AP Govt: పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2025 అకడమిక్ క్యాలెండర్‌లో నో బ్యాగ్ డేను చేర్చింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త. ఈ లెక్కన ఏడాదిలో కేవలం 233 రోజులు మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. ఏ ఒక్కరూ విమర్శించే అవకాశం ఇవ్వకుండా అడుగులు వేస్తోంది. తాజాగా పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్య సంవత్సరం అకడమిక్ కేలండర్‌లో ‘నో బ్యాగ్ డే’ను చేర్చించింది. దీని ప్రకారం పాఠశాలలు కేవలం 233 రోజులు పని చేస్తాయి.
ప్రతి శనివారం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నో బ్యాగ్ డే అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వీకెంట్ మిగతా యాక్టివిటీస్ చేయడానికి విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడతాయి. ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఉంటాయి.
ఇక సంక్రాంతి సెలవులు దాదాపు వారం రోజులు ఉండనున్నాయి. జనవరి 10 నుంచి 18 వరకు ఇవ్వనుంది విద్యాశాఖ. క్రిస్మస్ సెలవులు డిసెంబరు 21 నుంచి 28 వరకు అంటే దాదాపు వారం రోజులు ఇవ్వనుంది.
ALSO READ: ఇప్పటికే మీకు రేషన్ కార్డు ఉందా? ఇవి తెలుసుకోండి?
వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మిత్ర కిట్‌లను అందించనుంది.
గతంలో మాదిరిగా విమర్శలకు తావు లేకుండా ఈ కిట్లలో రాజకీయ నాయకుల బొమ్మలు ఉండవు. వస్తువులపై ప్రత్యేక గుర్తింపు నెంబరు ఉంటుంది. కిట్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పాఠశాలలు తిరిగి తెరిచిన రోజు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను అందజేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
విద్యార్థులకు ఇచ్చే మిత్ర కిట్‌లో బ్యాగులు, బూట్లు, బెల్టులపై ప్రత్యేక గుర్తింపు నెంబరు ఉంటుంది. దీనివల్ల వీటిని ఏ కాంట్రాక్ట్ సంస్థ సరఫరా చేసింది, అలాగే అది ఏ జోన్‌కు చెందినది అనే వివరాలు ఉంటాయి. బ్యాగ్, బూట్లు, బెల్టుల్లో నాణ్యత లేకపోయినా వాటిని దుర్వినియోగం చేసినా గుర్తించవచ్చు.
ఆయా వస్తువులపై లోగోతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని ముద్రించారు. ప్రస్తుతం కిట్‌లోని వస్తువులను జిల్లాలకు తరలించారు. మొత్తానికి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే రోజు విద్యార్థులకు ఆయా కిట్ అందుతాయి.