Sunita Rao: రోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది? పీసీసీకి మహేష్‌కుమార్‌గౌడ్ ఫ్యామిలీని ఆపాదించి మరీ గాంధీభవన్‌లో ఆయన ఛాంబర్ ముందే హాట్ కామెంట్స్ దేనికి సంకేతం? .. నెక్స్ట్ సునీత రావు ఎం చేయబోతున్నారు? పార్టీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ కానుంది? అల్ ఇండియా మహిళ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సునీతరావు వివరణ ఇస్తారా?
సొంత పార్టీ నేతలపై సునీతరావు హాట్ కామెంట్స్
మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఏ కార్యక్రమం చేపట్టినా వేరే లెవల్‌లో ఉంటుంది. ప్రతిపక్షాన్ని ఔట్ రేట్‌గా ఆడేసుకునేవారు. అయితే అది మొన్నటి వరకు. సీన్ కట్ చేస్తే సునీతరావు సొంత పార్టీ పైనే హాట్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. పీసీసీ కూర్పులో మహిళ నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం 9 నెలల గ్యాప్ తర్వాత వెలువడనున్న పీసీసీ కమిటీ లీస్టుపై చాలా మంది లీడర్లు ఆశలు పెట్టుకుని కనిపిస్తున్నారు. ఈ లిస్ట్‌లోనే తమ పేరు రావాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అధిష్టానంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్, సీఎంలపై సునీతరావు విమర్శలు
ఆ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లపై సునీత రావు హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ తమ మనుషులకు, బంధువులకే పదవులు ఇస్తున్నారని ఈవ్ర ఆరోపణలు గుప్పించారు. గాంధీభవన్‌లో సునీతరావు ఓవర్‌యాక్షన్ వెనక వ్యూహం ఏంటి అనే చర్చ మొదలయింది. పదవుల విషయంలో హైకమాండ్ నిర్ణయాలను ప్రశ్నించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికలలో గోషామహల్ టికెట్ ఇచ్చినా ఓటమిపాలైన సునీతరావు ఇప్పుడు రచ్చ చేయడానికి కారణం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది దక్కకపోవడమే అంటున్నారు.
మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పోస్టుపై హైకమాండ్ హామీ
త్వరలో ఖాళీ కానున్న మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పోస్టు ఇస్తామని పార్టీ పెద్దలు సునీతరావుకి హామీ ఇచ్చారు. అయితే ఆమె పార్టీ లైన్ దాటి పీసీసీ చీఫ్‌నే టార్గెట్ చేయడంతో అసలుకే ఎసరొచ్చినట్లైంది. పీసీసీ మహేష్ కుమార్, సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పలువురు మంత్రులు, పార్టీ నాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. సునీతరావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గాంధీభవన్ మెట్లపై కొందరు మహిళా నేతలు నిరసన కూడా చేశారు. సునీతరావు కో హటావో అంటూ నినాదాలు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ అధిష్టానికి గోషామహల్ నేతల ఫిర్యాదు
ఆ మేరకు కాంగ్రెస్ గోషామహల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ నేతలు, నాయకులు పార్టీ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. గాంధీభవన్‌లో చేసిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై సునీతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వారు తమ లేఖలో పేర్కొన్నారు. సునీతారావుకు గోషామహాల్ ఎమ్మెల్యే టిక్కెట్, డబ్బులు ఇచ్చి పార్టీ సముచిత న్యాయం చేసిందని గుర్తు చేశారు. కానీ ఆమె మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరినీ కలవలేదని, సమస్యలను గాలికి వదిలేశారని, డబ్బులు తీసుకుని ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నారంటూ వారు పేర్కొన్నారు.
Also Read: వైసీపీ వీఐపీలకు స్పెషల్ జైలు అక్కడే
సునీతరావుకి బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం?
సునీతరావు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని కూడా ఆరోపించారు. ఆ మేరకు మంత్రులు, పార్టీ శ్రేణులు నేరుగా ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావుకు ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. సునీతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు నోటీసు జారీచేసింది..వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సునీత రావును ఆదేశించింది.
షోకాజ్ నోటీసుకు వారంలోకా వివరణ ఇస్తారా?
పీసీసీపై సునీత రావు చేసిన వ్యాఖ్యల ను తీవ్రంగా పరిగణించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసుతో వార్నింగ్ ఇచ్చింది.. ఇప్పుడు సునీతరావు నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఏఐసీసీ షో కాజ్ నోటీసుకు వారంలోగా వివరణ ఇస్తారా? వివరణ ఇవ్వకపోతే పార్టీ పరంగా ఎలాగూ చర్యలు తప్పవు. ఒకవేళ వివరణ ఇచ్చినా పార్టీ పెద్దలు సంతృప్తి చెందకపోతే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. ప్రస్తుతం ఇవే అంశాలతో సునీతరావు ఎపిసోడ్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.