Gali Kireeti Reddy : ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) తనయుడు గాలి కిరీటి రెడ్డి (Gali Kireeti Reddy) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఇందులో శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ జెనీలియా (Genelia D’Souza) కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా తెలుగు, కన్నడ,హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో జూన్ 18న విడుదల కాబోతోంది. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పేరుకే జూనియర్ మూవీ .. కానీ రెమ్యూనరేషన్ మాత్రం చాలా సీనియర్స్ ఇస్తున్నట్లే ఇస్తున్నట్లు సమాచారం.
పేరుకే జూనియర్.. కోట్లల్లో రెమ్యూనరేషన్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ జూనియర్ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ఏకంగా రూ .5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్ శ్రీ లీలాకి ఇది డెబ్యూ మూవీ. ఆమె కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.3కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. వాస్తవానికి శ్రీ లీల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఈ సినిమాకి సైన్ చేసింది. అయితే హీరో వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. పైగా ఈ గ్యాప్ లో శ్రీ లీలా ఏకంగా 11 సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.నిజానికి ఈమెకు ఇప్పుడు వున్న స్టేటస్ తగ్గట్టుగా ఈ రెమ్యూనరేషన్ సరిపోయినా..మొదటి సినిమాకే రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ అంటే ఆశ్చర్యపోయే విషయమని చెప్పవచ్చు. పైగా ఈ చిత్రంలో నటించే వారికి ఇక రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ముట్ట చెబుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది పేరుకే జూనియర్ మూవీ కానీ ఈ రెమ్యునరేషన్ వివరాలు చూస్తుంటే భారీ బడ్జెట్ మూవీ అన్నట్టు తెలుస్తోంది.
ఈ భారీ బడ్జెట్ మూవీ వెనుక అసలు హస్తం ఆయనదేనా..?
ఇకపోతే ఈ చిత్రానికి వారాహి బ్యానర్ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. దీని వెనుక ఈ చిత్రానికి ఫండింగ్ మొత్తం ఇచ్చేది హీరో గాలి కిరీటిరెడ్డి తండ్రి కర్ణాటక మాజీమంత్రి అని తెలుస్తోంది. వివాదాస్పద వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి దీని వెనుక ఉన్నారని సమాచారం. కొడుకు మొదటి సినిమా కాబట్టి దీనిని చాలా గ్రాండ్గా లాంచ్ చేయాలని ఆయన అనుకుంటున్నారట. అందులో భాగంగానే ఇంత ఖర్చు చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ జూనియర్ మూవీకి సీనియర్స్ రేంజిలో రెమ్యూనరేషన్ ముట్ట చెబుతున్నారు. మరి ఈ సినిమా గాలి కిరీటి రెడ్డికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. “లెట్స్ లివ్ దిస్ మూమెంట్.. లెట్స్ లవ్ దిస్ మూమెంట్” అంటూ ఈ పాటను బెంగళూరులో ఈవెంట్ నిర్వహించి మరీ రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జస్ప్రీత్ జాజ్ పాడారు. విజయ్ పొలాకి డాన్స్ కొరియోగ్రఫీ అందించారు.