OTT Movie : అర్జున్ అశోకన్ తాజా మలయాళ చిత్రం ‘బ్రోమాన్స్’ (Bromance) ప్రకటించిన దానికంటే ఒక రోజు ముందే డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
మూడు నెలల తరువాత ఓటీటీలోకి…
అరుణ్ డి. జోస్ దర్శకత్వం వహించిన మలయాళ కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రోమాన్స్’. మాథ్యూ థామస్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రస్తుతం సోనీలివ్ (Sonyliv) తో పాటు OTTplay ప్రీమియంలో ప్రసారం అవుతోంది. ‘బ్రోమాన్స్’ మూవీ ఇదే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను సోనీ లివ్ సొంతం చేసుకుంది.
‘బ్రోమాన్స్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు 3 నెలల తరువాత అంటే మే 1 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే ఏప్రిల్ 30 సాయంత్రం నుండే సోనీలివ్ తో పాటు ఈ మూవీ ఓటీటీ ప్లే ప్రీమియంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, 24 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. కామెడీ, యాక్షన్, ఫీల్-గుడ్ మూమెంట్స్ తో నిండిన ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఫ్రెండ్షిప్, బ్రోమాన్స్ వంటి సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.
కథలోకి వెళ్తే…
కథ బింటో వర్గీస్ (మాథ్యూ థామస్) చుట్టూ తిరుగుతుంది. ఈ అబ్బాయి సోషల్ మీడియా రీల్స్, మీమ్స్‌లో మునిగితేలే జెన్-జెడ్ యువకుడు. అతని అన్నయ్య షింటో (శ్యామ్ మోహన్) మంచి క్రమశిక్షణ ఉన్న స్టాక్ మార్కెట్ ట్రేడర్. ఫ్యామిలీతో పాటు సమాజంలోనూ ఆదర్శవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. బింటోను అతని అన్నయ్యతో పోలుస్తూ తిడుతుంటారు. దీంతో అతనికి అన్నపై ఈర్ష్య కలుగుతుంది.
Read Also : ఓటీటీలోకి పదేళ్ళ తర్వాత వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులో ఐశ్వర్య రాజేష్ మూవీ స్ట్రీమింగ్
ఇదిలా ఉండగా బింటో కూర్గ్‌లో న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంటాడు. అదే టైమ్ లో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది. షింటో కొచ్చిలో మిస్ అయ్యాడనేది ఆ కాల్ సారాంశం. ఇక్కడి నుంచి అడ్వెంచర్ మొదలవుతుంది. షింటోను కనిపెట్టడానికి బింటో షబీర్‌తో కలిసి కొచ్చికి వెళ్తాడు. షింటో ఒక పర్ఫెక్ట్ అబ్బాయిగా కనిపించినప్పటికీ, అతను అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. తన అన్నయ్యను అతని మాజీ ప్రియురాలు ఐశ్వర్య (మహిమా నంబియార్) “రెడ్ ఫ్లాగ్”గా భావిస్తుందని బింటో తెలుసుకుంటాడు. ఐశ్వర్య (డెంటిస్ట్, షింటో మాజీ ప్రియురాలు), హరిహరసుధన్ (సంగీత్ ప్రతాప్, ఒక ఎథికల్ హ్యాకర్), కొరియర్ బాబు (కలభవన్ షాజోన్, ఒక స్థానిక గుండా, లోన్ షార్క్) సహాయంతో వెతకడం మొదలు పెడతాడు. మరి హీరో తన అన్నయ్యను కనిపెట్టాడా? అసలు షింటో ఎక్కడికి వెళ్ళాడు? చివరికి ఏం జరిగింది అన్నది కథ.