Viral News: దాంపత్య జీవితం అన్న తర్వాత కోపాలు.. తాపాలు.. సరసాలు ఉండటం సహజం. ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలీదు. ఒకరిపై మరొకరు చిందులు వేశారు. కోపంతో తట్టుకోలేని భార్య, భర్త నాలుక కొరికేసింది. ఆ తర్వాత నమిలి మిగేసింది. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్‌లోని గయాలో వెలుగుచూసింది.
ఈ మధ్య భార్యభర్తల మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. కోపమో.. సరసమో తెలీదుగానీ భర్త నాలుకలను కొరికేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని గయా జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. చివరకు తారాస్థాయికి చేరింది.
గొడవ విషయంలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ ఇంటి ఇల్లాలు.. భర్త నాలుకను కొరికింది. ఆ తర్వాత ఆ నాలుకను నమిలి మింగేసింది. ఆ లెక్కన ఆమెలో భర్తపై ఏ స్థాయిలో కోపం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఇరుగుపొరుగువార నాలుక తెగిపోయిన రోగిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే భార్య నాలుక కోసిందని చెప్పారు. చాలావరకు రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స అనంతరం బాధితుడ్ని మగధ్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతానికి బాధితుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. విచిత్రం ఏంటంటేం భర్తతో ఆసుపత్రికి వెళ్లిన భార్య, అక్కడ కూడా భర్తతో గొడవకు దిగింది.
ALSO READ: చోరీకి వెళ్లి అదిరే స్పెప్పులు వేసిన దొంగలు.. సీసీ కెమెరా ముందే రెచ్చిపోయి
ఘటన జరిగి 24 గంటలు గడిచినా, పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు కాలేదు. ఈ కేసు గురించి తమకు తెలియదని చెబుతున్నారు పోలీసులు. ఫిర్యాదు అందితే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇంటి యజమాని కోలుకుంటున్నాడు.
అన్నట్లు గతవారం అంటే జులై 20న ఏపీలోని కర్నూలులో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. యల్లమ్మగుట్ట తండాలో చంద్రానాయక్-పుష్పావతి దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్తను బలవంతంగా ముద్దు పెట్టినట్టు పెట్టి భర్త నాలుక కొరికేసింది. వెంటనే చంద్రనాయక్‌ను ఆసుపత్రికి తరలించారు. చివరకు భర్తపై కోపంతో భార్య ఇలా చేసిందని తేలింది.