BigTV English

KBC 1 Crore Question: కోటి రూపాయల ప్రశ్న.. కెబిసి కంటెస్టెంట్ ఫెయిల్.. మీరు చెప్పగలరా?..

KBC 1 Crore Question: కోటి రూపాయల ప్రశ్న.. కెబిసి కంటెస్టెంట్ ఫెయిల్.. మీరు చెప్పగలరా?..

KBC 1 Crore Question| దేశంలో అత్యంత పాపులర్ రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి – మీలో ఎవరు కోటీశ్వరుడు). దేశం నలుమూలల నుంచి ప్రొగ్రామ్ లో పాల్గొనే కంటెస్టెంట్లు తమ అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకుంటారు. వీరిలో చాలామంది మేధావులున్నా.. కొంతమందిని మాత్రమే అదృష్టదేవత వరిస్తుంది. వారే కోటి రూపాయలు ఆపైన గెలుచుకొని కోటీశ్వరులని అనిపించుకుంటారు.


బాలీవుడ్ దిగ్గజం, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ప్రొగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ప్రసారమవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఎవరూ కోట్లు గెలుచుకొని వెళ్లలేదు. అయితే తాజాగా ఉజ్వల్ ప్రజాపత్ అనే కంటెస్టెంట్ కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని జస్ట్ మిస్ చేసుకున్నాడు. సోమవారం ప్రత్యక్ష ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఉజ్వల్.. రూ.50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రెండు లైఫ్ లైన్లు తీసుకున్నాడు.. అయినా ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదని.. ఇక ఉజ్వల్ చెప్పలేడనిపిచ్చింది. కానీ అనుకోకుండా రైట్ ఆన్సర్ చెప్పి.. రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ రూ.కోటిల ప్రశ్న.. కానీ అంతలోనే హూటర్ మోగింది. ఆ రోజు ఎపిసోడ్ ముగిసింది.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ


మరుసటి రూ.కోటి విలువగల ప్రశ్నకోసం.. ఉజ్వల్ ప్రజాపత్ కు అమితాబ్ బచ్చన్ స్వాగతం పలికారు. హాట్ సీట్ పై ఉన్న ఉజ్వల్ కు ఎదురుగా ఉన్న స్క్రీన్ పై రూ.కోటి ప్రశ్న ప్రత్యక్షమైంది.

ప్రశ్న: 1919లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం తరపున ఏ రాజ్యానికి చెందిన శాసకుడు ట్రీటీ ఆఫ్ వర్సెసైలెస్ పై సంతకం చేశారు?

ఆప్షన్లు — ఎ. మహారాజ సవాయి జై సింగ్ 2, బి. నిజాం మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, సి. నమీద్ హమీదుల్లా ఖాన్, డి. మహారాజా గంగా సింగ్.

అయితే ఈ ప్రశ్నకు ఉజ్వల్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఫలితంగా అతను రూ.50 లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ పొందాడు.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

ఉజ్వల్ ప్రజాపత్ వ్యక్తిగత జీవితం గురించి షో లో చూపించారు. అతను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తల్లి బీడీలు విక్రయిస్తుంది. నానమ్మ.. కుండలు తయారు చేస్తుంది. కేవలం మూడు పూట్ల తిండి దొరకడమే తనకు మహాభాగ్యమని ఉజ్వల్ కార్యక్రమంలో చెప్పాడు. అతని తండ్రి కూలీ పని చేస్తాడు. అందుకే షో కౌన్ బనేగా కరోడ్‌పతి తాను కనీసం కోటి రూపాయలు సంపాదించుకొని తన కుటుంబం పడే కష్టాలన్నీ తీర్చాలనుకున్నాడు. అయితే ఉజ్వల్ రూ.కోటి గెలవలేకపోయినా.. దాదాపు అంతవరకు చేరుకోగలిగాడు.

ఇక రూ.కోటి ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా?.. లేకపోతే సరైన ఆన్సర్ ఆప్షన్ డి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×