AP Govt School : 584.. 580.. 575.. 570.. 567.. 562.. ఇలా టెన్త్ క్లాస్‌లో ఆ స్కూల్‌కు టాప్ మార్కులు వచ్చాయి. అలాగని అదేదో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం లాంటి ప్రైవేట్ స్కూల్ కాదు. అచ్చంగా ప్రభుత్వ పాఠశాల. గవర్నమెంట్ బడిలో చదివిన ఆ పిల్లలు జెమ్స్ అయ్యారు. టీచర్లు చక్కని చదువు చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్‌కు పోటీగా మార్కులు సాధించేలా చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు A+ గ్రేడ్ సాధించారు. ఇంకేం. ఆ బడికి పండగొచ్చింది.
స్టూడెంట్స్‌కు ఊరేగింపు
టాపర్స్ అందరినీ కారులో ఊరేగించారు ఆ బడి పంతుళ్లు. ఊరంతా తిప్పి తమ విద్యార్థుల గొప్పతనాన్ని ఘనంగా చాటారు. ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా లక్షలకు లక్షలు ఖర్చు చేసి టీవీల్లో ప్రకటనలు గట్రా ఇవ్వలేని పరిస్థితి. అందుకే తమకు తోచిన విధంగా.. గవర్నమెంట్ స్కూల్ స్థాయికి తగ్గట్టుగా ప్రచారం చేశారు. కారులో, ఆటో ట్రాలీలో విద్యార్థులను ఎక్కించి గ్రామంలో ఊరేగించారు. వారికొచ్చిన మార్క్స్‌ను ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. 1..1..1.. 2..2..2.. అంటూ టీవీల్లో ర్యాంకులు ఊదరగొట్టే మాదిరిగా.. విద్యార్థులకు వచ్చిన మార్కులను మైక్‌లో పదే పదే అనౌన్స్ చేస్తూ ఊరంగా చుట్టొచ్చారు.
అడ్మిషన్ల కోసం ఆరాటం
ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పడానికే ఇలా ఊరేగింపు నిర్వహించామని టీచర్లు చెబుతున్నారు. పనిలో పనిగా గ్రామంలోని పిల్లలను.. గవర్నమెంట్ స్కూల్‌లోనే చేర్పించమంటూ ప్రచారం కూడా చేశారు. మంచి చదువు చెబుతాం.. మంచి వసతులు ఉన్నాయి.. మా పాఠశాలలో చదివితే ఇదిగో వీళ్లకు వచ్చినట్టే అందరికీ మంచి మార్కులు వస్తాయంటూ.. కొత్త అడ్మిషన్ల కోసం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అలా, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి.. విశాఖ జిల్లాలోని నడుపూరు జిల్లా పరిషత్ స్కూల్ ఉపాధ్యాయులు వినూత్నరీతిలో ప్రచారం చేపట్టడం ఆకట్టుకుంది.
Also Read : కల్మా అంటే ఏంటి? వాళ్లను ఉగ్రవాదులు ఎందుకు వదిలేశారంటే..
ఏ స్కూల్స్ బెటర్?
ప్రైవేట్ స్కూల్స్‌తో పోలిస్తే.. గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తీసిపోవు. సర్కారు బడుల్లో చదువు చెప్పే వారంతా క్వాలిఫైడ్ టీచర్లే. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్లూ చాలామందే ఉంటారు. చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో డిగ్రీ చదివిన వారితోనే చదువు చెప్పిస్తుంటారు. పైగా వేలకు వేలు ఫీజులు వసూల్ చేస్తారు. గవర్నమెంట్ బడుల్లో ఉచితంగా చదువు చెబుతున్నా.. ఎందుకోగానీ అందులో చేర్చేందుకు తల్లిదండ్రులు ఇష్టం చూపించరు. మంచి స్కూల్ బిల్డింగ్ ఉన్నచోట్ల కూడా అడ్మిషన్స్ తక్కువగానే ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన అనేకమంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతున్నా.. ఇప్పటికీ సర్కారు బడి అంటే చిన్నచూపే చూపిస్తున్నారు. అంతా మార్కెటింగ్ మాయాజాలం చూపించే ప్రైవేట్ స్కూల్స్ ముందు చేతులు కట్టుకుని నిలుచొని.. వాళ్లు అడిగినంత ఫీజు కట్టేసి.. ఇక తమ బాధ్యత తీరిపోయిందని పేరెంట్స్ చేతులు దులిపేసుకుంటున్నారు. అక్కడ మార్కులు రాకపోతే అది తల్లిదండ్రుల తప్పే అన్నట్టు మాట్లాడుతుంటారు. అదే మంచి చదువు చెప్పి.. మంచి మార్కులు వచ్చేలా చేసే.. నడుపూరు జిల్లా పరిషత్ స్కూల్ లాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. ఒకసారి మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించి చూడండి తీడా మీకే తెలుస్తుంది అనేది టీచర్ల మాట. కానీ, అదేంటో కానీ ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తుండటం విచిత్రం.
*ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులే నడుం బిగించాలి.
ఇది ఆంధ్ర లో ఒక జిల్లా పరిషత్ స్కూల్, నడుపూరు , విశాఖ జిల్లాలో జరిగిన సంఘటన@bigtvtelugu@abntelugutv@naralokesh pic.twitter.com/8H20rlNJxM— The Whistleblower (@telugodikeka) April 24, 2025