Bhogapuram Airport: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏవియేషన్ విభాగానికి హబ్‌గా మారనుందా? ఈ ఏడాది చివరలో ట్రయిల్ రన్ మొదలుపెట్టాలని పౌరవిమానయాన శాఖ భావిస్తోందా? కేవలం ఎయిర్‌పోర్టు కాకుండా ఏవియేషన్ యూనివర్సిటీ రాబోతుందా? అదే జరిగితే సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా ఏవియేషన్‌కు హబ్‌గా ఏపీ మారునుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్
మంగళవారం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులను కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడ పనులు జరిగిన తీరును గమనించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆ శాఖ అధికారులతో నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఓవరాల్‌గా ఎయిర్‌పోర్టు పనులు ఇప్పటివరకు 91.7 శాతం పూర్తి అయినట్టు చెప్పారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లో లేదా జనవరిలో ట్రయల్ రన్ మొదలు కావచ్చు.
ఎయర్‌పోర్టు పనులు జోరుగా సాగుతున్నందున ఎకనామిక్ యాక్టివిటీ బాగా పెరగనుంది. అంతేకాదు ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాలకు ఈ ఎయిర్ పోర్ట్ కేంద్ర బిందువుగా మారనుంది. ఉత్తరాంధ్ర సంస్కృతిని ఎయిర్‌పోర్టులో ప్రతిబింబించనుంది. ఎయిర్‌పోర్టు చుట్టూ 5 స్టార్ హోటల్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ పరంగా ఏవియేషన్ మినిస్ట్రీ నుండి చేయాల్సినవన్నీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు పౌర విమానయాన శాఖ మంత్రి. ప్రస్తుతం కొన్ని పలు ఎయిర్ లైన్స్ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు.
ఏవియేషన్ యూనివర్సిటీ కూడా
ఇండిగో సంస్థతో సంప్రదింపులు చేస్తున్నామని, ఆ సంస్థకు హబ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కనెక్టవిటీ పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖ ఏఐకి మాత్రమేకాకుండా ఎయిర్ పోర్టుకి కీలకంగా మారబోతోందన్నారు. ఈ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భోగాపురం ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు ఓపెనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
ALSO READ: మిథున్ రెడ్డి అరెస్టుకి ఉపోద్ఘాతం.. జోగి అరెస్టుపై స్పందన తూతూ మంత్రంగా
నవంబర్ సెకండ్ వీక్‌లో విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుకు ఏవియేషన్‌కి చెందిన పలు కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ భోగాపురానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. దేశంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవియేషన్‌కు సంబంధించి యూనివర్సిటీలో ఒకటి లేదా రెండు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
కాకపోతే విశాఖకు రాబోయే ఏవియేషన్ యూనివర్సిటీని పీపీపీ మోడల్‌లో నిర్మించాలన్నది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల పరంగా జిల్లాకు ఓ ఎయిర్‌పోర్టు ఉండాలని సీఎం చంద్రబాబు ప్లాన్. ఎయిర్‌పోర్టు-రైల్వే- రోడ్లు కనెక్టివిటీ ఉంటే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తోంది.