BigTV English

Tholi Ekadasi : తొలి ఏకాదశికి ఏ నైవేద్యం పెడితే మంచిది…?

Tholi Ekadasi : తొలి ఏకాదశికి ఏ నైవేద్యం పెడితే మంచిది…?

Tholi Ekadasi : ఈనెల 29న తొలి ఏకాదశి రాబోతోంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎంతో విశిష్టత ఉన్న తొలి ఏకాదశి నాడు స్వామికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి పూజ చేస్తుంటారు. అయితే ఎలాంటి నైవేద్యాలు పెట్టాలన్న సందేహాలు వస్తుంటాయి. కేవలం అన్నంతోనే 92 రకాల ప్రసాదాలు చేయచ్చని శాస్త్రం చెబుతోంది. పాలు, పెరుగు, నెయ్యి,వెన్న, పులుపు, కొబ్బరి,నువ్వులు ఇలా పదార్థాలు వేరు వేరుగా కలిపి ప్రసాదాలు తయారు చేయవచ్చు. మీరు చేయగలిగితే 92 రకాల ప్రసాదాలు తయారు చేసి పెట్టవచ్చు. మీ ఓపికను బట్టి తాహతును బట్టి స్వామికి ప్రసాదాలు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు.


కానీ స్వామిని ఆరాధించే పూజలో త్వ గుణాలు కలిగించే ప్రసాదాలను మాత్రమే చేయమని శాస్త్రం చెబుతోంది. కారాలు, మిరియాలు, ఆవాలు, మిరపకాయలు ఇలాంటి వాటిని తక్కువగా ఉపయోగించి వండాలి. పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, తేనె లాంటి వాటిని ఉపయోగించి ఎక్కువ ప్రసాదాలు చేయడం మంచిది. నెయ్యి ఆయురృతం అంటోంది శాస్త్రం. ఈ రోజుల్లో నెయ్యి వాడితే లావైపోతామని, కొలస్ట్రాల్ పెరిగిపోతాయని…ఇలా రకరాకల కారణాలు చెప్పి దూరం పెడుతున్నారు. వాస్తవానికి నెయ్యి వాడితే జ్ఞాపక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. నెయ్యి వాడితే ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. అప్పట్లో నెయ్యి క్వాలిటీగా ఉండాది. ఇప్పుడు సంగతి అందరికి తెలిసిందే.

స్వచ్ఛమైన నెయ్యి అన్ని సద్దుగుణాలు కలిగిస్తుంది. పాత రోజుల్లో అన్ని నేతి వంటలే చేసేవారు. నూనె వాడే వారు కాదు. ఇప్పుడు ఎక్కువశాతం వంటలు నూనెతో చేస్తున్నారు. ముఖ్యంగా దేవుడికి చేసే పదార్దాలు నెయ్యితోనే చేయాలి. వాటినే భక్తులకి ప్రసాదంగా పంచి పెట్టాలి. కానీ చాలా మంది ఏకాదశి నాడు ప్రసాదాలు కూడా తినమని చెబుతుంటారు. కానీ అది సరికాదు . వ్రతం పేరు చెప్పి ప్రసాదాన్ని వద్దనకూడదు. నిన్న పూజిస్తాను కానీ నీ ప్రసాదం తీసుకోను అన్నట్టుగా ఉండకూడదు. ఏకాదశి వ్రతం చేసేది శ్రీ మహావిష్ణువు కృప కోసమే కదా…ఆ స్వామి ప్రసాదాన్ని వద్దనడం తగదంటోంది శాస్త్రం. అలా అయితే స్వామి ఎలా సంతోషించి వరాలు ఇస్తాడో ఓసారి ఆలోచించాలి. స్వామికి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించబోనని అనడం ఏమాత్రం సరికాదు.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×