Big Stories

Mega Controversy in AP Politics: ఏపీ పాలిటిక్స్ లో మెగా కాంట్రవర్సీ.. NDA కి సపోర్ట్..!

- Advertisement -

కానీ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ఆయన రాజకీయాలపై మాట్లాడుతున్నారు. తమ్ముడి పార్టీకి ఇటీవలే ఆర్థిక సాయం కూడా చేసిన మెగాస్టార్ ఇప్పుడు ఏకంగా NDA కూటమికి జై కొట్టారు. కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ డైరెక్ట్‌గానే ప్రచారం చేస్తున్నారు. నిజమే.. చాలా రోజుల తర్వాత చిరంజీవి పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఓ వైపు పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ బాబు. మరోవైపు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌. ఇలా ఇద్దరిని చెరో పక్క కూర్చొపెట్టుకొని మరీ ఆయన వారిని గెలిపించాలని కోరారు. సో ఆయన కూటమికి మద్ధతిచ్చినట్టేనా? తమ్ముడి పార్టీకి జై కొట్టినట్టేనా? అనే చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో..

- Advertisement -

నిజానికి చిరంజీవి మొన్నటి వరకు న్యూట్రల్ ముద్ర వేసుకున్నారు. కానీ ఇప్పుడా ముద్ర చెరిగిపోతుంది. కొన్ని రోజుల క్రితం షూటింగ్‌ లోకేషన్‌కు వెళ్లి బ్లెస్సింగ్స్ కోరిన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ 5 కోట్ల చెక్క్ ఇచ్చారు. తమ్ముడి మీద ప్రేమతో ఆయన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడుతుందనుకున్నారంతా కానీ అప్పుడే మొదలైంది ఈ ప్రచారం.ఇప్పుడీ ప్రచారాన్ని మెగాస్టార్ స్టేట్‌మెంట్‌ మరింత బలపరిచింది.

Also Read: అన్నా.. చెల్లి.. ఓ అప్పు కథ

అయితే సరిగ్గా రెండు నెలల క్రితం చిరంజీవి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవు..రాజకీయాల్లో హుందాతనం లేదు. అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలను తట్టుకోలేకే రాజకీయాల నుంచి బయటికి వచ్చాను. అంటూ మాట్లాడారు చిరంజీవి. మరి ఇప్పుడు ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ఆయన కూటమికి సపోర్ట్‌గా మాట్లాడటం కాంట్రవర్సీకి కారణమైంది.

నిజానికి 2019 ఎన్నికల్లో పవన్ సొంతంగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో చిరంజీవి ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. కానీ 2024 వచ్చే సరికి మెగాస్టార్ నోరు విప్పారు. అయితే అది అభ్యర్థులపై ఉన్న అభిమానంతో చేసినవా? అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతివ్వడం వెనక మాత్రం రాజకీయ ఎత్తుగడ తప్ప.. మరోకటైతే కనిపించడం లేదు.

అయితే చిరంజీవి ఇప్పటికి కూడా తమ పార్టీలోనే ఉన్నారంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఆ మధ్య సీఎం జగన్‌తో వరుస భేటీలు, మంతనాల సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారమూ జరిగింది. ఆ తర్వాత చిరంజీవికి పద్మవిభూషణ్‌ ప్రకటించిన తర్వాత.. ఆయన బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. అవార్డు ఇచ్చిందన్న అభిమానంతో బీజేపీ అభ్యర్థిని తమ్ముడి పార్టీ కాబట్టి జనసేన అభ్యర్థిని పక్కన కూర్చొబెట్టుకొని మద్ధతిచ్చినట్టు చర్చ నడుస్తుంది. ఇక తెలిసిందేగా.. చిరంజీవి వీడియో ఎప్పుడైతే రిలీజైందో వైసీపీ నుంచి కౌంటర్‌ అటాక్ మొదలైంది. చిరంజీవి రాజకీయం జీవితం.. పార్టీ విలీనం.. కేంద్రమంత్రి పదవి రావడం ఇక తవ్వి తీస్తున్నారు వైసీపీ నేతలు, అభిమానులు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తాను ఈ విషయంలో అస్సలు షాక్ కాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: మడకశిరలో మడతపేచి..

చిరంజీవి ముసుగు తొలగించారు. ఆయన కూడా కూటమితో కుమ్మక్కయ్యారు. అంటూ వైసీపీ నేతల విమర్శలతో పవన్ హర్ట్ అయ్యారు. మా అన్నయ్య అజాత శత్రువు అంటూ విరుచుకపడ్డారు. అప్పట్లో మూడు రాజధానుల విషయంలో చిరంజీవితో అనుకూలంగా మాట్లాడించారని పవన్ చెప్తున్నారు. దీంతో కొత్త డౌట్ తెరపైకి వచ్చింది. ఈసారైనా ఆయన సొంతంగా, ఇష్టపూర్వకంగానే మద్దతిచ్చారా? లేదా మరేవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే చెప్పారా? ఏమో చిరంజీవికే తెలియారు.

అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మాత్రం చిరంజీవిని ఎదురవుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మెగాస్టార్. మళ్లీ పొలిటికల్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ పదేళ్ల కాలంలో ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేదు? మరి దీనికి ఆయనే సమాధానం చెప్పాలి.

చిరంజీవి చేసిన ప్రకటనను చిరంజీవి తప్పు పడుతున్నా అది ఆయన వ్యక్తిగత విషయం. తనకు ఎవరికి మద్దతివ్వాలనిపిస్తే.. వారికి ఇస్తారు. ఆ ఫ్రీడమ్ ఆయనకు ఉంది. అందుకే చిరంజీవిపై ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పెద్దగా నిలబడవు. అయితే చిరంజీవి మాత్రం ఇకపై చేసే పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌ చేసే సమయంలో దోబూచులాడకుండా.. కుండబద్ధలు కొట్టేస్తే అటు నేతలకు, ఇటు ప్రజలకు ఓ క్లారిటీ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News