BigTV English

VYOOHAM: జగన్‌ యోగా చేస్తారా? బనియన్‌లోనే ఉంటారా? ప్రేయర్ చేస్తారా?

VYOOHAM: జగన్‌ యోగా చేస్తారా? బనియన్‌లోనే ఉంటారా? ప్రేయర్ చేస్తారా?

VYOOHAM: ఆర్జీవీ వదిలిన వ్యూహం టీజర్ ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. వైఎస్సార్ మరణం, జగన్ ఆవేదన, సీబీఐ అరెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి కావడం, భారతి రోల్.. ఇలా అనేక ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ యాంగిల్స్ టచ్ చేశారు వర్మ. మిగతా పాత్రలు, వాటిని చూపించిన విధానం ఎలా ఉన్నా.. ఓ సీన్‌పై మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే.. బనియన్ వేసుకుని.. జగన్ యోగా చేస్తున్న షాట్.


ఆ సీన్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అదేంటి ఇంట్లో జగన్ బనియన్లు వేసుకుంటారా? అందులోనూ ఫుల్ హ్యాండ్స్ బనియనే వాడుతారా? అనే టైంపాస్ చర్చ నడుస్తోంది. చాలాకాలంగా జగన్‌ ఫార్మల్ డ్రెస్సుల్లోనే కనిపిస్తున్నారు. చాలా సింపుల్ డ్రెస్సింగ్ ఆయనది. సాధారణ పాయింట్, షర్ట్. అంతే. అత్యంత సాదాసీదా లుక్స్. ముఖంలో చెదరని చిరునవ్వు కామన్.

జగన్ పాత ఫోటోల్లో.. కొన్నిట్లో మాత్రం ఆయన టీషర్టుల్లో కనిపిస్తారు. వైఎస్సార్ కాలంలో, రాజకీయాల్లోకి రాకముందు రంగురంగుల డ్రెస్సులు, టీషర్టులు వేసుకునేవారు. కానీ, జగన్ ఇంట్లో ఉండే సమయంలో బనియన్ కూడా వేసుకుంటారనే విషయం వర్మ వ్యూహం టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఏదో యథాలాపంగా అలా చూపించే రకం కాదు ఆర్జీవీ. ప్రతీ చిన్న ఎలిమెంట్‌ను.. పక్కా సమాచారం మేరకే.. చూపిస్తారు. జగన్ బనియన్‌తో ఉండే విషయాన్ని వర్మతో జగనో, భారతినో చెప్పుంటారు. అందుకే ఆ సీన్‌లో జగన్ కాస్ట్యూమ్ అలా పెట్టారని అంటున్నారు.


ఇక ఇంకో విషయం. జగన్ యోగా కూడా చేస్తారా? ఇది మరింత ఆసక్తికరం. యోగాలో మాస్టర్ కూడా అయ్యారా? మొత్తం శరీర బరువును చేతులపై మోపి.. శీర్షాషనం తరహాలో తలకిందులుగా ఉండటం.. యోగాలో బాగా నైపుణ్యం సాధించిన వారికే సాధ్యం అని చెబుతున్నారు. ఆ లెక్కన.. జగన్ యోగా మాస్టర్ అన్నటేగా. ఆయన రెగ్యులర్‌గా జిమ్ చేస్తారనే సంగతి చాలామందికి తెలిసిందే. ముఖ్యమంత్రి అయ్యాక కూడా.. అంత బిజీగా ఉంటూ కూడా.. ఇప్పటికీ జిమ్ చేస్తున్నారు జగన్. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తుండగా.. కాలు బెనికడంతో కొన్నాళ్లు ఇబ్బంది కూడా పడ్డారు. కాలు నొప్పితో.. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు. సో, జిమ్‌లో కసరత్తులతో పాటు.. తరుచూ యోగా కూడా చేస్తారన్న మాట.

ఇక, వైఎస్సార్ చనిపోయిన విషయం తెలిశాక.. గదిలో జగన్ ఒంటరిగా బాధపడే సన్నివేశాలనూ వ్యూహం టీజర్‌లో చూపించారు వర్మ. ఆ సీన్‌లో జగన్ చేతిలో.. క్రిస్టియన్ సంప్రదాయంలో ప్రార్థన చేసే మాలను సైతం చూపించారు. ఆ మాల మరింత క్లియర్‌గా కనిపించేలా.. జాగ్రత్తగా ఫ్రేమ్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. జగన్ జీసస్‌ను బలంగా నమ్ముతారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడే ప్రతీసారి.. ఆ దేవుని చల్లని ఆశీస్సులు.. అంటుంటారు. అది జీసస్ గురించే. ఇంట్లో రెగ్యులర్‌గా ప్రేయర్ చేస్తారని.. కష్ట సమయాల్లో ఆ దేవుడినే నమ్ముకుంటారని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక, విజయమ్మ సైతం చేతిలో బైబిల్ లేనిదే బయటకు రారు. వైఎస్ కుటుంబం మొదటినుంచి ఆ మతంలోనే ఉంది. అయితే, గత ఎన్నికల ముందు జగన్ హిందూ మతాన్ని స్వీకరించారని అంటారు. విశాఖ శారదా పీఠాధిపతి ఆయన్ను హిందూ మతంలోకి మార్చే తంతు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు తరుచూ అధికారికంగా జరిగే ఆలయ కార్యక్రమాలకు సీఎం హోదాలో హాజరవుతుంటారు. అచ్చమైన హిందూ సంప్రదాయంలో తెల్లని పంచె, చొక్కాతో.. నుదుటిన బొట్టుతో కనిపిస్తుంటారు. వ్యూహం టీచర్‌తో.. అప్పటి జగన్‌కు, ఇప్పటి జగన్‌కు ఎంత తేడా? అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×