Intinti Ramayanam Today Episode August 4 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి పెళ్లి గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని పల్లవి పార్వతికి చెప్తుంది. ఇక అక్షయ్ కు పార్వతికి ఫోన్ చేసి వాళ్లు నమ్మారు అన్న విషయాన్ని చెప్తాడు.. వాళ్లు ఇప్పుడే ప్రణతికి పెళ్లి చేయకుండా ఒక విషయం చెప్పానమ్మా అని అక్షయ్ అంటాడు. ఏంట్రా అది అని అడుగుతుంది. ముందు భరత్ కి జాబ్ తెచ్చుకోమని చెప్పండి తర్వాతే పెళ్లి చేస్తాము అని చెప్పాను. నీకు ఇంకా టైం ఉంది కదా అమ్మ నువ్వేం భయపడకు నీకు నచ్చిన అబ్బాయి తోనే నువ్వు పెళ్లి చేద్దువు అనేసి భరోసా ఇస్తాడు.. పార్వతి అక్షయ్ మాట చెప్పగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ పల్లవి మాత్రం మరో ఫిట్టింగ్ పెడుతుంది.
మీరంతా ఏడుస్తూ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాము అని అనుకుంటుంది. పల్లవి మాత్రం బావగారి అలా చెప్పినా కూడా ప్రణతినీ అంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇక్కడికి తీసుకురావాలి అని అడుగుతుంది.. పార్వతి పల్లవి చెప్పిన విషయాన్ని ఆలోచిస్తుంది. అటు అక్షయ్ వాళ్ళమ్మ చెప్పిన మాటని ఎలా తీసుకోవాలి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే అమ్మ సంతోషంగా ఉండేలా చేయాలని ఆలోచిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని పాయసం చేసి రాజేంద్రప్రసాద్ దగ్గరికి తీసుకొస్తుంది. భోజనం చేశాక కాఫీలు టీలు వద్దమ్మా అని అడుగుతాడు. అయ్యో మావయ్య ఇది కాఫీ కాదు పాయసం తీసుకోండి అని అంటుంది. ఈ టైంలో పాయసం చేసావ్ ఏంటమ్మా అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. ఆయన మన మాటకు విలువిచ్చాడు అందుకే ఈ స్వీట్ చేశాను అని అంటుంది. నాకెందుకు అనుమానంగా ఉంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అక్షయ్ కి ఇస్తాను అని అనగానే పెళ్లి ఇవ్వమ్మా అని అంటాడు. అక్షయ్ డాక్టరు మెడిసిన్ తో పాటి ఇది కూడా ఇవ్వమని అన్నారా అని అంటాడు.
మీరు ప్రణతి భరత్లను సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారు కదా నేను సంతోషంతో మీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను. మీరు తినండి అని అడుగుతుంది. వీళ్ళందరూ నేను నిజంగానే వీళ్లకు సపోర్ట్ చేస్తున్నానని అనుకుంటున్నారు అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత భానుమతికి కమల్ చుక్కలు చూపిస్తాడు. నువ్వు ప్రణతి పెళ్లికి సపోర్ట్ చేయట్లేదు అందుకే నేను చంపేసి నా దగ్గరికి తీసుకుపోతాను అని బెదిరిస్తాడు. దానికి భానుమతి భయపడుతుంది. నేను ఏదో ఒకటి చేస్తాను లేండి అని భానుమతి కమలాకర్ని బ్రతిమలాడుతుంది.
రాజేంద్రప్రసాద్ కోసం పంతులు వస్తాడు. అవని మావయ్య గారు పంతులు గారిని పిలిచారు ఏదైనా పూజలు వ్రతాలు చేపిద్దామని అనుకుంటున్నారా అని అడుగుతుంది. అదేమీ లేదమ్మా ప్రణతి భరత్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని పిలిపించాను అని అంటాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ మాట విన్న అక్షయ్ షాక్ అవుతాడు. నేను పెళ్లి చేస్తానని చెప్పాను కదా ఇంత సడన్గా ఎందుకు మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అని అక్షయ్ అడుగుతాడు..
మీ అమ్మ ప్రణతి పెళ్లి ని ఆపేందుకు ఏదైనా చేయొచ్చు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఎంత చేసినా కూడా తన కూతుర్ని తన వైపు తిప్పుకునేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే తొందరగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. కానీ అవని మాత్రం మీరు చేస్తున్న తప్పు మామయ్య అత్తయ్య గారిని ఒప్పించే పెళ్లి చేస్తే బెటర్ అని అంటుంది. రాజేంద్రప్రసాద్ అలా చేయడం కాదు ఇప్పుడు ఇలా చేస్తేనే మీ అత్తయ్య దారికి వస్తుందని అంటాడు. అవని మాత్రం అస్సలు ఒప్పుకోదు.
Also Read : కల్పన కోసం రోహిణి వేట..ప్రభావతి దెబ్బకు రోహిణి మైండ్ బ్లాక్..
అక్షయ్ గూడ అవనికి సపోర్టుగా మాట్లాడుతాడు. అటు ఉదయం లేవగానే భానుమతి అందరితో ప్రణతి పెళ్లి చేయాల్సిందే అని అంటుంది. ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. నా నిర్ణయాన్ని ఎవరు కాదనరని నా నమ్మకమని అంటుంది. కానీ పార్వతి మాత్రం అసలు ఒప్పుకోను అని అంటుంది. అన్నయ్యని ఎవరు కాదనకూడదు అని భానుమతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…