BigTV English

Chandrababu Progress Report: ఏపీకి గుడ్‌న్యూస్.. 27 వేల కోట్ల విలువైన ఆరు కొత్త ప్రాజెక్టులు

Chandrababu Progress Report: ఏపీకి గుడ్‌న్యూస్.. 27 వేల కోట్ల విలువైన ఆరు కొత్త ప్రాజెక్టులు

Chandrababu Progress Report: గత వారం ఏపీ సీఎం డైరీ ఎలా సాగిందో చూస్తే.. ఇకపై రెండు గంటల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్లేలా రహదారుల నిర్మాణం. ఆపై అన్నదాత సుఖీభవ. గండికోటకు పర్యాటక శోభ. పేదల సేవలో ముఖ్యమంత్రి. రాయలసీమకు జలకళ. రాజధాని సుందరీకరణ, ఫైనల్ గా సింగపూర్ టూర్ విజయవంతంగా ముగించుకుని ఏపీకి చేరుకున్న ముఖ్యమంత్రి. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.


JUL 28, సోమవారం- సీఎం టూర్ ఆఫ్‌ సింగపూర్
ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక..ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదే అన్నారు మంత్రి నారా లోకేష్. అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌లో సహకారం అందించాలని ఆయన కోరారు. ఏపీలో ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్స్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు లోకేష్.

JUL 29, మంగళవారం- సింగపూర్ లో సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు. విశాఖలో ఇందుకు అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేశామన్నారు. సింగపూర్ లో మూడోరోజు సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని చెప్పారు సీఎం చంద్రబాబు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు సీఎం. అలాగే దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని.. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందన్నారు సీఎం. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందటంతో పాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై GIC సంస్థ CIO బ్రాన్ యోతోనూ భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు సీఎం బాబు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారాయన.

ఏపీని AI హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం సింగపూర్ టూర్‌లో ఇందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. AI సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో భేటీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో AI పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలోని యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లలో.. AI సింగపూర్ భాగస్వామ్యంగా పని చేయాలని కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ ట్రైనింగ్స్‌, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైనా చంద్రబాబు-కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.

SIA ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ లిన్ తోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు వివరించారు బాబు. MRO విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్.. తర్వలోనే రాష్ట్రానికి తమ ప్రతినిధులను పంపుతామని చెప్పారు. SIA ఇంజినీరింగ్ వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి MRO కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖ, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు చంద్రబాబుతో భేటీపై సింగపూర్ వాణిజ్య మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు మంత్రి టాన్సీ లెంగ్. భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు మంత్రి. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు టాన్ సీ లెంగ్ ప్రకటించారు.

JUL 30, బుధవారం- సింగపూర్ వరుస భేటీలు
నాలుగు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని అమరావతి పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికారు సింగపూర్ లోని తెలుగువారు. ఇదిలా ఉంటే బాబు.. సింగపూర్ పర్యటనలో నాలుగో రోజున వరుస భేటీలు నిర్వహించారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ , మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు సీఎం చంద్రాబాబు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో చర్చలు జరిపారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, అవకాశం ఉందని సమావేశంలో చంద్రబాబు వివరించారు.

వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో చర్చలు జరిపారు చంద్రబాబు. ఏపీలో ఆయా రంగాల్లో.. పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్ కు చెందిన SMBC ఎంఈవో రాజీవ్ కన్నన్‌తో చర్చించారు. ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని చంద్రబాబుకు సూచించారు రాజీవ్ కన్నన్.

సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల సానుకూల వాతావరణం, నూతన పారిశ్రామిక విధానాలను తెలియ చేశారు. డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ఉన్న అపారమైన అవకాశాలను సింగపూర్ అధ్యక్షుడికి వివరించింది టీమ్ ఆఫ్‌ ఏపీ సీఎం. భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని అందించేందుకు సానుకూలంగా స్పందించారు సింగపూర్ దేశాధ్యక్షుడు.

ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐల్యాండ్‌ను సీఎం చంద్రబాబుతోపాటు మంత్రుల బృందం సందర్శించింది. ఈ సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో.. సమీకృత పెట్రో కెమికల్ ప్లాంట్, ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది సింగపూర్. ఈ కేంద్రం అందిస్తున్న సేవలను సీఎం బృందానికి వివరించారు సింగపూర్ ఉన్నతాధికారులు. మొత్తం 3 వేల హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పెట్రో కెమికల్ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్టు చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్‌తోపాటు సమీకృత భద్రతా వ్యవస్థలు సైతం ఏర్పాటు చేశామని అన్నారు. ఇందు కోసం చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్‌తోపాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను చూపించారు. పెట్రో కెమికల్ సెంటర్లో.. ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్‌ను వారికి వివరించారు.

ఏపీ సీఎం సింగపూర్ పర్యటనలో పలువురు అధికారులు, సీఈవోలతో భేటీ అయ్యారు. అన్నింటా ఏపీని ముందుంచడంలో భాగంగా.. పలు సంస్థలతో సమాలోచనలు చేశారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికలేంటన్నది వివరించారు. ఇందుకు సింగపూర్ లోని పలు కంపెనీలు, ప్రభుత్వ ప్రతినిథులు ఎలా స్పందించారు?

జూలై 31 గురువారం- రాయలసీమకు జలకళ
కృష్ణా, గోదావరి నదుల్లో వరద కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రచించాలని ఆదేశించారు సీఎం.

జూలై 31 గురువారం- రాజధాని సుందరీకరణ
రాజధాని సుందరీకరణ, గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, అనుబంధ రహదారులు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. ఔషధ మొక్కలను నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణపై అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

జూలై 31 గురువారం- వెల్కం టు సీఎం
నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని అమరావతి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

AUG 1, శుక్రవారం- పేదల సేవలో సీఎం
కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, గూడెంచెరువులో పేదల సేవలో అనే కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి ఆమెకు వితంతు పింఛన్ ను స్వయంగా అందచేశారు. అలివేలమ్మ పెద్ద కుమారుడు వేణుగోపాల్ జీవన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆయన పిల్లలకు తల్లికి వందనం స్కీమ్ కింద లబ్ది చేకూరిందని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. అలివేలమ్మ చిన్న కుమారుడు జగదీష్ తో మాట్లాడుతూ ఆయన ఆటోలో ప్రయాణించారు సీఎం చంద్రబాబునాయుడు.

AUG 1, శుక్రవారం- అన్నదాత సుఖీభవ
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటను సందర్శించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యాటకుల వసతి సౌకర్యాలపై స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత పర్యాటక రంగంలో పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

AUG 2, శనివారం- నాగరికతకు రహదారులు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఏపీకి ఆరు ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని గర్వంగా చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 27వేల కోట్లని అన్నారాయన. గడ్కరీ ప్రాజెక్టులకు ఎప్పుడూ నో చెప్పరని అంటారు సీఎం చంద్రబాబు. ఎలాగైనా సరే పూర్తి చేయాలని చూస్తారని.. అదే నితిన్ గడ్కరీ బలంగా చెప్పారు చంద్రబాబు. 1883 కిలోమీటర్ల రోడ్లు కావాలని అడిగాం. ఇందుకోసంగానూ 85 వేల కోట్ల బడ్జెట్ అవుతుంది. అయినా సరే ఎంత మాత్రం వెనకాడకుండా.. రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు చంద్రబాబు. గడ్కరీ మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు. మోడీ దూర దృష్టితో రహదారులకంటూ ఒక రూపం ఇస్తే.. దీన్ని గడ్కరీ ముందుకు తీస్కెళ్తున్నారని ప్రశంసించారు చంద్రబాబు. గడ్కరీ వాటర్ రీసోర్స్ మంత్రిగా పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చారనీ.. ఒక రూపం ఇచ్చారనీ ఈ విషయం తాను ఎన్నటికీ మరచిపోనని అన్నారు సిఎం చంద్రబాబు నాయుడు. సాగర్ మాల, భారత్ మాల వంటి ప్రాజెక్టులు గడ్కరీ అధ్వర్యంలో జరిగాయని.. అన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరు నుంచి తిరుపతికి గతంలో 10 గంటల సమయం పట్టేది. అదే ఇప్పుడా సమయం బాగా తగ్గింది. గత ఐదేళ్లలో రోడ్లు అద్వానంగా మారాయి. నేషనల్ హైవే దిగితే నరకం కనిపించేది. అదే ఇప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో మనం రోడ్లను మరింత మెరుగు పరుచుకుంటున్నామని అన్నారు. రవాణా ఖర్చలు తగ్గాలంటే లాజిస్టిక్స్ పెరగాలని.. అంటే పోర్టులు, రోడ్లు బాగుండాలని అన్నారు చంద్రబాబు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ వస్తే రైతులకు లక్షల్లో ఆదా అయ్యే అవకాశముందని.. అన్నారు సీఎం. ఈ హైవే వల్ల.. విజయవాడ నుంచి హైదారాబాద్ ప్రయాణ సమయం- 2 గంటలకు తగ్గుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Also Read: ఎలక్షన్ ఎఫెక్ట్..! ఓటర్లు ఎలా పెరిగారు? EC పై చిదంబరం గరం గరం

AUG 2, శనివారం- అన్నదాత సుఖీభవ
నేను బతికి ఉన్నంత వరకూ అన్నదాతలను నిలబెట్టే బాధ్యత నాది అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పంట పండినా పండకున్నా.. తుపాన్లు వచ్చినా.. ప్రకృతి సహకరించకున్నా రైతు వ్యవసాయం మానడు. కరోనా టైంలో కూడా నాగలి భుజాన వేసుకుని.. దేశానికి అన్నం పెట్టాలన్న తపనతో ముందుకు కదిలాడు. అలాంటి అన్నదాతకు అండగా ఉండే బాధ్యత నాది. మా ప్రభుత్వానిదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతే రాజు కావాలన్న ఆశయంతో.. తనకు ఎన్ని కష్టాలున్నా సరే.. ఎన్నికల ముందు వారికిచ్చిన మాట నిలబెట్టానని అన్నారు. ప్రకాశం జిల్లా, దర్శి మండలం, తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. అన్నదాత సుఖీభవకు సంబంధించి తొలి విడుతలో.. చెక్కులు అందజేశారు.

Story By Adinarayana, Bigtv

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×