Dharma Mahesh:సినిమా ఇండస్ట్రీలో భార్యాభర్తల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తే.. మరికొంతమంది ఇలా ప్రేమ పెళ్లి చేసుకొని జీవితంలో ఒక్కటిగా కొనసాగలేక విడాకులు తీసుకొని విడిపోయిన వారు ఉన్నారు. ఇంకొంతమంది తమ జీవిత భాగస్వామి మోసం చేశారు అంటూ రోడ్డుకి ఎక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన భర్త తనను కాదని వేరొక అమ్మాయిలతో గడుపుతున్నాడు అని.. అర్ధరాత్రి బెడ్ రూమ్ లోకి తీసుకొస్తున్నారని.. బాధిత భార్య పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇప్పుడు ఆమె భర్త తాను ఏ తప్పు చేయలేదని.. కావాలనే తన భార్య తనపై నిందలు వేస్తూ తనను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా తన పరువుకు భంగం కలిగించింది అని ఆ భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అంతేకాదు ఆమెతోపాటు ఇంకొక వ్యక్తిపై కూడా కేసు ఫైల్ చేయించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆ దంపతులు ఎవరో కాదు ప్రముఖ హీరో ధర్మా మహేష్ (Dharma Mahesh) ఆయన భార్య గౌతమీ చౌదరి ( Gautami Chaudhary) వీరిద్దరి మధ్య గొడవ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ధర్మ మహేష్ ప్రముఖ యాంకర్ రీతూ చౌదరి (Rithu Chowdhary) తో కలిసి అర్ధరాత్రి తమ ఫ్లాట్ కి వస్తున్నారు అని.. డ్రగ్స్ తీసుకుంటున్నారని.. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లను కూడా గౌతమీ చౌదరి సోషల్ మీడియాలో వదిలిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఈ విషయంపై ధర్మా మహేష్ పోలీసులను ఆశ్రయించారు.
ALSO READ:Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!
పూర్తి వివరాల్లోకి వెళితే.. సింధూరం, డ్రింకర్ సాయి వంటి సినిమాలలో హీరోగా నటించిన ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత గోప్యత, ప్రైవసీకి భంగం కలిగించారని.. కాబట్టి తన భార్యతో పాటు మరొక వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏ1 గా గౌతమీ చౌదరి, ఏ 2గా మరో వ్యక్తిని చేర్చారు. ఇకపోతే వీరిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి అని.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆ వ్యక్తి తనను రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. కాబట్టి సదరు వ్యక్తిపై పాటు తన భార్యపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మా మహేష్ కోరారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ధర్మా మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ హైకోర్టు సూచనలతో ఈ ఇద్దరిపై సెక్షన్ 308(3) BNS 72 IT act కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.