BigTV English

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

Jani Master: శ్రేష్టి వర్మ (Shrasti Varma) పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అసిస్టెంట్ గా కొనసాగుతున్న శ్రేష్టి వర్మ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్న ఈమె పట్ల జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని పలుసార్లు తనపై దాడి చేశారు అంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇక ఇదే విషయం గురించి శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విషయంలో జానీ మాస్టర్ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇలా జానీ మాస్టర్ విషయంలో పాపులర్ అయిన శ్రేష్టి వర్మ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది.


కొరియోగ్రాఫర్ గా శ్రేష్టి వర్మ…

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ 9(Bigg Boss 9) అవకాశం లభించినట్టు తెలుస్తుంది. త్వరలోనే తెలుగులో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వివాదం ద్వారా వార్తల్లో నిలిచిన ఈమెకు ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా సినిమా అవకాశాలు రావటమే కాకుండా బిగ్ బాస్ ఛాన్స్ కూడా రావడంతో అభిమానులు శ్రేష్టి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయగా జానీ మాస్టర్ ఫాన్స్ మాత్రం విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు.


బిగ్ బాస్ హౌస్ లోకి శ్రేష్టి వర్మ..

జానీ మాస్టర్ విషయంలో వివాదానికి కారణమైన శ్రేష్టి వర్మ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే మామూలుగా ఉండదు. హౌస్ మొత్తం రచ్చ రచ్చే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారా లేదా అనే విషయం తెలియాలి అంటే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. ఇక శ్రేష్టి వర్మ చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా జానీ మాస్టర్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడింది అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి వెళ్తున్న జానీ మాస్టర్ పై ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో ఆయనకు సినిమా చాన్సులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి.

ఎదుగుదలను ఓర్చుకోలేదు…

ఇక ఈ విషయం గురించి కూడా జానీ మాస్టర్ పలు సందర్భాలలో స్పందించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై కుట్ర చేస్తూ శ్రేష్టి వర్మ చేత ఇలా చెప్పించారని కెరియర్ పరంగా తన ఎదుగుదలను ఓర్చుకోలేకే ఇలా చేశారు అంటూ జానీ మాస్టర్ తెలియజేశారు. అయితే త్వరలోనే నిజా జాలు ఏంటో అందరికీ తెలుస్తాయని, జానీ మాస్టర్ ఈ వ్యవహారంపై స్పందించిన సంగతి తెలిసిందే.. ఇలా ఈ కేసు విషయంలో సుమారు నెల రోజుల పైగా జానీ మాస్టర్ జైలులోనే గడిపారు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కామన్ మ్యాన్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.

Also Read: Jayam Ravi: ఘనంగా జయం రవి స్టూడియోస్ ప్రారంభం… మొదటి సినిమా ప్రకటన!

Related News

AP Politics: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Big Stories

×