BigTV English

Israel-Hezbollah conflict: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

Israel-Hezbollah conflict: రగిలిపోతున్నఇజ్రాయెల్ హిజ్బుల్లా బూడిదే!

Israel Attack on Hezbollah Bases in Lebanon: గాజా యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత.. ఇజ్రాయెల్ తన టార్గెట్ ను లెబనాన్ వైపు మళ్లింది. కారణం అక్కడ హెజ్బుల్లా అంతం కోసం. ఏళ్ల దుష్మణిని వదిలిపెడితే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుందో ఏమో బాంబులతో విరుచుకుపడుతోంది. అసలు హెజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది..? ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు.. ?


ప్రత్యేక దళాలను పంపిన అమెరికాహిజ్బుల్లా అంటే పాము బుసకొట్టినట్టు విరుచుపడుతుంది ఇజ్రాయెల్.. ఎందుకంటే ఇది ఏళ్ల నాటి పగ అంత ఈజీ గా ఎలా మర్చిపోతామంటోంది. ఇజ్రాయెల్ అంతం కోసమే పుట్టిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేవరకు తగ్గేదేలే అంటోంది. అసలు వీరి మధ్య శత్రుత్వం ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే ఓసారి 80స్ లోకి వెళ్లాల్సిందే.

హిజ్బొల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్‌లోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ ‌దీనిని స్థాపించింది. 1982లో లెబనాన్ పై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి. ఇందులో ఇజ్రాయెల్ దళాలు, మితవాద ఇజ్రాయెల్-మిత్ర క్రైస్తవ లెబనీస్ మిలీషియాలతో కలిసి పాలస్తీనా మిలిటెంట్లను తరిమికొట్టేందుకు రాజధాని పశ్చిమ భాగాన్ని ముట్టడించాయి. ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ 17,000 మందికి పైగా మరణాలకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన హిజ్బొల్లా దక్షిణ లెబనాన్‌లోని షియాల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ పై కక్షతో 1983లో US మెరైన్ బ్యారక్స్‌పై దాడి చేసి దాదాపు 300 మంది యూఎస్ , ఫ్రెంచ్ సిబ్బంది తో పాటు పౌరులను చంపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తరువాత అంటే 1985లో బీరుట్‌లోని యుఎస్ ఎంబసీపై బాంబు దాడి చేసి 23 మందిని చంపారు. ఇక 1992 నుంచి హిజ్బొల్లా లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ.. ప్రధాన రాజకీయ శక్తిగా మారింది.


ఇజ్రాయెల్ హమాస్‌ మధ్య గతేడాది అక్టోబర్‌ నుంచి యుద్ధ వాతావరణం నెలకొంది. అదే టైంలో ఇజ్రాయెల్ దాని మిత్రదేశాలతో ఎక్కువగా ఘర్షణ పడుతున్నాయి యెమెన్, సిరియా, గాజా, ఇరాక్.. అయితే ఈ దేశాలలో విస్తరించి ఉన్న మిలిటెంట్ గ్రూపు్లో హిజ్బుల్లా కూడా భాగమే.. దీంతో ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్న హెజ్‌బొల్లా..ఈ యుద్ధాన్ని మేము కొనసాగిస్తామని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. అయితే జూలైలో బీరుట్‌పై దాడితో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫుయాద్ షుక్ర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ చెప్పడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతీకారంగా.. హిజ్బుల్లా వందల కొద్దీ డ్రోన్లు మరియు క్షిపణులను ఇజ్రాయెల్‌లోకి ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాదాపు 9 వేలకుపైగా రాకెట్ లాంచర్ల దాడులు చేసింది. ఒక్క సోమవారమే 250కి పైగా రాకెట్ లాంచర్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు చాలా వరకు అడ్డుకున్నాయి. గాజా యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్న తర్వాత.. తన లక్ష్యాన్ని లెబనాన్ వైపు తిప్పిన ఇజ్రాయెల్‌.. హిజ్బుల్లా టార్గెట్ గా భీకర దాడులు చేస్తోంది.

Also Read:  టార్గెట్ చేస్తే శాల్తీ లేవాల్సిందే.. ప్రపంచాన్నిషేక్ చేస్తున్న ఇజ్రాయెల్ మొసాద్

ఎక్కడ ఏం ప్లాన్ చేసిన సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేద్దామన్న వెంటనే హిజ్బుల్లాకు చుక్కలు చూపుస్తుంది ఇజ్రాయెల్. ఈ వేటలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా హైకమాండ్ గా ఉన్నా వాళ్లను వరుసగా లేపేస్తూ వచ్చింది. ఇక నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే.. హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లానే. అతనితో పాటు హిజ్బుల్లా కీలక కమాండర్లను ఏరివేస్తోంది ఇజ్రాయెల్. ఇందులో నెక్ట్స్ అలీ కరాకీ కూడా ఉన్నాడు. సోమవారం రాత్రి వైమానిక దాడులు చేసినా తప్పించుకున్నాడు. కరాకీ హిజ్బుల్లా దక్షిణ కమాండ్‌ కు అధిపతి. తాజాగా దాడులు చేసిన దక్షిణ లెబనాన్‌ వ్యవహారాలను ఇతడే చూస్తున్నాడు. జిహాద్‌ కౌన్సిల్‌ సభ్యుడు కూడా. నాసర్‌, అజిజ్‌, బదెర్‌ రీజనల్‌ డివిజన్లకు సారథ్యం వహిస్తున్నాడు. హిజ్బుల్లా నంబర్-2, రద్వాల్‌ ఫోర్స్‌ చీఫ్ ఇబ్రహీం అకిల్‌ స్థానంలోకి ఇతడు వచ్చాడు. ఇతని మట్టుపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది.

ఇకపోతే ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో భారత బలగాలు అలర్ట్ అయ్యాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ మిషన్ లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయల్-లెబనాల్ బోర్డర్ లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారించడం వీరి బాధ్యత. తాజాగా జరిగన దాడులు నేపథ్యంలో అక్కడి పరిస్థిలను గమనిస్తున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

కాబట్టి.. ఓవరాల్ గా గతంలో 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు, ఎన్నో దేశాలను అల్లకల్లోలం చేశాయి. ఆనాటి విషాదాలు ఇంకా ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉన్నాయి. దాని నుంచి పాఠాలు నేర్చుకోని దేశాలు.. కయ్యాని కాలు దువ్వుతున్నాయి. ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతుండగానే.. అంతకు ముంచిన యుద్ధానికి దిగింది మిడిల్ ఇస్ట్ కంట్రీస్. ఈ నెత్తుటి మరకలు చూస్తుంటే మరో ప్రపంచ యుద్దం తప్పదనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు పోటాపోటీగా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో గెలుపోటములు ఎవరివో పక్కకు పెడితే… సామాన్యులు మాత్రం బలవుతున్నారు అనడంలో సందేహం లేదు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×