BigTV English
Advertisement

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

New Royal Enfield Bikes:  రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

New Royal Enfield Bikes:

రాయల్ లుక్ బైక్స్ కు పెట్టింది పేరు అయిన రాయల్ ఎన్‌ ఫీల్డ్ మరో రెండు క్రేజీ బైక్స్ ను లాంచ్ చేసింది.  స్టైలిష్ లుక్, అదిరిపోయే ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ల ధర ఎంత? స్పెసిఫికేషన్లు ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ బుల్లెట్ 650

తాజాగా విడుదల చేసిన బైక్స్ లో బుల్లెట్ 650 ఒకటి. ఇది టియర్‌ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్,  వింగ్స్ బ్యాడ్జ్, రౌండ్ హెడ్‌ ల్యాంప్ సెటప్ లాంటి RE సిగ్నేచర్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ అదే స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్, ట్యూబ్డ్ స్పోక్ వీల్స్‌ తో ఉంటుంది. ఈ బైక్ లో కీలకమైన మార్పు ఇంజిన్. ఇది 648cc పార్లల్ ట్విన్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇంటర్‌ సెప్టర్, కాంటినెంటల్ GT, బేర్ 650 పై రన్ అవుతుంది. దీని మోటారు ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్, స్లిప్పర్ క్లచ్‌ తో వస్తుంది. ఈ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంచబడుతుంది. అయితే, ఈ బ్రాండ్ భారత్ కు సంబంధించి నిర్దిష్ట లాంచ్ టైమ్‌ లైన్‌ ను ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఇది  అందుబాటులోకి వస్తుందని ఆటో మోబైల్ నిపుణులు భావిస్తున్నారు.

⦿ ఫ్లయింగ్ ఫ్లీ S6

తాజాగా విడుదలైన మరో బైక్ ఫ్లయింగ్ ఫ్లీ S6. ఇది ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ లాంటి మోటార్‌ సైకిల్.  ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సిటీ ప్రయాణీకులు వీకెండ్ ట్రిప్పులకు అనుగుణంగా ఉంటుంది. దీని డిజైన్ ను చూస్తే ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ అనేలా ఉండదు. ఇది USD ఫ్రంట్ ఫోర్క్, చైన్ డ్రైవ్ సిస్టమ్, 19-అంగుళాల ఫ్రంట్, 18-అంగుళాల బ్యాక్ వీల్ సెటప్ ఉంటుంది. ఎండ్యూరో స్టైల్డ్ సీట్లతో అమర్చబడి ఉంటుంది. దీనికి స్విచ్ చేయగల ABS, మల్టీ రైడింగ్ మోడ్స్, లీన్ సెన్సింగ్, నావిగేషన్,  మీడియా కనెక్టివిటీ కోసం బ్లూ టూత్ సపోర్ట్, వాయిస్ అసిస్ట్, కీలెస్ రైడింగ్ సహా క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్రస్తుతం బ్యాటరీ ప్యాక్ వివరాలతో పాటు ఈ మోడల్ లాంచ్ టైమ్‌ లైన్‌ ను వెల్లడించలేదు. ఈ బైక్ 2026 ఫస్ట్ హాఫ్ లో వస్తుందని భావిస్తున్నారు.   ఈ రెండు బైకుల ధరలు రూ. 2 లక్షల నుండి ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అటు ఈ బ్రాండ్ కొత్త ఎడిషన్‌ లో హిమాలయన్ 450ని కూడా విడుదల చేసింది. కొత్త ఎడిషన్ ర్యాలీ హిమాలయన్‌ తో వస్తుంది. పూర్తిగా నలుపు రంగు డిజైన్ ను కలిగి ఉంది. మిగతా ఫీచర్ల అలాగే ఉన్నాయి. మరోవైపు 750cc హిమాలయన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: టాటా సంస్థ.. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా?

Related News

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×