BigTV English

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ విజయం, పాలన ఎలా ఉంటుంది?

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ విజయం, పాలన ఎలా ఉంటుంది?

Iran election 2024 results: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ గెలుపొందారు. ఆయనకు 1.63 కోట్ల ఓట్లు వచ్చినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. సయూద్‌కు 1.35 కోట్ల ఓట్లు మాత్రమే వచ్చాయి.


మసౌద్‌ అధ్యక్షుడి పగ్గాలు అందుకోనున్నారు. సంస్కరణవాదిగా మసౌద్ మంచి పేరుంది. వృత్తిరీత్యా ఆయన వైద్య నిఫుణుడు కూడా. మసౌద్ గెలుపుతో ఆ దేశంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశముంద ని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఇరాన్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు మొగ్గు చూపలేదు. కేవలం 60శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించు కున్నారు.

పోలైన ఓట్లలో 50శాతం వచ్చినవారు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. లేకుంటే రనాఫ్ పోలింగ్ నిర్వహిస్తారు. అందులో విజేతను ప్రకటిస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మసౌద్.. ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారాయన. అందరికీ స్నేహ హస్తం అందిస్తామన్నారు. మనమందరం దేశ ప్రజలమని గుర్తు పెట్టుకోవాలన్నారు.


ALSO READ:  బ్రిటన్ ప్రధాని కీర్‌తో కేసీఆర్ మనవడు హిమాన్షు, ఆపై అభినందనలు

వెస్ట్రన్ దేశాలతో నిర్మాణాత్మకమైన సంబంధాలను నెలకొల్పుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు మసౌద్. ఒంటరితనం నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తానని, అణు ఒప్పందాన్ని పునరుద్దరించాలన్నారు. గత అధ్యక్షుడు 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలో ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్- సయూద్ జలిలిలు పోటీ పడ్డారు. చివరకు మసౌద్ విజయం సాధించారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×