BigTV English

Kaikala: కత్తితో పొడవడం.. ఆ ‘టీ’ తాగడం.. కైకాల జీవితంలో ఆసక్తికర ఘటనలు

Kaikala: కత్తితో పొడవడం.. ఆ ‘టీ’ తాగడం.. కైకాల జీవితంలో ఆసక్తికర ఘటనలు

Kaikala: 777 సినిమాలు.. 200 మందికి పైగా దర్శకులు.. 28 పౌరాణికాలు.. 51 జానపద చిత్రాలు.. 9 చారిత్రక సినిమాలు.. 60 ఏళ్ల సినీ ప్రస్థానం. మామూలు విషయమా. అది కైకాల సత్యనారాయణకే సాధ్యం. విభిన్న చిత్రాల్లో.. అనేక పాత్రలతో మెప్పించి.. రాణించిన కైకాల చరిత్రలో పలు ఆసక్తికర ఘటనలూ ఉన్నాయి. వాటిలో ఓ రెండింటిని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


చాలామంది కెరీర్ మొదట్లో విలన్ క్యారెక్టర్స్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారుతుంటారు. కానీ, కైకాల విషయంలో రివర్స్ జరిగింది. తొలినాళ్లలో హీరోగా నటించిన ఆయన.. ఆ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. కైకాలను మొదటిసారి విలన్ గా చూపించింది వెండితెర మాంత్రికుడు విఠలాచార్యనే.

విలన్ గా చేయాలంటే చాలా శారీరక కష్టం ఉంటుందని కైకాల అనేవారు. రామారావు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన విలన్‌గా చేశారు. ఎన్టీఆర్ తో ఫైట్‌ సీన్ కంప్లీట్ చేస్తే.. పెద్ద గండం గడచినట్టే భావించేవారు. ఓసారి భీమడు-కీచకుల యుద్ధంలో భాగంగా ఎన్టీఆర్-కైకాల సీన్లో నటిస్తున్నారు. సహజంగా ఉండాలని ఎన్టీఆర్.. తన రొమ్ముల మీద గుద్దుతుంటే చచ్చినంత పనైందని అన్నారు కైకాల సత్యనారాయణ. మరోసారి, ఇంకో సీన్ లో ఎన్టీఆర్ నిజంగానే కత్తితో కైకాలను పొడిచేశారట. అప్పట్లో ఆ కమిట్మెంట్ అలా ఉండేదంటూ సత్యనారాయణ ఓ సందర్భంలో చెప్పారు.


కైకాల తన జీవితంలో జరిగిన మరో ఆసక్తికర సంఘటన గురించి కూడా అప్పట్లో చెప్పారు. మద్రాసులో ఓ షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి రాగా.. పనిమనిషి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగడం పూర్తి అయ్యాక చూస్తే.. కప్పు అడుగున ‘సాలీడు’ ఉంది. అది చూసి గుండె ఝల్లు మందట ఆయనకు. అందరూ డాక్టరు దగ్గరకు వెళ్లాలని హడావిడి చేయగా.. కైకాల మాత్రం మొండిగా ససేమిరా వద్దు అన్నారట. అదృష్టం బాగుంటే బతికి బయట పడతాను అనుకుని.. తాను దేవుడి మీద భారం వేసి నిద్రపోయానని.. మర్నాడు రోజూలాగానే లేవడంతో హమ్మయ్య అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కైకాల సత్యనారాయణ. ఇలాంటివి ఆయన సినీ జీవితంలో చాలా ఘటనలే ఉన్నాయి.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×