BigTV English

Hyderabad:హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా వెనుక కారణం అదేనా?

Hyderabad:హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా వెనుక కారణం అదేనా?
  • కాంగ్రెస్ సర్కార్ ను తిప్పలు పెట్టాలని చూస్తున్న బీఆర్ఎస్
  • బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులే నిరుద్యోగులుగా..
  • నిరుద్యోగుల ధర్నా అంటూ హై డ్రామాకు తెర తీసిన బీఆర్ఎస్
  • కవర్ చేయని ప్రధాన మీడియా ఛానళ్లు
  • కేవలం కొన్ని పెయిడ్ ఛానళ్లతోనే కవరింగ్
  • చంద్రబాబు రోడ్ షో ను డైవర్ట్ చేయడానికేనా ఇదంతా?
  • ఇప్పటికే టీచర్ల భర్తీకి, ఆర్టీసీ కొలువులకు నోటిఫికేషన్లు జారీ
  • అయినా రేవంత్ సర్కార్ ను ఇరుకునపెట్టే యత్నం                                                                                                                                                                                 

Students Protest at TGPSC Office(Breaking news in telangana): ఆరు నెలలు పూర్తిచేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే తిప్పలు పెట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్ సర్కార్. జులై 7న ఆరునెలలు పూర్తిచేసుకోబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మార్చి 8న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు వచ్చీ రాగానే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ రావడంతో నిరుద్యోగ క్యాలెండర్, మరికొన్ని సంక్షేమ పథకాల అమలు అన్నీ పెండింగ్ లో పడిపోయాయి. కనీసం కొద్దిపాటి గ్యాప్ కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు వరుసగా క్యూకట్టి ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. పైగా నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి దగ్గరుండి మరీ ధర్నాలు చేయిస్తూ రేవంత్ సర్కార్ పై ఉసిగొల్పుతున్నారు.


నిరుద్యోగ పాపం వారిదే

గత పదేళ్లుగా నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారి ఇప్పటికే బీఆర్ఎస్ సర్కార్ కు గండంగా మారింది. మొన్న అసెంబ్లీఎన్నికలలో బీఆర్ఎస్ ఘోర పరాజయానికి కారణం నిరుద్యోగులే అని చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ సర్వే ప్రకారం దేశంలో 15-29 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే కేరళ అగ్రస్థానంలో నిలుస్తే తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేరళ 31.8 శాతం కాగా జమ్ము కాశ్మీర్ 28.2, తెలంగాణ 26.1 గా నిలిచింది. ఇదంతా కేవలం కాంగ్రెస్ వచ్చిన ఆరు నెలలోకా జరిగింది కాదు. గత పదేళ్లుగా తెలంగాణలో ఉద్యోగ ప్రమాణాలు పాటించకపోవడం. ఖాళీ పోస్టులు పూరించకపోవడం.కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీల వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే టీచర్ల భర్తీకి, ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చారు. అయినా నిరుద్యోగులు శుక్రవారం నగరం నడిబొడ్డున ఆందోళనలు చేపట్టారు. ఎంతకీ తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అయితే నిజంగానే వారంతా నిరుద్యోగులేనా లేక బీఆర్ఎస్ కార్యకర్తలా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


బీఆర్ఎస్ మైండ్ గేమ్

నిరుద్యోగుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమం ఫెయిల్ అయింది. అక్కడ నిరుద్యోగుల ముసుగులో వచ్చినవారంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులే అని తెలుస్తోంది. వారికి అనుకూలంగా వ్యవహరించే కొన్ని యూట్యూబ్ ఛానళ్లతో కవరేజ్ చేయించారు. ఒక పక్క నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంతలా ఎందుకు హడావిడి చేశారు అన్నది ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది.

చంద్రబాబు రోడ్ షో అడ్డుకోవడానికేనా?

ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన వస్తున్నారని అభిమానులు రోడ్ షో ఏర్పాటు చేశారు. అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబుకు నీరాజనాలు పలికారు. అయితే చంద్రబాబు రోడ్ షోను అడ్డుకోవడమే లక్ష్యంగా చేసుకుని అప్పటికప్పుడు నిరుద్యోగ ధర్నాను పెయిడ్ ఆర్టిస్టులతో చేయించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా చంద్రబాబు తిరిగి టీడీపీని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ నేతలు కాంగ్రెస్ లో వలసలతో క్యూకట్టడం చూసి ఏం చెయ్యాలో తెలియని గందరగోళ స్థితిలో ఉంది ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం కనుక వస్తే ఉన్న ఆ నలుగురు కూడా టీడీపీలో ఎక్కడ వలస వెళిపోతారో అని బీఆర్ఎస్ నేతలు బావిస్తున్నారు. అందుకే ఆ ప్రయత్నంలో భాగంగానే నిరుద్యోగుల ధర్నా డ్రామాకు తెరతీసారని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.

 

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×