E-Paper
Advertisement

SS Rajamouli: జక్కన్నపై డాక్యుమెంటరీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

SS Rajamouli: జక్కన్నపై డాక్యుమెంటరీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
Advertisement

Netflix Announced Tollywood Director SS Rajamouli Documentary: టాలీవుడ్‌ సంచలన దర్శకుడు ఎస్‌ ఎస్ రాజమౌళి అంటే టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ దాకా తెలియనివారుండరు. ఎందుకంటే బాహుబలి మూవీతో ప్రపంచ సినీ ఇండస్ట్రీకి ఒకడొచ్చాడని నిరూపించాడు. ప్రపంచ సినీ ఇండస్ట్రీ ముందు తన తడాఖా చూపించి తెలుగువాడి టాలెంట్‌ ఏందో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేసిన మూవీ స్టూడెంట్‌ నెంబర్ 1 తో హ్యాట్రిక్‌ కొట్టి టాలీవుడ్‌లో ఓ మార్క్‌ని కైవసం చేసుకున్నాడు. ఈ మూవీతో జక్కన్నకు మంచి స్టార్‌డమ్ వచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్‌తో మళ్లీ సింహాద్రి మూవీతో తిరుగులేని మహారాజుగా నిలిచిపోయాడు.

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ నితిన్‌తో సై, డార్లింగ్‌తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, యమదొంగ, రామ్‌చరణ్‌తో మగథీర లాంటి చిత్రాలను తెరకెక్కించి ఆడియెన్స్‌ చేత వావ్ అనిపించుకున్నాడు. ఇక అప్పటివరకు కమెడియన్‌గా ఉన్న సునీల్‌ని మర్యాద రామన్న మూవీతో టాలీవుడ్‌కి హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత ఎవరు ఊహించని స్థాయిలో నాని నటించిన మూవీ ఈగ. ఈ మూవీతో ఈగని హీరో చేసి అందరిచేత జైహో.. జక్కన్న జైహో అనిపించుకున్నాడు. ఇక 2015 ఏడాదిలో రిలీజ్ అయిన బాహుబలి పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయగా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ మూవీతో తిరుగులేని దర్శకుడిగా అందరిచేత శభాష్ అనిపించుకొని రాజమౌళి తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసుకున్నాడు.

Advertisement

Also Read: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. పెద్ద రిస్కే ఇది..!

ఇక ఈ మూవీ సీక్వెల్‌లో బాహుబలి 2 మూవీ సైతం అదే రేంజ్‌లో రూ. 2000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ అనంతరం మల్టీస్టారర్‌గా వచ్చిన మూవీ ఆర్‌ఆర్ఆర్‌. ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకోవడమే కాకుండా భారతీయ చలన రంగంలో ఆస్కార్ సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డులను సృష్టించారు జక్కన్న.ఇక ఇదిలా ఉంటే..ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ జక్కన్న సినీ జీవితంపై డాక్యుమెంటరీ తీసింది. ఈ మ్యాటర్‌ని నెట్‌ఫ్లిక్స్ సోషల్‌మీడియా వేదికగా స్వయంగా రివీల్ చేసింది. మాడర్న్‌ మాస్టర్స్ రాజమౌళి పేరిట ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ మూవీని ఆగష్టు 2 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని ఆడియెన్స్‌ కోసం అందించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×