Big Stories

Madakasira Politics: మడకశిరలో మడతపేచి..

- Advertisement -

వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు లెక్కలతో త్యాగాలు తప్పవని టీడీపీ చెబుతూ వస్తోంది. ఈ క్రమం లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అందుకు గాను ఎక్కడా కూడా రాజీ పడకుండా గెలుపు గుర్రాలకే సీట్లు కట్టబెడుతున్నారు. సీటు వ్యవహారాలపై ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు అభ్యర్ధిగా ఖరారు అవుతారో లాస్ట్ మినిట్ వరకూ సస్పెన్స్ గానే ఉంటుంది.

- Advertisement -

పార్టీ శ్రేణుల అభిప్రాయాలు, సర్వేలు అన్నింటినీ కూడగట్టుకొని అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఈ రీజన్స్ తోనే అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం క్యాండిడేట్ గా ఎవరు ఫైనల్ అవుతారా అని చర్చ జరుగుతూ ఉంది. కానీ అనూహ్యంగా ఇన్నాళ్లు అనుకున్న అభ్యర్ధిని కాదని కొత్త వ్యక్తికి బీఫాం ఇచ్చారు చంద్రబాబు. ఏకంగా వారిద్దరూ పోటాపోటీగా నామినేషన్స్ దాఖలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మడకశిర నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: కాళ్ల బేరం.. నల్లారి Vs పెద్దిరెడ్డి..

ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్‌డ్ అయినా కూడా ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఆధిపత్యం బాగా కొనసాగింది. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయించిన అభ్యర్థి కాంగ్రెస్ తరపున గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత మొదటి ఎన్నికల్లో టీడీపీ మంచి మెజార్టీతో గెలిచింది. కానీ టీడీపీ ఎమ్మెల్యే మసాలా ఈరన్నపై అనర్హత వేటు పడడంతో వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి.

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం ఏది ఏర్పాటు చేసినా గ్రూపు తగాదాలు బయటపడుతూ వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం ఓ వైపు మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం మరోవైపు ఉండే వారు. ఇక ఎన్నికలు సమీపించిన తరుణంలో మొదట అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే మసాలా ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ ని అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో ఆయన వ్యతిరేఖ వర్గం అయిన తిప్పేస్వామి.. సునీల్ కుమార్ అభ్యర్ధిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అన్ని సర్దుకుంటాయి అనుకుని అదిష్టానం మొదట్లో కామ్ గా ఉంది. కానీ ఆ గ్రూపుల గొడవలు తగ్గకపోవడంతో అభ్యర్థిపై సర్వే నిర్వహించి నెగెటివ్ రావటంతో అభ్యర్ధిని మార్చాలని ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలోనే దళిత ఉద్యమ నాయకుడు MS రాజుకి మడకశిర అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ మాటలనే నిజం చేస్తూ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు సునీల్ ని కాదని MS రాజుకు బీఫాం కట్టబెట్టారు. అయితే వాళ్లిద్దరూ పోటీపోటీగా నామినేషన్‌ వేశారు. టీడీపీ అభ్యర్థిగా MS రాజు నామినేషన్‌ వేయగా టీడీపీ రెబల్‌గా సునీల్ కుమార్ బరిలో నిలవడం చంద్రబాబుకు ఊహించని షాక్.

Also Read: ఆర్ఆర్ఆర్ కి లైన్ క్లియర్.. అనపర్తి, దెందులూరు లో హై టెన్షన్!

అందరితో మమేకం అవుతూ ముందుకు వెళ్తామని MSరాజు స్పష్టం చేశారు. టీడీపీలో కష్టపడితే పదవులు వస్తాయనడానికి తానే నిదర్శనం అన్నారు. దళితులపై ఎక్కడ దాడులు జరిగినా ముందుండి పోరాడానని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని ఆయన అన్నారు.

మరోవైపు మడకశిర నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ కుమార్ కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఊహించని పరిణామాలతో ఇప్పుడు MS రాజు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. శింగనమల ప్రాంతానికి చెందిన MS రాజు పై నాన్ లోకల్ అన్న వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఆయన వ్యతిరేఖ వర్గీయులు. అలానే మడకశిర ప్రాంతానికి లోకల్ అభ్యర్థి ఎమ్మెల్యే కావాలని ఆ ప్రాంత నాయకులు పట్టుబడుతున్నారు. గతంలో వైసీపీ తరఫున ఎన్నికైన తిప్పేసామి కూడా పలమనేరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెస్ రాజు కూడా సింగనమల ప్రాంతానికి చెందిన వ్యక్తి. దాంతో టీడీపీలో రెబల్ వర్గం దీన్నే అస్త్రంగా చేసుకుంటుంది.

ఎమ్మెస్ రాజు అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పూర్తిగా బలపరిచి మద్దతిస్తున్నారు. దీంతో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సునీల్ కుమార్ ఏం చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు వైసీపీ ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చి ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో టీడీపీలో అభ్యర్థి విషయం సెగలు రేపుతుండడం పార్టీకి నష్టంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపమన్న సామెతలా తయారయింది మడకశిర టీడిపి పరిస్థితి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News