BigTV English
Advertisement

Maldives India Conflict | భారత్ – మాల్దీవ్స్ మధ్య పెరుగుతున్న వైరం.. ఈ చిచ్చు ఎలా మొదలైంది?

Maldives India Conflict | భారత్ పొరుగున ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ సమూహ దేశం మాల్దీవ్స్. మాల్దీవ్స్ – ఇండియా మధ్య చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. భారతీయులు ఎక్కువగా మాల్దీవ్స్‌కు హాలిడే వెళ్లడానికి ఇష్టపడతారు.చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు ఇక్కడి ప్రకృతి సౌందర్యం కారణంగా photo shoots చేస్తుంటారు. అయితే ఇటీవల కొత్తగా కొలువుదీరిన మాల్దీవ్స్ ప్రభుత్వం.. భారత్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది.

Maldives India Conflict | భారత్ – మాల్దీవ్స్ మధ్య పెరుగుతున్న వైరం.. ఈ చిచ్చు ఎలా మొదలైంది?

Maldives India Conflict | భారత్ పొరుగున ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ సమూహ దేశం మాల్దీవ్స్. మాల్దీవ్స్ – ఇండియా మధ్య చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. భారతీయులు ఎక్కువగా మాల్దీవ్స్‌కు హాలిడే వెళ్లడానికి ఇష్టపడతారు.చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు ఇక్కడి ప్రకృతి సౌందర్యం కారణంగా photo shoots చేస్తుంటారు. అయితే ఇటీవల కొత్తగా కొలువుదీరిన మాల్దీవ్స్ ప్రభుత్వం.. భారత్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది.


ఫ్రెండ్లీగా ఉన్న దేశం.. ఇలా శత్రువుగా వ్యవహరించడానికి కారణం ఏంటి.. ఈ చిచ్చు ఎవరు పెట్టారు.. ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..

నవంబర్ 3 1988, ఇండియా విదేశాంగ మంత్రిత్వశాఖ న్యూ ఢిల్లీ ఆఫీసు లో ఉదయం 6 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ ”We are under attack.. please save us” అంటూ భయపడుతున్న స్వరంతో మాట్లాడాడు. ఆ ఫోన్ వచ్చింది మాల్దీవ్స్ రాజధాని నగరం మాలే నుంచి. మాల్దీవ్స్ ప్రభుత్వ ప్రతినిధి ఆ ఫోన్ చేశారు. ఆ సమయంలో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్‌ని పదవి నుంచి తప్పించాలని కుట్ర జరుగుతోంది.


విద్రోహ శక్తులు.. అల్లరి మూకలను రెచ్చగొట్టి రాజధాని మాలేలో విధ్యంసం సృష్టిస్తున్నాయి. విద్రోహ శక్తులకు ఉగ్రవాద సంస్థ LTTE(లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం) అండ ఉంది.

పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రెసిడెంట్ గయూమ్‌.. ఇక మాల్దీవ్స్ ముందు ప్రమాదం ముంచుకొస్తోందని గ్రహించారు. మరికొన్ని గంటల్లో శ్రీలంక నుంచి ఉగ్రవాదులు బయలుదేరి మాల్దీవ్స్ చేరుకుంటారని సమాచారం. దీంతో ప్రెసిడెంట్ గయూమ్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌ ప్రభుత్వాలకు ముందుగా సహాయం కోసం ఫోన్ చేశారు. కానీ వారు ఈ విషయంలో సహాయం చేయలేమని చెప్పి తప్పించుకున్నారు. ఆ తరువాత గయూమ్.. అమెరికా, బ్రిటన్ దేశాలకు ఫోన్ చేసి సహాయం అడిగారు. వారు సహాయం చేసేందుకు అంగీకరించారు.. కానీ వారి సహాయం అందేవరకూ చాలా లేట్ అయిపోతోంది. అందుకే భారత ప్రభుత్వంతో మాట్లాడాలని అమెరికా అధికారులు సూచించారు.

వెంటనే ప్రెసిడెంట్ గయూమ్ న్యూ ఢిల్లీ ఫోన్ చేశారు. ఆయనకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కోల్ కతాలో ఉన్నారు. ఆయనకు విషయం తెలిసిన వెంటనే న్యూ ఢిల్లీకి 9 గంటలకు చేరుకొని విదేశాంగ మంత్రితో మీటింగ్‌లో పాల్గొన్నారు. అలా ఆపరేషన్ కాక్టస్ మొదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు 400 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు మాల్దీవ్స్‌కు విమానంలో చేరుకున్నారు.

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గయూమ్‌ని సురక్షితంగా కాపాడి హుల్ హులే ఐలాండ్‌కి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఉదయం వరకు జరిపిన కాల్పుల్లో భారీ సంఖ్యలో విద్రోహులు చనిపోయారు. విద్రోహులను రెచ్చగొట్టిన మాస్టర్ మైండ్ అబ్దుల్లా లుత్ఫీని అరెస్టు చేశారు. అలా మాల్దీవ్స్ నాశనం కాకుండా ఇండియా కాపాడింది.

అంతా సవ్యంగా జరిగిపోయాక ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ తిరిగి రాజధాని మాలేకు చేరుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. భారత దేశ ప్రభుత్వం చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ మాల్దీవ్స్ ఎప్పటికీ భారత దేశానికి రుణపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు రాజీవ్ గాంధీ కూడా పార్లమెంటులో మాట్లాడుతూ.. తమ పొరుగు దేశమైన మాల్దీవ్స్‌తో స్నేహ సంబంధాలు ఎంతో ముఖ్యమని.. వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని చెప్పారు. అప్పటి నుంచి మాల్దీవ్స్‌కు ఏ ఆపద వచ్చినా సైనిక సహాయం, మెడిసిన్, ఆహారం వంటివి భారత్ అందిస్తూ ఉంటుంది.

కానీ ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల తరువాత మాల్దీవ్స్‌లో భారత వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. ఇండియా ఔట్ అనే నినాదం మొదలుపెట్టిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ పార్టీకి చైనా నుంచి నిధులందుతున్నాయని తెలుస్తోంది. చైనాతో friendship చేసి భారత్‌తో సంబంధాలు తెంచేసుకోవాని భావిస్తోంది. ఇదంతా ఆసియా ఖండంలో ఇండియా, చైనా మధ్య కోల్డ్ వార్‌లో ఓ భాగమని చెప్పొచ్చు. అయితే ఇండియా, చైనా వార్‌కు కొత్తగా మాల్దీవ్స్ వేదికగా మారిపోయింది.

ఈ వార్‌లో మాల్దీవ్స్ మధ్యలో ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలంటే.. ముందుగా మాల్దీవ్స్ geography అంటే భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. మాల్దీవ్స్ దేశంలో మొత్తం 1200 చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వీటిలో దాదాపు 200 ఐలాండ్స్ మీద ప్రజలు నివసిస్తున్నారు. మాల్దీవ్స్ అత్యంత సమీపంగా శ్రీలంక, భారత దేశాలున్నాయి. మాల్దీవ్స్‌లో కేవలం 298 square kilometre లలో విస్తరించిన భూమి ఉంది. జనాభా సంఖ్య 5 లక్షల 22వేల మంది. ఇందులో 98 శాతం ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నారు. మిగతా 2 శాతం జనాభాలో christians, Buddhist, Hindu సమాజానికి చెందినవారున్నారు.

దేశ జనాభాలో సగం మంది రాజధాని నగరం మాలేలోనే జీవిస్తున్నారు. మాల్దీవ్స్ అత్యంత సమీపంగా అంటే 130 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. మాల్దీవ్స్ GDP 80 వేల కోట్ల రూపాయలు. 2022లో భారత్ – మాల్దీవ్స్ మధ్య 4000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.ఇందులో ఎక్కువగా భారత్ నుంచి మాల్దీవ్స్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో Refined Petroleum, గోధుమ పిండి, పప్పు, కూరగాయలు, బియ్యం, గుడ్లు, మెడిసిన్ వంటివి భారత్ నుంచి మాల్దీవ్స్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం సరుకుల విలువ 3680 కోట్లు.. అంటే మొత్తం వ్యాపారంలో భారత్ నుంచి మాల్దీవ్స్ చేసుకున్న దిగుమతులే ఎక్కువ.

మరోవైపు భారత్ చేపలు, సంగీత పరికరాలు, scrap, metal వంటివి మాల్దీవ్స్ నుంచి దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతులు చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయి. అయితే మాల్దీవ్స్ ముఖ్య ఆదాయం టూరిజం.

ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఇక్కడి ప్రజలలో స్థానిక రాజకీయ పార్టీలు మతం, పొరుగుదేశాల సంబంధాలపై భయాన్ని సృష్టిస్తున్నారు. వేరే మతం వారితో తమ దేశ ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ఒక propaganda నడిపిస్తున్నారు. అయితే మాల్దీవ్స్ లోపలి రాజకీయాలు ఇప్పుడు దాని geo political situation కారణంగా ఒక అంతర్జాతీయ విషయంగా మారిపోయాయి.

మాల్దీవ్స్ Internal politics ఇప్పుడు India, Chinaపై ప్రభావం చూపుతున్నాయి. 2008 వరకు ప్రెసిడెంట్ గయూమ్ అధికారంలో ఉన్నారు. ఆయన ఉన్నంత వరకు భారత్, మాల్దీవ్స్ మధ్య అంతా బాగానే ఉంది. ఆ తరువాత Mohamed Nasheed president అయ్యారు. ఆయన ఓ Journalist కానీ ఆయన ఇస్లాం అనుకూలంగా politics చేసేవారు. ఆ తరువాత 2013లో Abdulla Yameen president అయ్యారు. Abdulla Yameen మాజీ ప్రెసిడెంట్ గయూమ్‌కు స్వయాన సవతి తమ్ముడు. అయితే Abdulla Yameen తన రాజకీయ ప్రత్యర్ధులను చట్ట వ్యతిరేకంగా జైలుకు పంపారు.

కానీ మాల్దీవ్స్ సుప్రీం కోర్టు ఆదేశాలతో వారందరూ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు Abdulla Yameen ప్రభుత్వం పడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో తన పదవి కాపాడుకోవడం కోసం Abdulla Yameen దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించారు. సైనిక పాలన చేపట్టారు. Abdulla Yameen తనకు మరింత బలం అవసరమని భావించారు. ఆయన మాల్దీవ్స్ ‌లో ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడంతో భారత్ సాయం చేయదని భావించి.. చైనా వద్దకు వెళ్లారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

మాల్దీవ్స్‌కి సాయం చేస్తే తనకు వచ్చే లాభాలని అంచనా వేసిన చైనా వెంటనే ఇది ఒక golden chanceగా భావించింది. పాకిస్తాన్, శ్రీలంకకు అప్పులు ఇచ్చి తన చెప్పుచేతల్లో పెట్టుకున్న చైనా.. మాల్దీవ్స్‌ని కూడా లొంగదీసుకుంది. మాల్దీవ్స్‌లో భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టింది. ఎంతకావాలన్నా అప్పులు ఇచ్చింది.

మాల్దీవ్స్ దేశ మొత్తం అప్పులలో 70 శాతం చైనా నుంచి తీసుకున్నవే. 2016లో చైనా అప్పు తీర్చలేక.. మాల్దీవ్స్ ఒక దీవిని చైనాకు కేవలం 40 లక్షల డాలర్లకే దశాబ్దాల వరకు లీజుకు ఇచ్చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులతో ఇండియాకు problems మొదలయ్యాయి.

ఎందుకంటే ఇండియా నుంచి బయలుదేరే అంతర్జాతీయ కార్గో షిప్పులు ఇండియన్ ఓషియన్‌లో మాల్దీవుల మీదుగా వెళ్లాలి. కానీ ఇండియా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ చైనా చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఒక మంచి మార్పు కనిపించింది. సుప్రీం కోర్టు కలుగజేసుకొని మళ్లీ ఎన్నికలు నిర్వహించింది. అలా 2019లో మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్‌గా Ibrahim soleh ఎన్నికయ్యారు.

ఆయన భారత దేశం పట్ల మిత్ర వైఖరి చూపారు. ఆయన హయాంలో భారత్, మాల్దీవ్స్ మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. మాల్దీవ్స్‌లో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా అక్కడ పెట్టుబడులు పెట్టింది. కొన్ని Infrastructure projects నిర్మాణాలు కూడా చేప్పట్టింది. 2020 లో రాజధాని మాలేను పొరుగు ద్వీపాలకు అనుసంధానించే వంతెనలు, కాజ్‌వేలను నిర్మించడానికి 500 మిలియన్ డాలర్లు అంటే 4 వేల కోట్లను భారత్ అందించింది.

క్రమంగా మాల్దీవ్స్.. చైనా నుంచి తీసుకున్న అప్పులు కొంతవరకు తిరిగి చెల్లించింది. మాల్దీవ్స్‌కు సొంత సైన్యం లేదు. అందుకే ఇండియన్ ఆర్మీలోని 75 జవాన్లు మాల్దీవ్స్‌కి వెళ్లారు. పైగా ఇండియా ఒక ఎయిర్ ఆంబులెన్స్‌ హెలికాప్టర్‌, ఒక సైనిక హెలీకాప్టర్, ఒక చిన్న విమానం మాల్దీవ్స్‌కు కానుకగా ఇచ్చింది.

ఇదంతా చూసి చైనాకు కడుపుమంట కలిగింది. అందుకే మాల్దీవ్స్‌ రాజకీయ పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌కు ధన సహాయం చేసి.. సోషల్ మీడియాలో ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది.

అలా #Indiaout, Indian military out అనే ఉద్యమం మాల్దీవ్స్‌లో మొదలైంది. ఈ ఉద్యమంతో 2023లో చైనాకు అనుకూలంగా ఉండే Mohamed Moizzu ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఏకంగా భారతదేశానికి వ్యతిరేకంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

దీంతో ఇండియాలో కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో #BoycottMaldives trend మొదలైంది. దీంతో భారతీయులు తమ మాల్దీవ్స్ హాలిడేలను రద్దు చేసుకుంటున్నారు. గత మూడు రోజుల్లోనే భారత పర్యటకులు రాకపోవడంతో మాల్దీవ్స్ హొటల్ బుకింగ్స్, flight tickets వేల సంఖ్యలో cancel అయిపోయాయి. ఈ దెబ్బతో మాల్దీవ్స్‌కు వెళ్లే flights కూడా రద్దవుతున్నాయి. మరోవైపు భారత సెలబ్రిటీలు మాల్దీవ్స్‌ వద్దు.. మన లక్షద్వీప్ ముద్దు అని ప్రచారం మొదలుపెట్టారు.

ఇదంతా చూసి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ Moizzu వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ, ఇండియా వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన వారిని సస్పెండ్ చేశారు. వారు చేసిన ట్వీట్లు వారి వ్యక్తిగతమని.. వాటితో మాల్దీవ్స్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేశారు.

ఇప్పుడు భారత దేశం కూడా మాల్దీవ్స్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. అందుకే లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం కూడా భారత సైన్యం తిరిగి తమ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని చెబుతోంది. ఎందుకంటే ప్రస్తుత మాల్దీవ్స్ ప్రభుత్వం చైనా చేతిలో కీలుబొమ్మ. అందుకే చైనా సహాయంతో.. ఇండియా వ్యతిరేక ధోరణి అవలంబిస్తోంది.

కానీ ఎంతచేసినా భారత్‌, మాల్దీవ్స్‌ ఇరుదేశాలకు ఒకరితో మరొకరి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ద్వేషాలు పెంచుకోవడం ఇద్దరికీ మంచిదికాదు. ఎందుకంటే ఇండియాతో అసూయపడే చైనా ఎప్పుడూ ఇలాంటి అవకాశాల కోసమే కాచుకొని ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాల్దీవ్స్‌ కంట్రోల్ పూర్తిగా చైనా చేతుల్లో వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అలా జరిగితే భారత్‌కు పెద్ద సమస్యే. అక్కడ చైనా సైన్యం పాగా వేస్తే.. భారత్ వ్యూహాలను ఈజీగా కట్టడి చేయగలదు. ఇప్పటికే పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ఇలా అన్నీ భారత పొరుగు దేశాలు చైనా కంట్రోల్‌లో ఉన్నాయి.

అందుకే.. మాల్దీవులతో పూర్తి స్థాయిలో శత్రుత్వం ఇండియాకు ఏమాత్రం మంచిది కాదు. పైగా మాల్దీవ్స్, ఇండియా మధ్య సంబంధాలు మళ్లీ మునుపటిలా చేసుకోగలగాలి.. అప్పుడే చైనా కుట్రలు తిప్పికొట్టవచ్చు.

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×