HHVM Premieres Collections:శ్రీ మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం (AM Ratnam) అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా.. ఆ తర్వాత జ్యోతి కృష్ణ (Jyoti Krishna) చేతుల్లోకి వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదవికి, అభిమానుల అభిరుచికి, నేటివిటీకి తగ్గట్టుగా కథను మార్చి తెరపైకి తీసుకొచ్చారు జ్యోతి కృష్ణ. జూలై 24వ తేదీన సినిమా విడుదల కావాల్సి ఉండగా..అభిమానుల కోసం జూలై 23వ తేదీన రాత్రి 9:45 నుంచీ 10:00 గంటల మధ్యలో ప్రీమియర్ షోలు వేశారు. వీరమల్లు సినిమా కోసం గత ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీరింది.
ప్రీమియర్స్ తోనే ఆట మొత్తం మార్చేసిన వీరమల్లు..
ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ థియేటర్లతోనే రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రీమియర్ షోలతో భారీగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. ప్రీమియర్ షో ద్వారా సుమారుగా రూ.20 నుండి రూ. 25 కోట్లు ప్రీమియర్స్ ద్వారా వసూలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రీమియర్ షోల ద్వారానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే నిజంగా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మైల్స్టోన్ అని, ప్రీమియర్ షో తోనే ఆట మొత్తం మార్చేసింది అని కూడా చెబుతున్నారు. ఒక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా 7: 45 గంటలకు మొదటి షో ప్రారంభమైన విషయం తెలిసిందే.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ (Niddhi Agerwal) హీరోయిన్గా విడుదలైన చిత్రం హరిహర వీరమల్లు. సత్యరాజ్ , సునీల్, నాజర్, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలో అనసూయ(Anasuya ) స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. 16వ శతాబ్దపు నవాబుల కాలం నాటి చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన అభిమానులు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. వన్ మ్యాన్ షో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు ఆయన స్వాగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నిధి అగర్వాల్ కూడా తన పర్ఫామెన్స్ తో బెస్ట్ ఇచ్చిందని చెబుతున్నారు. మిగతా పాత్రలు కూడా ఎవరికి వారు 100% న్యాయం చేశారని.. ఇక ఔరంగజేబు పాత్రలో విలన్ గా బాబి డియోల్ ఒదిగిపోయారని చెబుతున్నారు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకముందే సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన అటు బాలకృష్ణ ‘అఖండ 2’ కి పోటీగా బరిలోకి దిగుతోంది .
ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మళ్లీ ‘హరిహర వీరమల్లు 2’ కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ:HHVM Day 1 Collections: హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు రాబడుతుంది అంటే?