BigTV English

Lady Aghori: ఆ తప్పే అఘోరీ కొంప ముంచిందా..? అసలు కథ ఇదే..!

Lady Aghori: ఆ తప్పే అఘోరీ కొంప ముంచిందా..? అసలు కథ ఇదే..!

Lady Aghori: అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది.. ఒకప్పడు రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. మరి ఆ రెండూ ఒకరే అయితే? అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు కలిస్తే? ఇలా అతిగా ప్రవర్తించే ఓ అఘోరీలాంటి కటౌట్ బయటకొస్తుంది. ఆ క్యారెక్టర్ చేసే చిత్ర, విచిత్ర వేషాలు.. ఎలా ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆఖరికి అఘోరీ చర్యలే.. అతన్ని జైలు పాలు చేశాయి.


మనం చూడని లేటెస్ట్ ఎగ్జాంపుల్.. అఘోరీ!

అతి సర్వత్రా వర్జయేత్! అంటే.. అతి ఎక్కువైతే ఎలా ఉంటుందో, అదెలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి.. మన దగ్గర ఇప్పటికే బోలెడన్నీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ.. మనకు తెలియని.. మనం ఎప్పుడూ చూడని లేటెస్ట్ ఎగ్జాంపులే.. ఈ అఘోరీ క్యారెక్టర్. అతి కొద్దికాలంలో.. ఈ అఘోరీకి వచ్చిన నేమ్, ఫేమ్.. అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్‌గా పాపులర్ అయిన పర్సనాలిటీల్లో.. ఈ అఘోరీ కూడా ఒకడు. మొదట్లో అంతా బాగానే ఉంది. చాలా మందికి ఈ లేడీ అఘోరీ కొత్తగా అనిపించింది. అఘోరాలు ఉంటారని అందరికీ తెలుసు. నాగ సాధువులు ఉంటారని తెలుసు.


గౌరవాన్ని నిలుపుకోలేకపోయిన అఘోరీ

కానీ.. ఇలాంటి ఓ లేడీ అఘోరీ కూడా ఉంటుందా? అంతా ఆశ్చర్యపోయారు. అతని వేషం చూశాక, అతను చేసే చర్యల గురించి తెలిశాక.. అందరిలోనూ ఈ అఘోరీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. శవాలను తింటానని.. శ్మశానంలోనే పడుకుంటానని.. ధర్మ స్థాపన చేస్తానని, సనాత ధర్మాన్ని రక్షిస్తానని.. ఇలా బోలెడు కబుర్లు చెప్పింది. మొదట్లో.. ఈ వ్యవహారమంతా బాగానే నడిచింది. చాలా మంది.. అఘోరీని ఓ దేవతలా చూశారు. అంతే భక్తితో మెలిగారు. ఎంతగానో గౌరవించారు. ఎక్కడికి వెళితే అక్కడ దండాలు పెట్టారు. కానీ.. ఆ గౌరవాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయింది అఘోరీ. ఎంత వేగంగా ఫేమ్ చూసిందో.. అంతే వేగంగా పాతాళానికి పడిపోయింది.

నగ్న పూజల పేరుతో రూ.10 లక్షల వసూలు

లేడీ అగోరీ.. అలియాస్ శ్రీనివాస్‌పై మోసం కేసు నమోదైంది. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి.. మోసం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. డబ్బులు తిరిగి అడిగినందుకు.. బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయ్. దాంతో.. పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టు.. అఘోరీకి రిమాండ్ విధించింది. దాంతో.. అఘోరీ శ్రీనివాస్ జైలుపాలయ్యాడు.

అఘోరీ అయినా చట్టానికి అతీతం ఏమి కాదు!

వర్షిణిని పెళ్లి చేసుకున్నాక.. తెలుగు రాష్ట్రాలకు దూరంగా బతుకుదామని వెళ్లిపోయింది అఘోరీ. కానీ.. పోలీసులు అంత చాన్స్ ఇవ్వలేదు. వెతుక్కుంటూ వెళ్లి మరీ పట్టుకొచ్చేశారు. జైల్లో వేశారు. ఈ అఘోరీ ఎపిసోడ్‌తో ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. అతిగా.. మతిపోయి ప్రవర్తించే అఘోరీ అయినా.. చట్టానికి అతీతం కాదని తేలిపోయింది.

ఆధ్యాత్మకతను అడ్డుపెట్టుకొని అతి చేసిన అఘోరీ

ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని.. అఘోరీ ఎంత అతి చేయాలో అంత చేసింది. ధర్మ స్థాపన అంటూ ఆగమాగం చేసింది. పూజల పేరుతో తనని నమ్మిన వాళ్లను మోసం చేసిందనే ఆరోపణలున్నాయి. ఇలా వరుస సంఘటనలన్నీ.. అఘోరీని వ్యక్తిగతంగా పతనమయ్యేలా చేశాయి. ముఖ్యంగా.. అఘోరీ చర్యలు ఆధ్యాత్మిక గురువులు, అఘోరీలపై సమాజంలో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. అవన్నీ.. ఆమె ప్రతిష్ఠను, నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. జనంలోనూ.. అఘోరీ పట్ల విరక్తి వచ్చేసింది.

సోషల్ మీడియాలో అఘోరీపై విపరీతమైన ట్రోలింగ్

మొదట్లో భక్తితో చూసిన వాళ్లే.. ఇప్పుడు చీదరించుకుంటున్నారు. ఇలా ఉన్నావేంట్రా బాబూ.. అని నిట్టూరుస్తున్నారు. మొదట్లో ఇంట్రస్టింగ్‌గా చూసినోళ్లే.. ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా.. మోసం, బెదిరింపు ఆరోపణలతో.. అఘోరీ అరెస్ట్ అవడం, జైలుకెళ్లడం లాంటి పరిణామాలు.. న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అఘోరీ కేసు.. సనాతన ధర్మం పేరు చెప్పి.. ఆధ్యాత్మిక దుర్వినియోగం చేసే వారిపై.. చట్టం కఠినంగా వ్యవహరించగలదని రుజువు చేసింది.

అఘోరీ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?

ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే.. తర్వాత వచ్చే పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సనాతన ధర్మ స్థాపన అంటూ దుకాణం మొదలుపెట్టిన అఘోరీ.. తర్వాత ట్రాక్ తప్పాడు. అమ్మాయిల వెంట పడ్డాడు. ప్రేమ అన్నాడు. పెళ్లి అన్నాడు. అసలు.. తెలుగు రాష్ట్రాలకే రానన్నాడు. కానీ.. సీన్ కట్ చేస్తే.. అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఈ పతనం.. ఇక్కడితో ఆగుతుందా? అఘోరీ ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?

అఘోరీ.. ఒకప్పుడు గాడ్ మెటీరియల్!

ఇప్పుడదే కటౌట్ ట్రోల్ మెటీరియల్!

ప్రతి దానికి ఓ స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్లే.. ఎండింగ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇన్ స్టంట్ హిట్ అయిన ఏ క్యారెక్టర్ కూడా.. ఎక్కువ కాలం ట్రెండింగ్‌లో నిలిచినట్లు హిస్టరీలో లేదు. అతికొద్దిమంది మాత్రమే సోషల్ మీడియాలో తమకు వచ్చిన హైప్‌ని నిలబెట్టుకున్నారు. తెలివిగా వాడుకున్నారు. లైఫ్‌లో సెటిలయ్యారు. మిగతా వాళ్లంతా.. వచ్చిన నేమ్, ఫేమ్‌ని ఎలా వాడుకోవాలో తెలియక.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడీ అఘోరీ క్యారెక్టర్ కూడా అలాంటిదే.

తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన అఘోరీ

సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసి పడేసింది. నడిచినన్నాళ్లు నడిపించింది. చివరికి జైలుపాలైంది. అందుకే అనేది.. అతిగా రియాక్ట్ అయితే.. సీన్ రివర్స్ అవుతుందని. ఆధ్యాత్మికతను అడ్డంపెట్టుకొని సమాజంలో అతిగా ప్రవర్తించిన అఘోరీ కూడా బాగుపడలేదు. చట్టానికి.. అఘోరీ ఏమీ అతీతం కాదని తేలిపోయింది.

ప్రశ్నిస్తే బూతులు తిట్టండం.. ఆపితే కర్రలు తీసుకొని కొట్టడం

అఘోరీ ఓవరాక్షన్ ఏ స్థాయికి వెళ్లిందో.. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా రెండూ చూశాయి. ఆలయాలకు వెళ్లడం, ఎవ్వరినీ లెక్కచేయకుండా వీఐపీలా దర్శనాలు చేసుకోవడం, ప్రశ్నిస్తే.. బూతులు తిట్టడం, ఆపితే.. కర్రలు తీసుకొని కొట్టడం లాంటివన్నీ చేసింది. కొన్నికొన్ని సార్లు పెట్రోల్ క్యాన్ తీసుకొని.. ఆత్మార్పణం చేసుకుంటానంటూ బెదిరించింది. చివరికి.. పోలీసులను కూడా లెక్కచేయకుండా ప్రవర్తించింది. వాళ్లను బూతులు తిట్టడమే కాదు.. వారిపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది. అబ్బో.. అఘోరీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆమె చర్యలు, ఆర్థిక లావాదేవీలు, జనంలో అతి ప్రవర్తన లాంటివన్నీ ఆమె పతనానికి దారితీశాయ్.

నగ్న పూజల పేరుతో మహిళ రూ.10 లక్షల వసూలు

ఇదంతా ఒక ఎత్తైతే.. అఘోరీ శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం మరో ఎత్తు. శ్రీ వర్షిణి అనే అమ్మాయితో అతను నడిపిన ప్రేమ వ్యవహారం, ఆమెను పెళ్లి చేసుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం.. కుటుంబ తగాదాలు.. ఇలా చాలానే నడిచింది. ఇంతలోనే.. అఘోరీకి ముందే పెళ్లైపోయిందనే విషయం బయటపడింది. అతని మొదటి భార్య రాధిక.. తనను మోసం చేసి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. అఘోరీ జనంలో మరింత పలుచనైపోయాడు. ఇదిలా ఉంటే.. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి.. బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు.

సనాతన ధర్మం, ఆధ్యాత్మిక, భక్తి మార్గం అంటూ ప్రచారం

మొదట్నుంచీ.. అఘోరీ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక, భక్తి మార్గం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. ఆలయాలను సందర్శిస్తూ.. కాంట్రవర్శీలకు కేరాఫ్‌గా మారింది. ఇక.. బీటెక్ చదివిన శ్రీవర్షిణి అఘోరీతో వెళ్లడం, అతన్నే పెళ్లి చేసుకోవడం కూడా జనంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అఘోరీ.. సడన్ గా ప్రేమ, పెళ్లి వైపు మళ్లింది. ఈ పరిణామం ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో.. అతని ఆధ్యాత్మికత, భక్తిపై అందరిలోనూ అనుమానం మొదలైంది. తన పబ్బం గడుపుకునేందుకే.. ఈ వేషం వేశాడనే చర్చ జరిగింది. అఘోరీ ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడి ఉండకుండా.. పక్కదారి పట్టడంతోనే అతని పతనమైపోయాడు.

అఘోరీ నిజస్వరూపాన్ని బయటపెట్టిన సోషల్ మీడియా

అతని ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాలు, ఒకరిని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం, బెదిరింపులకు పాల్పడటం లాంటివన్నీ.. అఘోరీని ఎటూ కాకుండా చేశాయి. ముఖ్యంగా.. తనని తాను ఓ ఆధ్యాత్మిక వ్యక్తిగా చిత్రీకరించుకొని.. పూజలు, ధర్మం పేరుతో డబ్బలు వసూలు చేయడం, జనాన్ని మోసం చేయడం లాంటివి కూడా అతని ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఏ సోషల్ మీడియాతో అతను.. జనాన్ని ఆకర్షించి పాపులర్ అయ్యాడో.. చివరికి అదే సోషల్ మీడియా అఘోరీ వివాదాలను, మోసాలను, అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఆఖరికి తీసుకెళ్లి.. జైల్లో కూర్చోబెట్టింది. ధర్మం పేరు చెప్పి దారితప్పినవారెవరైనా సరే.. చివరికి ఇలా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందనే సందేశం ఇచ్చింది అఘోరీ ఎపిసోడ్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×