Bahubali: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli ) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపును అందుకోవడమే కాకుండా.. బాహుబలి 2 చిత్రంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచేలా చేశారు. అంతేకాదు ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి ప్రపంచ స్థాయి గుర్తింపును ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి 1&2 చిత్రాలను కలిపి ఒకే మూవీ గా ‘బాహుబలి: ది ఎపిక్’ అంటూ అక్టోబర్ 31వ తేదీన థియేటర్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే..ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ లభించింది.
అయితే ఇప్పుడు తాజాగా ‘ బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 3డీ యానిమేషన్ తో సినిమాను రూపొందిస్తున్నామని ఇటీవల ‘బాహుబలి: ది ఎపిక్ ‘ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ‘ బాహుబలి: ది ఎపిక్’ సినిమా ప్రదర్శనలో భాగంగా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ALSO READ:Manchu Manoj: రాజ్యం లేదు కానీ రాణిలా చూసుకుంటా.. మనసును హత్తుకుంటున్న మనోజ్ మాట!
టీజర్ విషయానికొస్తే..” బాహుబలి మరణం ముగింపు కాదు.. ఓ మహాకార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం” అంటూ శివగామి అలియాస్ రమ్యకృష్ణ డైలాగ్ తో ఈ త్రీడి అనిమేషన్ ఫిలిం టీజర్ ను ప్రారంభించారు. బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్లడం, అక్కడ శివలింగం ముందు డాన్స్ చేయడం.. ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా ఇందులో ఇంద్రుడు, విశాసురుడు బాహుబలి కోసం భీకరంగా పోరాడుతారు. ఈ యుద్ధంలో విశాసురుడు ఓడిపోతాడు. తర్వాత బాహుబలి యమలోకానికి వెళ్లడం మనం చూడవచ్చు. ఇదంతా చూస్తుంటే ఇదొక కొత్త కాన్సెప్ట్ తో దీనిని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు ఇషాన్ శుక్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది అని రాజమౌళి స్పష్టం చేశారు.. ఇకపోతే ఈ చిత్రానికి సమర్పకుడిగా రాజమౌళి వ్యవహరిస్తూ ఉండగా.. ఇందులో ఆకాశలోకంలో బాహుబలి చేసే యుద్ధ విన్యాసాలను ఇక్కడ చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే బాహుబలి చిత్రాలకు ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ త్రీడి యానిమేషన్ మూవీ ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఎస్ ఎస్ ఎమ్ బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను 2027లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.