BigTV English
Advertisement

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం నెక్స్ట్ అరెస్ట్ అతనేనా?

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం నెక్స్ట్ అరెస్ట్ అతనేనా?

AP Liquor Scam: ఏపీలో మద్య నిషేధం హామీతో అధికారపగ్గాలు చేపట్టిన జగన్.. ప్రభుత్వ మద్యం దుకాణాల ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు సిట్ విచారణలో వెల్లడవుతోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ వేసిన 305 పేజీల ఛార్జ్‌షీట్లో దానికి సంబంధించి ఏ-1 రాజ్ కేసిరెడ్డిని కీలకపాత్రధారిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌లు సహా పలువురు ఊచలు లెక్కపెడుతున్నారు. ఫైనల్‌గా ఈ స్కాంలో పెద్ద తలకాయ ఎవరన్నది తేలాల్సి ఉందంటున్నారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు జగనే అన్న టాక్ ఉత్కంట రేపుతోంది


అనేక మలుపులు తిరుగుతున్న ఏపీ లిక్కర్ స్కాం

ఏపీ లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతోంది. రూ.3,500 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని . లిక్కర్ దందాలకు సంబంధించి ఇదే అతిపెద్ద స్కాం అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు అధికారుల బృందం తమ విచారణను చివరి దశకు చేర్చినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 40 మందిని నిందితులుగా చూపగా, 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో వైసీపీ ఎంపీ, మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్ కోటరీలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టుతో కేసు విచారణ క్లైమాక్స్ కు చేరిందని భావిస్తున్నారు. ఇక మిగిలింది అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఎక్సెజ్ మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించిన సిట్ అధికారులు

ఈ కేసులో విచారణకు రావాలని వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరుకాలేదు. దాంతో తిరుపతిలోని నారాయణస్వామి నివాసానికి సిట్ అధికారులు ఓ ఇన్స్‌పెక్టర్‌ని పంపి.. వీడియోకాల్ ద్వారా ఆయన్ను విచారించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు. సిట్ విచారణ లో మాజీ మంత్రి నారాయణ స్వామి ప్రభుత్వ దుకాణాలు తీసు కొస్తే మద్యం వినియోగం తగ్గుతుందని, ప్రజలను మద్యం నుంచి దూరం చేయవచ్చని తనకు చెప్పారని వెల్లడించారు. అంతకుమించి నూతన మద్యం విధానం గురించి నాతో ఏమీ చర్చించలేదని, కొత్త మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని దోపీడీ జరిగినట్లు తన దృష్టికి ఎన్నడూ రాలేదని అధికారులకు చెప్పారంట. రాజ్ కెసిరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదన్న నారాయణస్వామి.. సిట్ అధికారులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పలేదంట.

చార్జ్‌షీట్లో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పేరు ప్రస్తావన

మరోవైపు సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మరో ఎమ్మెల్యే ప్రస్తావన రావడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామ్‌రెడ్డి ప్రతాప్‌రెడ్డి పేరును సిట్ చార్జిషీట్‌‌లో పేర్కొనడంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి. ఎన్నికల టైంలో ప్రతాపరెడ్డికి లిక్కర్ స్కాం నిధులు అందాయని సిట్ పేర్కొనడంతో.. లిక్కర్ స్కాంలో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి కీలకంగా మారినట్లు అయింది. ప్రతాపరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన సిట్ .. ఛార్జ్‌షీట్‌లో 237, 288, 289 పేజీల్లో ఆయన పాత్రని పేర్కొంది. ఎన్నికల కోసం ఒక్కో ట్రిప్‌లో 8-12 కోట్లను కావలికి చెవిరెడ్డి భాస్కరెడ్డి పంపించారని సిట్ పేర్కోంది.

ప్రతాప్ రెడ్డికి బాలాజీనిధులు అందించారని పేర్కొన్న సిట్

మార్చి 11, 2024న ప్రతాపరెడ్డికి ఈ డబ్బులను బాలాజీ యాదవ్ అందిచారని సిట్ అధికారులు చార్జ్‌షీట్లో వెల్లడించారు. మార్చి 11 ఉదయం 7 తర్వాత బాలాజీ యాదవ్‌కు ప్రతాపరెడ్డి 3 సార్లు కాల్ చేసినట్లు కాల్ డేటాతో వెల్లడైందని స్పష్టం చేశారు. మార్చి 12 ఉదయం గం.9.10లకు బాలాజీ, నవీన్ కావలికి వచ్చారని, ఎన్నికల ఖర్చులకు లిక్కర్ స్కాం డబ్బులు అందించడానికే వారు వచ్చారని .. ఆ డబ్బుల్లే ఎన్నికల్లో ప్రతాపరెడ్డి పంచారని సిట్ అభియోగం మోపింది. బాలాజీ రిమాండ్ రిపోర్ట్‌లోనూ ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించిన సిట్… గత ఏడాది ఏప్రిల్ ఒకటిన కూడాప్రతాపరెడ్డి పీఏకు బాలాజీ డబ్బులు అందించారని విచారణలో వెల్లడైందని పేర్కొంది.

చెవిరెడ్డి బాస్కరరెడ్డి కనుసన్నల్లో నడిచిన తతంగం

మొత్తమ్మీద ఎన్నికల్లో నగదు పంపకాల కోసం వైసీపీ నేతలు లిక్కర్ స్కాంలో వెనకేసిన నిధుల నుంచి 200 కోట్ల రూపాయల మేర వినియోగించినట్లు సిట్ గుర్తించిందంట. ఇందుకోసం హైదరాబాద్, తాడేపల్లిల్లో కొన్ని రహస్య డెన్‌లు ఏర్పాట చేసినట్లు విచారణ అధికారులు చెప్తున్నారు. ఈ పంపిణీ వ్యవహారమంతా ఏ -38 నిందితుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో నడిచిందంట. ఆయన సూచనల మేరకు ఎక్కడెక్కడికి ఎంతెంత సొమ్ము తరలించాలో పథక రచన చేశారంట. అందుకు చెవిరెడ్డి తండ్రి కొడుకులు చైర్మన్లు గా వ్యవహరించిన తుడా వాహనాలను వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మొత్తానికి ఈ స్కాంలో ఇప్పటి వరకు వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి, మిథున్‌రెడ్డి అరెస్ట్ అవ్వడంతో తర్వాత ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read: అయోధ్య పేరుతో అరాచకం.. భక్తి పేరుతో భారీ దోపిడీకి స్కెచ్.. చివరికి ఏం జరిగిందంటే..!

కొల్లు రవీంద్ర చెప్తున్న పెద్ద వికెట్ ఎవరిది?

ఏ 5 విజయసాయిరెడ్డి అరెస్టుపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే ఆయన సిట్ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. అసలు రాజ్ కేసిరెడ్డి పేరును ఫోకస్ చేసింది కూడా విజయసాయిరెడ్డే. సాయిరెడ్డి సిట్ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన అప్రూవర్‌గా మారడానికి సిద్దంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అంటున్న తర్వాతి బిగ్ వికెట్ ఎవరిదనేది సస్పెన్స్‌గా తయారైంది.

Story By KLN, Bigtv

Related News

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

JC Brothers: జేసీ బ్రదర్స్.. టార్గెట్ పోలీస్!

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Big Stories

×