AP Politics: మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన పొలిటికల్ స్టైల్ మార్చినట్టు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షానికి పరిమితనప్పైడు ఇంత కాలం పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయిన వైసీపీ అధ్యక్షుడు పద్దతి మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారంట. తాడేపల్లి నివాసంలో సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్యం పర్యటనలకు జగన్ సిద్ధం అవుతున్నారంటున్నారు. ఓటమితో వెనకడుగు వేయనని, 11 సీట్లకే పరిమితమైన తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారంట. అస్సలు ఇంతకీ వైసీపీ అధ్యక్షుడి కొత్త కార్యాచరణ ఏంటి?
ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్న మాజీ సీఎం
రాజకీయాల్లో ఓడినా గెలిచినా తమకు అనుకూలంగా ప్రత్యేకమైన స్ట్రాటజీ అమలు చేస్తారు పొలిటికల్ లీడర్స్. ఏపీ మాజీ సీఎం జగన్‌రెడ్డి సైతం ఓటమి తర్వాత ఆలస్యంగా అయినా కొత్త యాక్షన్ ప్లాన్‌తో దూసుకుపోవాలని ఫిక్స్ అయ్యారంట. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నారంటూ… వైసీపీ శ్రేణులకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ వారికి అందుబాటులో ఉండే వారు కాదు. తన కోటరీనే నమ్ముకుని పరదాల చాటు పాలన సాగించారు.
వరుస సమీక్షలతో ఘోరపరాజయంపై పోస్టుమార్టం
అయితే ఓటమి తర్వాత జిల్లాల నేతలతో తాడేపల్లిలో సమీక్షిస్తూ ఘోర పరాజయంపై పోస్టు మార్టం చేసుకుంటున్న ఆయన ఇక రూటు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారంట. నాలుగు గోడల మధ్య సమీక్షలకే కాకుండా ఇక ప్రజల్లోకి రావాలని కార్యచరణ సిద్దం చేసుకుంటున్నారంట. ఇంత కాలం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పరంగా పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొనలేదు. ఆందోళనలు పిలుపునిచ్చి బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి. అయితే ఇకపై అనేక రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజాక్షేత్రంలో తిరగాలని డిసైడ్ అయ్యారంటున్నారు.
ఏడాది కాలంలో పార్టీ నేతలతో సమీక్షలకే పెద్దపీట
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో జగన్ పార్టీ నేతలతో సమీక్షలకే పెద్దపీట వేశారు. జైల్లో ఉన్న పార్టీ నేతల పరామర్శకు, పార్టీ క్యాడెర్‌పై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అడపాదడపా మాత్రమే బయటకు వచ్చారు. సదరు పరామర్శ యాత్రలు కూడా ఎక్కడికక్కడ ఉద్రికత్తలకు దారి తీసి ఒకింత వివాదాస్పదం అయ్యాయి. ఇక ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారట.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పడగవిప్పుతున్న ర్యాగింగ్
పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న జగన్
ఇప్పటికే పార్టీలో సమూల మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రాంతాల రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని చూస్తున్నారంట. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు, గుంటూరు జిల్లా మిర్చి రైతులు, చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను భుజాన వేసుకుని ఆయన స్పందించినా పెద్దగా ప్రభావం చూపలేదన్న అభిప్రాయం ఉంది. ఇకపై తన పర్యటనల్లో ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పార్టీ నేతలతో వరుస బేటిలు సమావేశాలు నిర్వహిస్తారంట. అందుకోసమే ప్రత్యేకంగా తన పర్యటనలను రూపొందించుకుంటున్నారంటున్నారు. రానున్న రోజుల్లో వారానికి ఇక జిల్లాలో జగన్ పర్యటన కోసం వైసిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారంట. అసలు సంక్రాంతి నుంచి జిల్లా పర్యటనలు ఉంటాయని, ఆయా జిల్లాల్లో జగన్ రాత్రులు బస చేస్తారని వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే నెలలు గడుస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. మరి అధికారం కోల్పోయి ఏడాదిపైగా గడుస్తున్న ఈ తరుణంలో అయినా జగన్ జిల్లా పర్యటనలు మొదలవ్వుతాయో లేదో చూడాలి.
Story By Rami Reddy, Bigtv