AP Politics: కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేయడం కూటమి శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామాకు ఆయన చేప్పిన కారణాలు జిల్లాలో చర్చినీయంశంగా మారాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు టిడిపి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ రాజీనామాతో బయటపడ్డాయనే టాక్ నడుస్తోంది. అసలు కాకినాడ రూరల్ టీడీపీ ఇన్చార్జ్ పిల్లి సత్తిబాబు రాజీనామాకు కారణమేంటి?.. అసలక్కడ కూటమి నేతల మధ్య ఏం జరుగుతోంది?
కాకినాడు రూరల్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న కూటమి నేతల విభేదాలు
కాకినాట రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీకి రూరల్ టీడీపీ ఇన్చార్జ్ పిల్లి సత్తిబాబుకి మధ్య విభేదాలతో రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. రూరల్ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో 2024 ఎన్నికలలో టీడీపీ కోఆర్డినేటర్‌గా పిల్లి సత్యనారాయణ అలియస్ సత్తిబాబుని నియమించారు. ఆ ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ ఘన విజయాన్ని సాధించడంలో టీడీపీ క్యాడర్ అంత ప్రాణం పెట్టి పనిచేశారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికలలో నానాజీని గెలిపించే వరకు అహర్నిశలు కష్టపడ్డ టీడీపీ కార్యకర్తలను నాయకులను ఇప్పుడు పంతం నానాజీ పట్టించుకోవడంలేదనేది విమర్శలు రూరల్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయట. ఆ క్రమంలో రూరల్ టీడీపీ అర్డినేటర్ పదవికి పిల్లి సత్యనారాయణ మూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజలు, కార్యకర్తలకు మేలు చేయాలని చూసే నాయకులు
పిల్లి సత్తిబాబు రాజీనామాకు కారణం లేకపోలేదనే చర్చ నడుస్తోందట నియోజకవర్గంలో. చోటా నాయకుడైనా, బడా నాయకుడైనా ప్రతి ఒక్కరికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లలో తమ హవాను చూపించాలని, తమ కోసం పనిచేసిన కార్యకర్తలకు, తమ దగ్గరకు వచ్చిన ప్రజలకు ఏదో రకంగా సహాయ పడాలని ఉంటుంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు ప్రాధాన్యత లేకపోవడంతో క్షేత్రస్ధాయిలో ఇబ్బందులు తప్పడంలేదని నేతలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలోనే టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ రావడానికి పెద్ద కారణంగా కనిపిస్తోందంటున్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్ స్టేషన్‌లకు తన మాటే చెల్లుబాటు అవ్వాలని సూచనలు ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు బహిరంగంగానే అంటున్నాయి.
జనసేన నేతల వద్దకే పంచాయతీలు పంపించాలని ఆదేశాలు
పనుల మీద టీడీపీ వర్గీయులు ఎవరు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, తమ జనసేన నాయకుల వద్దకే ఆ పంచాయతీలను పంపించాలని ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పినట్లు తెలుగు తమ్ముళ్లు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరు తన వద్దకు వచ్చినా, మీ గ్రామంలోని జనసేన నాయకులను వెంటపెట్టుకుని తన దగ్గరికి రావాలని ఎమ్మెల్యే చెప్తుండటంతో టిడిపి నాయకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఎమ్మెల్యే పంతం నానాజీ గెలిపించుకునేందుకు తాము ఎంత కష్టపడ్డామో ఎమ్మెల్యేకి ఇప్పుడు గుర్తు లేదా? కూటమిలో ఉన్న ఇతర పార్టీ నాయకులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ నాయకులందరూ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఆగ్రహాంగా ఉన్నారట.
గ్యాప్ పెంచిన నామినేటెడ్ పదవుల పంపకం
అదలా ఉంటే నామినేటెడ్ పదవుల విషయం కూడా ఇరుపార్టీల మధ్య గ్యాప్ పెరగాడానికి కారణమైందట. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో మిగిలిన సామాజిక వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లి సత్యనారాయణ చెప్పారట. అయితే కాకుండా టీడీపీకి 50 పర్సెంట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ పెట్టారట. అందుకు భిన్నంగా పదవులు పంపకాలు జరిగాయనేది పిల్లి వర్గీయుల వాదన. అయితే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులకు పదవులు ఇవ్వకుండా జనసేనలో సెకండ్ కేడర్ నాయకులకి పదవులను అప్పగించారనేది వాదనను తెరపైకి తేచ్చారు. ఇక్కడ బలంగా ఉన్న నాయకులను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేపై టీడీపీ నాయకులు అందరూ గుర్రుగా ఉన్నారట.
మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా మారని నానాజీ తీరు
ఈ విషయాలను పలుమార్లు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న నారాయణ దృష్టికి తీసుకువెళ్లిన పంతం నానాజీ తీరు మాత్రం మారడంలేదని పిల్లి సత్యనారాయణ మూర్తి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ హామీలు అమలు సమయంలో పిల్లి సత్తిబాబుకు ఆయన వెంట ఉన్న కేడర్ కు ముఖ్య నాయకులకు ఆహ్వానం అందడం లేదంట. మొక్కుబడిగా పంతం నానాజీ పీఏ ద్వారా కేవలం మెసేజ్ పంపించటం ఎంతవరకు సబబు అని టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారట. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం వచ్చే వారు టిడిపి కోఆర్డినేటర్ గా ఉన్న పిల్లి సత్తిబాబు వద్దకు వెళుతుంటే వారి పనులు కావటం ఆలస్యం అవుతోందని, లేదా పూర్తిగా పక్కన పెట్టేయడం వంటి పరిస్థితులు నెలకొనడంతో … కార్యకర్తలకు ఏమి చేయలేని నాయకుడిగా మిగిలిపోవడం కంటే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లి పోవడమే మంచిదని పిల్లి సత్తిబాబు రాజీనామా నిర్ణయం తీసుకున్నారంట. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడరుకు జరుగుతున్న అన్యాయాలు, ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహరిస్తున్న తీరుపై రాజీనామా లేఖలో అనేక విషయాలను బహిర్గతం చేశారు పిల్లి సత్యనారాయణ..
Also Read: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
క్యాడర్‌కు ఏం చేయలేకపోతున్నానని సత్తిబాబు రాజీనామా
కూటమితో కలిసి 15 సంవత్సరాలపాటు క్యాడర్ మొత్తం పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న పరిస్ధితి. ఈ సందర్భంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నానాజీ టీడీపీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల కూటమిలో స్నేహపూరిత వాతావరణం దెబ్బతినే పరిస్ధితులున్నాయని రాజకీయ విశ్లేషకులు మాట. ఆ క్రమంలో కాకినాడ రూరల్ టిడిపి అంశంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు? జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా దిశనిర్దేశం చేస్తారు? కాకినాడ రూరల్ నియోజకవర్గం లో టిడిపి, జనసేన మళ్లీ కూటమిలో సెట్ అవుతాయా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Story By Rami Reddy, Bigtv