BigTV English

Brahmamudi Serial Today April 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య బెడ్‌రూంలోకి వెల్లిన రాజ్‌ – హాల్లోకి వచ్చిన రుద్రాణి

Brahmamudi Serial Today April 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్య బెడ్‌రూంలోకి వెల్లిన రాజ్‌ – హాల్లోకి వచ్చిన రుద్రాణి

Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన రాజ్‌ను కావ్య ఎలా రాగలిగారు అని అడుగుతుంది. అదేంటో నా చేతులు స్టీరింగ్‌ను తిప్పుతూనే ఉన్నాయి. దారి ముందే గుర్తొస్తుంది. అలా డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చేసరికి ఇదిగో ఇలా మీ ఇంటి ముందు వచ్చి ఆగాయి అని రాజ్‌ చెప్పగానే అదెలా సాధ్యం అంటుంది కావ్య. దీంతో రాజ్‌ నేను చెప్పాను కదండి ఇంతకముందు నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందని. ఈ ఇంటిని చూశాక నాకదే సేమ్‌ ఫీలింగ్‌ వచ్చిందండి. ఇంతకముందు ఈ ఇంటికి  నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపించింది. బహుశా అందుకేనేమో నా సిక్త్‌ సెన్స్‌ నన్నుఇక్కడకు తీసుకొచ్చింది. అయినా మీరేంటండి ఇంటికి వచ్చిన గెస్ట్ ను ఇలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడుతున్నారు అంటాడు రాజ్‌.


దీంతో కావ్య రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. రాజ్‌.. కావ్య కోసం గిఫ్ట్‌ ఇస్తాడు. ఓ ఇది ఇవ్వడానికే వచ్చారా..? ఇచ్చి వెళ్లిపోతారా..? అని కావ్య అనగానే ఏంటండి ఇంటికి వచ్చిన గెస్ట్‌ కు కనీసం కాఫీ అయినా ఇవ్వరా..? అని రాజ్‌  అడగ్గానే.. పాలు లేవండి.. అంటుంది. అయితే జ్యూస్‌ అయినా ఇస్తారా..? అనగానే కావ్య ఆలోచిస్తుంది. కనీసం మంచినీళ్లైనా ఇవ్వండి అని అడుగుతాడు. దీంతో కావ్య జ్యూస్‌ కావాలంట అని గట్టిగా అరుస్తుంది. దీంతో రూంలో ఉన్న అపర్ణ అయ్యో జ్యూస్‌ అడుగుతున్నాడంటే భోజనం కూడా ఇక్కడే చేస్తాడేమో అని కంగారు పడుతుంది. పైన రూంలో ఉన్న రుద్రాణి వాళ్లు కూడా మళ్లీ జ్యూస్‌ అని అడుగుతుందేంటి అని అప్పును అడుగుతారు.

దీంతో అప్పు అదేం లేదు మనకు ఏమైనా జ్యూస్ కావాలా..? అని అడుగుతుంది అని ఇందాకా మీకు ఎంత వరకు చెప్పాను అంటుంది అప్పు. రుద్రాణి కోసం అప్పును తిడుతుంది. రాహుల్‌ మాకు తెలిసిందే చెప్తూ మమ్మల్ని ఇరిటేట్‌ చేస్తున్నావా..? అంటాడు. స్వప్న కూడా ఏంటి అప్పు అంతా ఏదేదో మాట్లాడుతున్నావు నేను పాప దగ్గరకు వెళ్తాను అంటుంది. అయ్యో ఉండు అక్కా మొత్తం వినకుండా వెళ్తావా..? అంటూ స్వప్నను అప్పు ఆపేస్తుంది. కింద అపర్ణ రూంలో ఉన్న ఇందిరాదేవి నాకు ఇక్కడ ఉక్కపోస్తుంది. హాల్లోకి వెళ్దాం పద అంటుంది. వద్దని అపర్ణ ఆపేస్తుంది. బయట హాల్లో ఉన్న కావ్య రాజ్‌ను మీరు ఒక్కరే హాల్లో ఉంటే బోరు వస్తుంది కదా నాతో కిచెన్‌ లోకి రండి అని పిలుస్తుంది. సరే అంటూ రాజ్‌, కావ్యతో పాటు కిచెన్‌ లోకి వెళ్తాడు. పైన అప్పు, కింద అపర్ణ అందరినీ మేనేజ్‌ చేస్తుంటారు.


జ్యూస్‌ చేస్తున్న కావ్యను మీరు ఎక్కడికైనా వెళ్లేది ఉందా అండి అని అడుగుతాడు. దీంతో కావ్య అబ్బే అదేం లేదే.. ఎందుకు అలా అడిగారు అంటుంది. ఏం లేదు మీరు కంగారు పడుతున్నారు కదా అందుకే అడిగాను అంటాడు రాజ్‌. దీంతో కావ్య మీరు వచ్చారు కదా అందుకే ఇంత కంగారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్‌ అవును ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు అని అడగ్గానే.. ఉన్నారంటే అందరినీ పరిచయం చేయమంటాడేమో.. అని మనసులో అనుకుని గుడికి వెళ్లారు వాళ్లు రావడానికి గంట పడుతుంది అని చెప్తుంది. దీంతో రాజ్‌ అయితే మనం గంట సేపు మాట్లాడుకోవచ్చు అంటాడు. కావ్య కంగారు పడుతుంది.

ఇంతలో కావ్య జ్యూస్‌ చేసి ఇస్తుంది. జ్యూస్‌ తాగుతూ.. అయ్యో నేను ఒక్కడినే తాగుతే బాగుండదేమో అంటూ ఇంకో గ్లాస్ తీసి కావ్యకు తన గ్లాస్ లో ఉన్న జ్యూస్‌ షేర్‌ చేస్తాడు. ఇద్దరూ జ్యూస్‌ తాగుతుంటే పైనుంచి ప్రకాష్‌ వస్తాడు. ప్రకాష్‌ను చూసి కావ్య కంగారు పడుతుంది. పక్కనే ఉన్న స్పూన్లు కింద పడేస్తుంది. రాజ్‌ కిందకు వంగి స్పూన్లు తీస్తుంటే కావ్య ప్రకాష్‌ కు సైగ చేసి అందరూ అపర్ణ రూంలో ఉన్నారని చెప్తుంది. ప్రకాష్‌ రూంలోకి వెల్లిపోతాడు.  తర్వాత కావ్య రాజ్‌ను తన రూంలోకి తీసుకెళ్తుంది.  రాజ్‌ బాత్రూంలోకి వెళ్లగానే డోర్‌ తెరచి కింద ఎవరైనా వచ్చారేమోనని నక్కి నక్కి చూస్తుంది. వెనక నుంచి రాజ్‌ రావడంతో కావ్య భయపడుతుంది. రాజ్‌ ఎవరి కోసం చూస్తున్నారు అని అడుగుతాడు. కావ్య ఎవరైనా అంటూ చెప్తుంటే.. ఓ భయపెట్టానా..? అని అడగ్గానే.. కావ్య భయపడ్డాను అంటుంది.

దీంతో రాజ్‌ నేను ఇచ్చిన గిఫ్ట్‌ ఎలా ఉందో చూసి చెప్పండి అంటాడు. కావ్య సరే అంటుంది. కింద అపర్ణ రూంలో పైన రుద్రాణి రూంలో అప్పు ఎవ్వరూ బయటకు రాకుండా మేనేజ్‌ చేస్తుంటారు. రూంలో రాజ్‌ తీసుకొచ్చిన శారీ చూసి కావ్య ఆశ్చర్యపోతుంది. శారీ చాలా బాగుంది అని చెప్తుంది. దీంతో రాజ్‌ నేను చెప్తే మీరు నమ్మడం లేదు కానీ మనిద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా మనిద్దరికీ ఇంతకుముందు పరిచయం ఉందా..? అని అడగ్గానే కావ్య మౌనంగా ఉంటుంది. దీంతో రాజ్‌ నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నా సొంత ఇంట్లోకి వచ్చినంతగా అనిపిస్తుంది. మీరేదో దాస్తున్నారు చెప్పండి అని రాజ్‌ అడగ్గానే.. కావ్య మా ఇంట్లో వాళ్లు వచ్చే టైం అయింది. మీరు వెళ్లండి అని రాజ్‌ను పంపించేస్తుంది.

రాజ్‌ బయటకు వెళ్లిపోగానే అందరూ హాల్లోకి వస్తారు. అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసిన అపర్ణ, అప్పు హమ్మయ్యా వెళ్లిపోయారా..? అనుకుంటారు. ఎవరు వెళ్లిపోయారు అని రుద్రాణి అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×