భారత్‌పై వరుసగా ఉగ్రదాడులకు కుట్రలు
తీవ్రవాదుల వెనకున్న మాస్టర్‌మైండ్స్ ఎవరు?
ఇండియా హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులెవరు?
దాడులకు తెగబడేది ఉగ్రవాదులే కావొచ్చు. మారణహోమం సృష్టించేది.. బ్రెయిన్ వాష్‌కి గురైన తీవ్రవాదులే కావొచ్చు. కానీ.. వారిని అలా తయారుచేసే వాళ్లు వేరే ఉన్నారు. వెనకుండి నడిపించే మాస్టర్ మైండ్సే.. ఈ విధ్వంసానికి ప్లాన్ చేస్తాయి. అమాయకుల్ని టెర్రరిస్టులుగా మార్చి మానవబాంబుల్లా మన దేశంపైకి ప్రయోగిస్తాయ్. అలాంటి కొందరు నరరూప రాక్షసులే.. ఉగ్రవాదుల రూపంలో ఇండియా హిట్ లిస్టులో ఉన్నారు. ఎన్ఐఏ, కేంద్ర ప్రభుత్వం జాబితాలో.. తీవ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్లు, హత్యలతో భారతదేశ భద్రతకు విఘాతం కలిగించేలా కుట్రలకు పాల్పడుతున్నారు.
మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న మొదటి టెర్రరిస్ట్.. మసూద్ అజార్
అలా.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న వారిలో మొట్టమొదటి టెర్రరిస్ట్.. మౌలానా మసూద్ అజార్. ఇతను.. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. దాని ద్వారా మిలిటెంట్లను తయారుచేసి.. వారి చేత ఉగ్రదాడులు చేయిస్తూ ఉంటాడు. మసూద్ అజార్.. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ఇతని హస్తం ఉన్నట్లు తేలింది. అలాగే.. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రదాడి, 2019లో పుల్వామాలోజరిగిన దాడిలో ఇతని పాత్ర ఉంది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌లో జైషే మహ్మద్ సంస్థ ద్వారా అనేక తీవ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఇతను పాకిస్థాన్‌లోనే ఉన్నాడనే నిఘా వర్గాల సమాచారం ఉన్నా.. పాక్ మాత్రం దీనిని ఖండిస్తోంది.
హఫీజ్ మహమ్మద్ సయీద్ లష్కరే తోయిబై సహా వ్యవస్థాపకుడు
ఇక.. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, జమాద్ ఉద్ దావా ఉగ్ర సంస్థ స్థాపించిన హఫీజ్ మహమ్మద్ సయీద్ కూడా ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్నాడు. ఇతను.. 2000 సంవత్సరంలో ఎర్రకోటపి దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి, 2006లో ముంబై రైలులో బాంబు పేలుళ్లు, 2008లో ముంబై బాంబ్ బ్లాస్ట్స్, 2015లో ఉదంపూర్ బీఎస్ఎఫ్ కాన్వాయ్ దాడికి.. ఇతనే సూత్రధారి. వీడు కూడా ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. ఐఎస్ఐతో కూడా సంబంధాలున్నాయని చెబుతుంటారు. అప్పుడప్పుడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉంటాడు.
జకీ-ఉర్-రెహమాన్.. 2008 ముంబై దాడుల్లో కీలక పాత్ర
ఐక్యరాజ్యసమితే ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. హిట్ లిస్టులో ఉన్న మరో టెర్రరిస్ట్.. జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీ. ఇతను.. లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్‌గా ఉన్నాడు. 2008 ముంబై దాడుల్లో ఇతను కీలకపాత్ర పోషించాడనే ఆరోపణలున్నాయి. ఆ దాడుల్లో.. హఫీజ్ సయీద్‌తో కలిసి ఉగ్రదాడికి ప్రణాళికలు రూపొందించాడనే సమాచారం ఉంది. అంతకుముందు.. 2008లో రాంపూర్ సీఆర్ఫీఎఫ్ క్యాంపుపై దాడి, 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడుల్లోనూ ఇతని పాత్ర ఉందంటారు. ఉగ్రవాదుల్ని రిక్రూట్‌మెంట్ చేసుకోవడం, వారికి శిక్షణ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. వీడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
మోస్ట్ వాంటెడ్ లిస్టులో దావూద్ ఇబ్రహీం
భారత దర్యాప్తు సంస్థల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న మరో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం. డీ-కంపెనీ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లు, 2008 ముంబై దాడుల్లో ఇతని పాత్ర ఉందంటారు. ఇక.. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ రాకెట్‌ని నడుపుతాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలతో దావూద్‌కు లింక్స్ ఉన్నాయి. ప్రస్తుతం.. పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా.. ఐఎస్ఐ రక్షణలో ఉన్నాడనే ఆరోపణలున్నాయి. అంతేకాదు.. ఉగ్ర సంస్థ అల్-ఖైదాతో సంబంధాలున్నాయి.
2008 ముంబై దాడుల్లో.. వీడిదే కీలకపాత్ర.
అమెరికా ఎఫ్‌బీఐతో పాటు ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులోనూ దావూద్ ఉన్నాడు. ఇక.. లష్కరే తోయిబా కమాండర్‌గా ఉన్న సాజిద్ మీర్ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. 2008 ముంబై దాడుల్లో.. వీడిదే కీలకపాత్ర. ఆ దాడులకు ముందు ఇండియాలో రహస్య సర్వేలు చేశాడు. భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తుంటాడు. 2005లో క్రికెట్ అభిమానిగా ఇండియాలోకి ప్రవేశించి.. రహస్య సర్వేలు చేశాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎస్ఐకి చెందిన సేఫ్ హౌజ్‌లో ఉన్నట్లు సమాచారం.
హిట్ లిస్టులో ఉగ్రవాది యూసుఫ్ ముజామిల్
భారత్‌పై ఉగ్ర కుట్రలకు పాల్పడటం, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించడంలో కీలకంగా ఉన్న మరో ఉగ్రవాది యూసుఫ్ ముజామిల్. 2008 ముంబై ఉగ్రదాడుల్లోనూ ఇతని పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఇండియా హిట్ లిస్టులో ఉన్న మరో టెర్రరిస్ట్.. ఫర్హతుల్లా ఘోరి. అలియాస్.. అబూ సుఫియాన్. 2002 అక్షరధామ్ దాడి, 2005 హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌పై ఆత్మాహుతి దాడితో పాటు భారత్‌లో రైల్వే నెట్‌వర్క్‌పై దాడులకు పిలుపునిచ్చిన ఆరోపణలున్నాయి. ప్రస్తుతం.. పాకిస్థాన్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.
2021 లో భారత్ పార్లమెంట్‌పై దాడి
మిలిటెంట్ల రిక్రూట్‌మెంట్, ఫైనాన్సింగ్‌లో పాల్గొంటున్నాడనే సమాచారం ఉంది. 2018లో.. ఫర్హతుల్లా ఘోరిని.. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇక.. అబ్దుల్ రవూఫ్ అస్గర్ కూడా.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతను.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో సీనియర్ లీడర్‍గా ఉన్నాడు. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిలోనూ, 2016లో పఠాన్‌కోట్ ఎయిర్బేస్పై జరిగిన ఎటాక్‌లోని ఇతని హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.
హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సయీద్ సలాహుద్దీన్
హిజ్బుల్ ముజాహిదీన్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు చెందిన సయీద్ సలాహుద్దీన్ కూడా ఇండియా హిట్ లిస్టులో ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో ఇతను పాల్గొన్నాడు. పాకిస్థాన్ ఐఎస్ఐతోనూ ఇతనికి లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పాక్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేయాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాడు. ఇక.. అల్‌ఖైదా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు చెందిన.. ఇల్యాస్ కశ్మీరీ కూడా మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో ఉన్నాడు. 2008 ముంబై దాడుల్లోనూ, 2010 పుణె బేకరీ బాంబు బ్లాస్ట్, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లో బాంబు పేలుళ్లలో ఇతని హస్తం ఉంది.
హిట్ లిస్టులో చోటా షకీల్, వధావా సింగ్ బబ్బర్
అల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం.. ఎక్కడున్నాడనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. వీరితో పాటు డి కంపెనీకి చెందిన చోటా షకీల్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వధావా సింగ్ బబ్బర్ కూడా ఇండియా హిట్ లిస్టులో ఉన్నారు. వీళ్లంతా.. భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తూ.. విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా హిట్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులంతా.. చాలా వరకు పాకిస్థాన్‌లోనే ఉన్నారనే సమాచారం ఉంది. వాళ్లందరికీ.. ఐఎస్ఐ రక్షణ కల్పిస్తోందనే ఆరోపణలున్నాయి.
ఈ ఉగ్రవాదులందరినీ హతమారిస్తే.. భారత్ ప్రశాంతంగా ఉంటుందా..?
భారత దర్యాప్తు సంస్థల హిట్ లిస్టులో ఉన్న ఈ ఉగ్రవాదులంతా.. మన దేశంలో వీలు చిక్కినప్పుడల్లా విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ.. మారణహోమం సృష్టిస్తున్నారు. ఇప్పుడు పహల్గామ్‌లో జరిగిన ఎటాక్ వెనుక కూడా లష్కరే తోయిబా హస్తం ఉంది. అందువల్ల.. ఈ ఉగ్రవాదులందరినీ హతమారిస్తే.. భారత్ ప్రశాంతంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. కానీ.. అది ఇప్పట్లో సాధ్యమేనా?
విధ్వంసం సృష్టించాలనే మూర్ఖపు ఆలోచనలు
ఉగ్రవాదం అంటే కేవలం ఆయుధాలు, కాల్పులకు తెగబడటం మాత్రమే కాదు. విధ్వంసం సృష్టించాలనే మూర్ఖపు ఆలోచనలు కూడా. కాల్చేవాడు ఒకడైతే.. వాడి చేతుల్లో తుపాకీ పెట్టి.. నరమేధం సృష్టించేలా చేసేవాడే మరొకడు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే.. తుపాకీ పట్టినోడితో పాటు వాడికి ట్రైనింగ్ ఇచ్చి ఉసిగొల్పినోడిని కూడా హతమార్చాల్సి ఉంటుంది. నాయకుడు లేని సేన చెల్లాచెదురైనట్లు.. మాస్టర్ మైండ్ లేని ఉగ్రసంస్థలు బలహీనమైపోతాయి.
నిధులు, ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్
అవి కోలుకోవచ్చు. పూర్తిగా.. కోలుకోకపోవచ్చు కూడా. మసూద్ అజార్, హఫీజ్ సయీద్, దావుద్ ఇబ్రహీం లాంటోళ్లు.. తీవ్రవాద సంస్థలకు నాయకత్వ వహించడం, ఆర్థికసాయం చేయడం, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడం లాంటివి చేస్తుంటారు. వీరిని హతమార్చడం వల్ల.. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, డి-కంపెనీ లాంటి సంస్థలను బలహీనపరిచే అవకాశం ఉంది. వాళ్లే గనక లేకపోతే.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్ లాంటివన్నీ ఆగిపోతాయ్. ఉగ్రవాద సంస్థల్లో భయంతో పాటు అస్థిరత పెరుగుతుంది.
పూర్తిగా ఉగ్ర సంస్థ మూలాలను పెరిలించే ఛాన్స్
అయితే.. ఒక టెర్రరిస్ట్ నాయకుడిని హతమారిస్తే.. అతని స్థానంలో మరొకరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ చాన్స్ లేకుండా అందరినీ మట్టుబెడితే.. పూర్తిగా ఉగ్ర సంస్థ మూలాలను పెకిలించొచ్చు. ఉగ్రవాదం లోతైన రాజకీయ, సామాజిక, ఆర్థిక, భావజాల సమస్యలతో ముడిపడి ఉంది. వీటన్నింటిని ఆధారంగా చేసుకొని.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులంతా.. మిలిటెంట్లకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వారి మెదళ్లలో మతోన్మాదాన్ని నింపుతున్నారు. మతం పేరుతో ఉసిగొల్పుతున్నారు. ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని విస్తరిస్తూ.. రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతున్నాయి.
యువతకు గాలం వేసి మిలిటెంట్లుగా మారుస్తున్న వైనం
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ లాంటి సంస్థలు కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తుండటంతో.. ఉగ్రవాద సంస్థలు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. జమ్ముకశ్మీర్‌లో రాజకీయ అస్థిరత, మతపరమైన రాడికలైజేషన్, యువతలో నెలకొన్న అసంతృప్తి లాంటి అంశాలు.. అక్కడి యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాయనే చర్చ కూడా ఉంది. ఈ టాప్ మోస్ట్ టెర్రరిస్టులంతా.. అసంతృప్తితో రగిలిపోయే యువతకు గాలం వేసి.. వారిని మిలిటెంట్లుగా మారుస్తున్నారు. అందువల్ల.. వాళ్లను అంతమొందిస్తే.. ఆ ఉగ్రసంస్థల కార్యకలాపాలు తగ్గిపోతాయనే చర్చ సాగుతోంది.
బలమైన ఇంటిలిజెన్స్, సరిహద్దు భద్రత
అయితే.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే.. ఉగ్రవాదులను హతమార్చడం ఒక్కటే కాదు.. బలమైన ఇంటలిజెన్స్, సరిహద్దు భద్రత, భద్రతా దళాల సామర్థ్యాన్ని కూడా పెంచాల్సి ఉంటుంది. టెర్రరిజానికి లింక్ అయి ఉన్న ఆర్థిక కార్యకలాపాలను తెంచడం, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, పాకిస్థాన్ లాంటి దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా కొంతమేర ఫలితం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. మతపరమైన రాడికలైజేషన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి.
మోస్ట్ వాంటెడ్ లిస్టులోని ఉగ్రవాదుల్ని హతమారిస్తేనే ఫలితం
ఆన్‌లైన్ రాడికలైజేషన్, ఉగ్రవాద సందేశాలను నిరోధించేందుకు సైబర్ సెక్యూరిటీని కూడా పెంచాల్సి ఉంటుంది. వీటన్నింటికంటే ముందు.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాదుల్ని హతమార్చడం వల్ల ఉగ్రదాడులు తగ్గిపోతాయి. భారత్ కూడా ప్రశాంతంగా మారుతుంది. భద్రతా చర్యలు, సామాజిక-ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ ఒత్తిడి, రాడికలైజేషన్ నిరోధక కార్యక్రమాలన్నీ.. ఉగ్రవాదాన్ని తగ్గిస్తాయి.