తారా?

కొత్త నాయకత్వం ఎంపికకు సంబంధించి వైసీపీ అధిష్టానం సామాజిక వర్గాలు, సీనియార్టీ లెక్కలు కేసుకుంటోందంట. పల్నాడు జిల్లాలో రాజకీయం చేయాలంటే అర్దబలం, అంగబలం వున్న నాయకులు అవసరమని కార్యకర్తలు అంటున్నారు. ఆ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్ష రేసులో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి విడదల రజని పేర్లు వినబడుతున్నాయి. మరి ఈ సారి అయినా అధిష్టానం మార్పుకి శ్రీకారం చుడుతుందా? లేక పిన్నెల్లి పై వున్న నమ్మకంతో ఆయననే కొనసాగిస్తుందో? చూడాలి

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×