BigTV English

India Target On POK: ఉగ్రవాదమంతా అక్కడి నుంచే.. టైమ్ వచ్చేసింది.. ఇక దబిడిదిబిడే!

India Target On POK: ఉగ్రవాదమంతా అక్కడి నుంచే.. టైమ్ వచ్చేసింది.. ఇక దబిడిదిబిడే!

లెక్కకు లెక్క..
దెబ్బకు దెబ్బ..
పకడ్బందీ పంజా..
ఇదే అజెండా..

ఇంట్లోకి చొరబడి చంపడం కాదు.. దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. ఇదీ అసలు మ్యాటర్. ఇన్నాళ్లు చెప్పింది చాలు.. చూసింది చాలు.. ఉగ్రవాదం అంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే నడుస్తోంది. అది భారత్ నే ఎదురిస్తోంది. ఇంకెన్నాళ్లు ఇలా చూసి వదిలేయడం. ఇప్పుడు పహల్గాంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగొద్దు. అందుకే ఈసారి ఇంట్లోకి చొరబడి చంపడం కాదు.. ఇంట్లోకి చొరబడి అక్కడే ఉండాలి. ఇదే లైన్ ను చాలా మంది వినిపిస్తున్నారు. ప్రస్తుతం POKలో లాంఛ్ పాడ్స్ ను ఖాళీ చేస్తున్నారు. అలాంటప్పుడు స్వాధీనం చేసుకోవడం ఇంకింత ఈజీనే.


PoK స్వాధీనానికి ఇప్పుడే సరైన సమయం

ఈసారి టెర్రరిస్టులకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. ఒక్క టెర్రరిస్ట్‎ను కూడా వదిలిపెట్టం వెంటాడుతాం.. వేటాడుతామని గట్టిగానే వార్నింగ్స్ ఇస్తున్నారు. మరి ఈసారి జరగబోయేదేంటన్నదే ఇప్పుడు అందరిలో వస్తున్న డౌట్. ఎందుకంటే సమస్యంతా పీవోకే నుంచే ఎదురవుతోంది. అక్కడ ఉగ్రవాదులకు ట్రైనింగ్, ఆయుధాల సప్లై, ఆర్థిక సహకారం ఇవన్నీ పాక్ నుంచి వస్తుండడంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇవేవీ లేకపోతే అక్కడెందుకు ఉంటారన్నది మెయిన్ క్వశ్చన్.

PoK భారత్ లో భాగమే అని పార్లమెంట్ తీర్మానం

నిజానికి POK స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో POKలో ఉంటున్న జనం కూడా తమను భారత్ లో కలపాలని చాలా సందర్భాల్లో నిరసనలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చింది. నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఎవరు అడ్డొచ్చినా.. తొక్కుకుంటూ వెళ్లడమే మిగిలింది. నిజానికి PoK భారత్‌లో అంతర్భాగమని దాన్ని స్వాధీనం చేసుకోవాలని దేశంలోని అన్ని పార్టీలు అంటున్నాయి. 1994లో మనదేశ పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం కూడా PoK భారత్‌లో భాగమని స్పష్టం చేస్తోంది. అందుకే ఇంకా ఎందుకు ఆలస్యం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

గిల్గిట్-బాల్టిస్తాన్ జనంలో పాక్ పై అసంతృప్తి

PoKలో ముఖ్యంగా గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, ఇంధనం, ధరల పెరుగుదల ఇవన్నీ సమస్యలున్నాయి. అటు జమ్మూకశ్మీర్ లో మాత్రం అభివృద్ధి పెరగడం, కేంద్ర సహకారం, టూరిజం పెరగడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ చూసిన POK జనం భారత్ లో కలిసేందుకు సిద్ధమన్న సంకేతాలు చాలా సార్లు పంపారు. అందుకే ఈ ప్రాంతాన్ని మనం బలవంతంగా కలపడం కాదు.. ఆ ప్రక్రియ ఆటోమేటిక్ గా జరిగిపోతుందని రాజ్ నాథ్, యోగి ఆదిత్యనాథ్ సహా చాలా మంది నేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అంతర్జాతీయ సంక్లిష్టతలున్నా ముందుకే..

పీవోకేపై భారత్ ఇప్పటికే చాలా వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ వచ్చింది. ఇంతకు ముందు అంతర్జాతీయ వేదికలపై విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా క్లియర్ గా మాట్లాడారు. పీఓకే అలా ఉండిపోవడానికి కారణాలు ఏయే దేశాలో కూడా చెప్పేశారు. ఇకపై కథ మార్చేస్తామన్నారు. అది ముమ్మాటికీ భారత్ అంతర్భాగమే అని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు చెప్పేదేం లేదు. స్వాధీనం చేసుకోవడమే మిగిలింది.

అంతర్జాతీయ సంక్లిష్టతలున్నా ముందుకే..

పాకిస్తాన్, చైనా PoKపై తమ పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది భారత్‌కు సవాల్ గా ఉంది. అయితే PoKను భారత్‌లో కలపడం సులభమైన విషయం కాదని, ఇది సైనిక, రాజకీయ, అంతర్జాతీయ సంక్లిష్టతలు ఉన్నాయని అంటున్నా.. అవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు పని జరగదు. అంతిమంగా పీఓకేలో ఉగ్రవాద లాంచ్ పాడ్స్ తో భారత్ కే నష్టం కలుగుతోంది. చైనా మధ్యలో కలుగజేసుకున్నా సరే.. కథ మార్చాల్సిందే. పీవోకేను పోషించే స్థితిలో పాకిస్తాన్ లేదు. అదే సమయంలో అక్కడి జనం కూడా తమను భారత్ లో కలపాలనుకుంటున్నారు. అటు భారత్ దౌత్యవ్యూహం కూడా పని చేస్తే విలీనం చేసుకోవడం సులభమే.

పీఓకేలో ఉగ్రవాద లాంచ్ పాడ్స్ తో భారత్ కు నష్టం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని భారత నిఘా వర్గాలు, భద్రతా బలగాలు ఐడెంటిఫై చేశాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ట్రైనింగ్ క్యాంప్స్, లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, భారత భద్రతా బలగాలు PoKలో దాదాపు 42 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ను గుర్తించాయి. ఇక్కడ 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఉన్నారని అంచనా. వీరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సపోర్ట్ ఇస్తూ వెపన్స్ సప్లై చేస్తూ, ఆర్థికంగా సహాయం చేస్తోంది. ఈ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడుతున్నారు. సుమారు 60-65 పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ, రజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో అలాగే 70 మంది దాకా కాశ్మీర్ వ్యాలీలోకి చొరబడ్డట్లు అంచనాలు ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ సెట్ అవ్వాలంటే పీఓకేపై సీరియస్ ఫోకస్ పెట్టాల్సిందే.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎందుకంత కీలకంగా మారింది?

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎందుకంత కీలకంగా మారింది? ఇక్కడ ఉగ్రవాద క్యాంపులు తప్ప ఏముంది? దీన్ని స్వాధీనం చేసుకుంటే భారత్ కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఒకవేళ ఇంకా స్వాధీనం చేసుకోకుండా నాన్చితే ఎలాంటి ముప్పు కలుగుతుంది? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. నిజానికి POK అద్భుతమైన ప్రాంతమా? అక్కడున్న వనరులు ఏంటి? ఏం చేస్తే స్వాధీనం అవుతుందన్న విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం.

సహజ సౌందర్యం..
అతి సుందర ప్రాంతం..
కారాకోరం శ్రేణులు..
విలువైన ఖనిజాలు..
హిమానీ నదాలు..
లోయలు, జలపాతాలు..

ఒక్కటేమిటి ఎన్నెన్నో అందాలు PoK సొంతం. మనం ఇప్పటిదాకా పహల్గామ్, గుల్ మార్గ్, సోన్ మార్గ్ అందాలకే ఫిదా అవుతుంటాం. కానీ పీఓకే అంతకు మించి. సరస్సులు, జలపాతాలు, ట్రెక్కింగ్, స్కీయింగ్, క్యాంపింగ్ ఇలా సాహసయాత్రలకు పర్ ఫెక్ట్ ప్లేస్ ఇది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కాయిన్ కు రెండోవైపు మాత్రం నెత్తురు పారించే ఉగ్రమూకలు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, ఆకలి దప్పులు, సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఇలాంటివెన్నో కనిపిస్తాయి. POK రెండు భాగాలుగా ఉంటుంది. మీర్పూర్-ముజఫరాబాద్ ఆధిపత్యంలో ఒక భాగం, గిల్గిత్-బాల్టిస్తాన్ మరో భాగం.

PoK భారత్ లో విలీనమైతే చాలా బెనిఫిట్స్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైతే మనకు రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక, సామాజికంగా బెనిఫిట్స్ ఉంటాయి. పీఓకే నుంచే పహల్గామ్ ఎటాక్, 2019లో పుల్వామా ఎటాక్, 2016లో ఉరి ఎటాక్స్ జరిగాయి. TRF, PAFF వంటి ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రేరేపిస్తూ నియమించుకుంటున్నాయి. వీటిని అంతర్గత కల్లోలంగా చూపే ప్రయత్నాలను ISI చేస్తోంది. నిధులు, ఎటాక్ ప్లాన్స్ ఇస్తున్నాయి. ఒకవేళ పీఓకేను ఇలాగే వదిలేస్తే ఉగ్రవాదాన్ని అక్కడి నుంచే పాకిస్తాన్ ఎగదోసే ఛాన్స్ ఉంది. వీటికి తోడు డ్రగ్స్, నకిలీ కరెన్సీ ముప్పు కూడా పొంచి ఉంటుంది.

పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లకు చెక్

సో పీఓకే విలీనమైతే భౌగోళిక సమగ్రత భారత్ కు సాధ్యమవుతుంది. కశ్మీర్ వివాదానికి అంతర్జాతీయంగా పుల్ స్టాప్ పెట్టేందుకు వీలు కలుగుతుంది. ఇది భారత్ సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేస్తుంది. POK భారత్ లో విలీనమైతే భారతీయుల్లో ఐక్యతను మరింత పెంచుతుంది. PoK భారత్ కంట్రోల్ లోకి వస్తే, పాకిస్తాన్, చైనాతో ఉన్న సరిహద్దు వ్యవహారాలు మరింత పకడ్బందీగా చేయొచ్చు. గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ఎందుకంటే అవి భారత్, పాకిస్తాన్, చైనా, అఫ్గనిస్తాన్‌లతో సరిహద్దులను కలిగి ఉంది.

గిల్గిట్-బాల్టిస్తాన్‌లో బంగారం, రాగి, రత్నాలు

PoK భారత్‌లో కలిస్తే, భారత సైన్యానికి సరిహద్దు రక్షణ, గస్తీకి ఈజీ అవుతుంది. పాక్ నుంచి నేరుగా ఉగ్రవాదుల చొరబాట్లను తగ్గిస్తుంది. PoKలోని కారాకోరం రోడ్లు, ఇతర వ్యూహాత్మక రూట్లు భారత్ నియంత్రణలోకి వస్తే, మధ్య ఆసియాతో వాణిజ్యం, రక్షణ సహకారానికి కొత్త అవకాశాలు కలుగుతాయి. PoKలో ముఖ్యంగా గిల్గిట్-బాల్టిస్తాన్ లో నీటి వనరులు, ఖనిజాలు, జలవిద్యుత్ సామర్థ్యంతో సమృద్ధిగా ఉంది. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో బంగారం, రాగి, మేలిమి రత్నాలు వంటి ఖనిజ వనరులున్నాయి. పర్యాటక పరంగానూ ఇక్కడ అద్భుతమైన పర్వత శ్రేణులు, హిమాలయ శిఖరాలు ఉన్నాయి. అటు జమ్మూ కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలైన రోడ్లు, రైల్వే ట్రాక్స్, పరిశ్రమలు వంటివి పీఓకేదాకా విస్తరిస్తారు. దీంతో వారికి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

జాతీయ సమగ్రత, వ్యూహాత్మక భద్రతకు ప్లస్

PoK భారత్‌లో కలిస్తే, పాకిస్తాన్ రాజకీయ, సైనిక బలం డౌన్ అవుతాయి. ఇది భారత్‌కు దీర్ఘకాలంలో బెనిఫిట్ కలిగిస్తుంది. అదే సమయంలో PoK భారత్‌లో కలిస్తే, జాతీయ సమగ్రత, వ్యూహాత్మక భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక మెరుగుదల వంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పటి మ్యాటర్ ఏంటంటే.. 2016 ఉరి ఎటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్‌ జరిగాయి. ఇవి PoKలోని ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి దాడులు చేసి టెర్రర్ క్యాంప్స్ ను ధ్వంసం చేయాలి.

డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్, AI- బేస్డ్ నిఘా

అక్కడితో ఆగిపోకుండా వాటిని స్వాధీన పరుచుకోవాలి. వాటి స్థానంలో ఆర్మీ బేస్ క్యాంపులు ఏర్పాటు కావాలి. కౌంటర్-ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్, AI- బేస్డ్ నిఘా వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా చొరబాట్లను అరికట్టవచ్చు. PoKలోని ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్‌లు, శాటిలైట్ ఇమేజెస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిరంతర నిఘాను బలోపేతం చేయాలి.

చైనా అడ్డొచ్చినా సైడ్ చేసే వ్యూహాలు కీలకం

పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచడానికి భారత్ ఐక్యరాష్ట్రసమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఇతర ప్లాట్ ఫామ్స్ ద్వారా పాక్ తీరును ఎండగట్టాలి. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని నిరూపించే ఆధారాలను అందించి ఆర్థిక ఆంక్షలను కంటిన్యూ చేయించడం ద్వారా ఆర్థికంగా కుప్పకూలేలా చేయొచ్చు. లష్కరే తొయిబా, TRF లాంటి ఉగ్రవాద సంస్థలను లీడ్ చేస్తున్న వారిని కచ్చితంగా గుర్తించి అంతమొందించాలి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకం పెరిగింది. 2024లో 35 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. ఇదే పీఓకే దాకా విస్తరించవచ్చు. అయితే పీఓకే స్వాధీనం చేసుకునే విషయంపై భారత్ కు చైనా అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే POKలో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఉంది. అయితే వీటన్నిటిని దౌత్యమార్గాల్లో కంప్లీట్ చేయాలి. అందరినీ సైడ్ చేయాలి. అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.

 

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×