BigTV English

Kovur Politics: కొడుకు ఫ్యూచర్ కోసం నలిగిపోతున్న నల్లపరెడ్డి!

Kovur Politics: కొడుకు ఫ్యూచర్ కోసం నలిగిపోతున్న నల్లపరెడ్డి!

Kovur Politics: కాలుజారినా వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు. రాజకీయాల్లో సైతం ఆ నానుడి గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అవేశంలోనో, పార్టీ అధినేతల మెహర్బానీ కోసమో నోరు పారేసుకునే నేతలు తగిన మూల్యం చెల్లించుకుంటున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అలా నోరు జారే మూల్యం చెల్లించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై నోరు జారటం ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిందంటున్నా..ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యలు ఆమె పట్ల సానుభూతి పెంచితే.. కోవూరులో ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడిందంట. ఇంతకీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది?


నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన యోధానుయోధులు

నెల్లూరు జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రస్తుత కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మధ్య రేగిన రాజకీయ చిచ్చు రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి మధ్య చెలరేగిన రాజకీయ దుమారం పెద్ద కలకలమే రేపుతోంది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు అధికారపక్షం.. అధికార పార్టీని ఇరుక్కుని పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ పరస్పరం పావులు కదిపే స్థాయికి వారి మధ్య వివాదం వేదికవుతూ రోజురోజుకి ముదిరిపోతోంది. ఈ వివాదం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


శ్రీనివాసులురెడ్డి వారసుడిగా కొనసాగుతున్న నల్లపురెడ్డి ప్రసన్న

రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకస్థానం ఉంది . అలాంటి జిల్లారాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ యోధులు నల్లపరెడ్డి శీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆనం కుటుంబ సభ్యులు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక వెలుగు వెలిగారు.. ఆ కుటుంబాల నుంచి వారి వారసులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. నల్లపరెడ్డి కుటుంబం నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత నెల్లూరు టీడీపీ ఎంపీ, బడా ఇండస్ట్రియలిస్ట్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రశ్నార్ధకంగా మారిన నల్లపురెడ్డి రాజకీయ మనుగడ

అప్పటినుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల హద్దు మీరి ప్రశాంతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ మనుగడను ప్రశ్నార్ధకం చేశాయంటున్నారు. ప్రశాంతి రెడ్డికి కోవూరు వాసుల్లో సానుభూతి పెరుగుతుండటం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. నల్లపురెడ్డి అనుచిత వ్యాఖ్యలు కోవూరులో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. రోజులు గడుస్తున్న ఆ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు. ప్రశాంత రాజకీయాలకు నెలవైన కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి వరకు పరిస్థితి వచ్చిందంటేనే అక్కడ ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కొడుకు రజిత్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డ ప్రసన్న

తాను చేసిన వ్యాఖ్యలతో జరుగుతున్న తీవ్ర నష్టాన్ని గుర్తించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన తనయుడు రజిత్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జరిగిన నష్టాన్ని కవర్ చేసుకుంటూ అధికార పార్టీని ఇరుక్కుని పెట్టేందుకు ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారంట. ఇప్పటికే ఆయనను పోలీసులు మూడు గంటల పైగా విచారించారు. రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. మొత్తం 40 ప్రశ్నలకు ప్రసన్నకుమార్ రెడ్డిని వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలపై కేసులు పెట్టుకుంటూ వెళ్తే దేశంలో ఉన్న కోర్టులు చాలవంటూ ఆయన తన వైఖరిని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వచ్చినా తాము అధికారంలోకి వస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ తరహాలో ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ వారికి రెడ్‌బుక్ రాజ్యాంగం అవసరం లేదని, ఎవరు ఏంటి అనేది మైండ్ లో గుర్తుంటుందని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగులు కూడా ఇచ్చారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్లపై దాడులు చేసే రాజకీయాలు ఎప్పుడు లేవని చెప్పుకొచ్చారు.

Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. 27 వేల కోట్ల విలువైన ఆరు కొత్త ప్రాజెక్టులు

ప్రశాంతి పంచన చేరుతున్న నల్లపురెడ్డి అనుచరులు

మరొ పక్క వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా గ్రౌండ్ లెవెల్ లో పునాదులు పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరులుగా ఉన్న అనేక మంది వేమిరెడ్డి ప్రశాంతి కుమార్ రెడ్డి పంచన చేరారు. వారితో పాటు మిగిలిన వారిని కూడా టిడిపి వైపు మలచుకునేలా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పావులు కలుపుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో విజయాన్ని శాశ్వతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూనే.. తెర వెనుక మంత్రాంగంతో నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకోవడానికి పావులు కదుపుతున్నారంట. మరి ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం కోవూరులో రాజుకుంటున్న ఎన్నికలవేడి ఎలాంటి సెగలు పట్టిస్తుందో చూడాలి.

Story BY Rami Reddy, Bigtv

Related News

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

YCP Vs TDP: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు

AP News: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం

Kalvakuntla Family Issue: అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్! అసలు లెక్కలేంటి?

Big Stories

×