BigTV English

Kim Jong Un : సూదిమొనంత ఆక్రమించినా సహించం.. దక్షిణ కొరియాను హెచ్చరించిన కిమ్‌..

Kim Jong Un : సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్ హెచ్చరించారు. ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీలో కిమ్‌ ప్రసంగిస్తూ ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్‌ లిమిట్‌ లైన్‌ను గుర్తించాలన్నారు. సియోల్‌ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని కిమ్ జోంగ్ ఉన్ సూచించారు.

దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా పేర్కొంటూ చట్టాల్లో మార్పులు చేయాలని కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పునరేకీకరణ కోరడం అతిపెద్ద తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కొరియా ద్వీపకల్పంలోని సియోల్‌ను పూర్తిగా ఆక్రమించుకొని లొంగదీసుకొనేలా అనుమతిలిస్తూ చట్ట సవరణలు చేయాలని కిమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా మా భూమి, సముద్ర, గగనతలాల్లో 0.001 మి.మీ. సరిహద్దు అతిక్రమణకు పాల్పడినా.. దానిని యుద్ధ కవ్వింపుగానే పరిగణిస్తామని కిమ్‌ ప్రకటించారు.

ఈ ఏడాది నూతన సంవత్సరం వేళ కూడా కిమ్‌ ఉభయ కొరియాల పునరేకీకరణ సాధ్యం కాదని వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని కోరారు. మరో వైపు ఉ.కొరియా ఆయుధ పరీక్షలను కూడా వేగవంతం చేసింది. ఆదివారం హైపర్‌ సోనిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం దక్షిణ కొరియా దిశగా లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహించింది. నిఘా ఉపగ్రహాన్ని కూడా ఆ దేశం ప్రయోగించడం అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు తలనొప్పిగా మారింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×