BigTV English

AP Liquor Scam: వైసీపీ వీఐపీలకు స్పెషల్ జైలు అక్కడే

AP Liquor Scam: వైసీపీ వీఐపీలకు స్పెషల్ జైలు అక్కడే

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో అరెస్టుల పర్వం హాట్‌టాపిక్‌గా మారింది. గత ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత … రాష్ట్ర ప్రగతి, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడం, పెట్టుబడులపైనే దృష్టి సారించింది. రాజకీయ కార్యక్రమాలు పెద్దగా చేపట్టలేదు.. ప్రభుత్వం ఏర్పడి ఏఢాది పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాలపై విచారణలు వేగవంతమయ్యాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పలువురు వీఐపీలు అరెస్ట్ అవుతున్నారు. నిందితులంతా బెజవాడ సబ్‌జైల్లో ఉండటంతో వారితో ములాఖత్‌లకు వస్తున్న వారితో జైలు లోపలా, బయటా వైసీపీ నేతల హాడావుడే కనిపిస్తూ.. వైసీపీ స్పెషల్ జైలు అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ చర్చనీయాంశంగా మారాయి.


రెడ్‌బుక్‌లో ఉన్న ఎవర్నీ వదిలిపెట్టబోమన్న లోకేష్

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రకటించారు. నారా లోకేష్ అయితే రెడ్‌బుక్‌లో ఉన్న ఎవరినీ వదిలి పెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారిస్తూ, సంక్షేమ పథకాలు, అభివృద్దిపై ఫోకస్ పెట్టడానికే టైమ్ అంతా సరిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుండటంతో గత కొంత కాలంగా ఆయా విచారణలు, అరెస్టుల్లో వేగం పెరిగింది


చట్ట ప్రకారం విచారణలు జరిపి అరెస్టులు

కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించకుండా చేసిన తప్పులు, నేరాలపై చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణలు జరిపి కోర్టుల ద్వారానే శిక్ష పడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ తెలుగుదేశం, జనసేన శ్రేణులు గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయి, తాము చట్టాలకు అతీతులమన్నట్లుగా వ్యవహరించిన వారిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఒక దశలో ప్రభుత్వం గత పాలనలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమార్జనకు పాల్పడిన వారి పట్ల మెతకగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్త మయ్యాయి. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎక్కడా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చట్ట ప్రకారమే శిక్షలు, చర్యలు అంటూ చెప్తూ వచ్చారు.

పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలూ సేకరించి అరెస్ట్ చేస్తున్న యంత్రాంగం

కొంత కాలంగా ఆ దిశలో యాక్షన్ మొదలైంది. వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, ప్రభుత్వం అండ చూసుకుని చెలరేగిపోయిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అది కూడా ముందు నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్తున్నట్లు వారి నేరాలకు సంబంధించి పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలూ సేకరించిన తర్వాత కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, నిబంధనలకు తిలోదకాలిచ్చి చెలరేగిపోయిన అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కాంలు బయటపడుతున్నాయి.

విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు

ఈ నేపథ్యంలో పలు అరెస్టులు జరుగుతున్నాయి. అలా అరెస్టైన వారంతా ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అరెస్టైన వారిలో పలువురు వైసీపీ వీఐపీలు కూడా ఉండటంతో… నెటిజనులు వైసీపీ వీఐపీలకు విజయవాడ జైలు అడ్డాగా మారిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. అరెస్టైన వారిని ములాఖత్ ద్వారా కలవడానికి వైసీపీ నేతలు క్యూ కడుతుండటంతో బెజవాడ జిల్లా జైలు లోపలా, బయటా వైసీపీ వారి హడావుడే కనిపిస్తోందంటున్నారు

3 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ మూడు నెలలుగా విజయవాడ జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులు రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్, మాజీ సీఎం జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, భారతీ సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించే గోవిందప్ప బాలాజీ కూడా విజయవాడ ఆ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య కూడా ఆ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

Also Read: నంబాల కేశవరావు హతం.. అమిత్ షా పొగడ్తలు

ఇంత మంది వైసీసీలో కీలకంగా వ్యవహరించిన వారు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండటం, వారిని కలిసేందుకు ములాఖత్ ల కోసం మరింత మంది క్యూ కడుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×