BigTV English

India Vs Pak War: నీచమైన వ్యవస్థ..! యుద్ధం వస్తే పాక్ ప్రజలను కాపాడేదెవరు..?

India Vs Pak War: నీచమైన వ్యవస్థ..! యుద్ధం వస్తే పాక్ ప్రజలను కాపాడేదెవరు..?

India Vs Pak War: భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే మీరు ఎవరి వైపు ఉంటారని.. మిమ్మల్సి ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? స్వతహాగా మీరు భారతీయులైతే కుల మతాలకు అతీతంగా భారత్ వైపే ఉంటామని అంటారు. అవునా కాదా? అదే పాకిస్థాన్ లో ఒక మసీదులో శుక్రవారం నాడు జరిగిన ఒక సమావేశంలో ఆ మతాధికారి అడిగిన ఇదే ప్రశ్నకు సమాధానం.. ఊహించడానికే భయానకం. ఇందుకు కారణాలేంటి? పాకిస్థాన్ ప్రజలు తమ దేశం వైపు ఎందుకు లేరు? ఆ దేశ ప్రజల
అది మే 2వ తారీఖు..
శుక్రవారం..
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని లాల్ మసీద్..
వివాదాస్పద మతాధికారి అబ్ధుల్ అజీజ్ ఘాజీ ఉన్నట్టుండి ఒక ప్రశ్నను సంధించారు.. అదేంటంటే..


అబ్ధుల్ అజీజ్ ఘాజీ అడిగిన ఈ ప్రశ్నకు తెలుగులో అర్ధం ఏంటంటే.. ఒక వేళ భారత్ తో యుద్ధం వస్తే పాకిస్థాన్ కు మీరు అండగా ఉంటారా? ఉంటే ఎందరుంటారో చేతులెత్తండి అంటే అక్కడి వారెవరిలోనూ కనిస స్పందన లేదు. ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు. దీన్ని బట్టీ చెప్పొచ్చు భారత్ తో యుద్దమంటే సాధారణ పాకిస్థానీయుల రియాక్షనేంటో? అని అంటారు మతాధికారి ఘాజీ.

దాడి జరిగింది ఏప్రిల్ 22న


పహెల్గాం దాడి జరిగింది ఏప్రిల్ 22న అయితే, ఈ మతాధికారి ఈ ప్రశ్న వేసింది మే 2న. సుమారు రెండు వారాల తర్వాత జరిగిందీ ఘటన. ఒక పక్క చూస్తే.. దాడి తర్వాతి పరిణామ క్రమాలు వేగంగా మారాయి. భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దౌత్యపరంగా ఎన్నో పరిణామక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఈ సభలో పాల్గొన్న విద్యార్ధులు ఇతర పాకిస్థానీయులకు తెలియంది కాదు. దాడి జరిగిన వెంటనే వేసిన ప్రశ్న కాదిది. ఒక నిర్ణయానికి రావడాఇకి తగిన సమయమే ఇది. మీరు మీ దేశానికి మద్ధతు ఇస్తారా- లేదా? అంటే వారి నుంచి మౌనమే సమాధానం అయ్యిందంటే అర్ధమేంటి? మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? లేక పాకిస్థాన్ కి మద్ధతివ్వడానికి తాము ఇష్టంగా లేదని వారన్నట్టు భావించాలా?

పాకిస్థాన్ లో ప్రస్తుతం అత్యంత నీచమైన వ్యవస్థ ఉందన్న మతాధికారి

అయితే ఈ మతాధికారి మాత్రం దీనికి తనదైన శైలిలో వివరణ జోడించారు. పాకిస్థాన్ లో ప్రస్తుతం అత్యంత నీచమైన వ్యవస్థ ఉందని.. ఇదొక పనికిరాని వ్యవస్థ అనీ.. ఇలాంటి వ్యవస్థ కలిగి ఉండటం అత్యంత దారుణమనీ ఆయన విమర్శించారు.

పాకిస్థాన్ సొంత పౌరులపైనే బాంబులు వేస్తోంది- మతాధికారి

పాకిస్థాన్ తన సొంత పౌరులపైనే బాంబులు వేస్తోందని చెప్పుకొచ్చారీ మతగురువు. బలూచిస్తాన్, ఖైబర్ పంక్తుంక్వాలో జరిగిన దారుణాల గురించి ప్రస్తావించారు. తన సొంత దేశస్తులపైనే బాంబులు వేయడం మాములు విషయం కాదంటారు ఘాజీ. ఆయనిలా వ్యాఖ్యానించడం ప్రస్తుతం పాకిస్థాన్ లో తీవ్ర చర్చనీయాంశం. అంతే కాదు దీనిపై తీవ్ర ప్రతిస్పందనలు వెల్లువెత్తుతున్నాయ్. అక్కడి స్థితిగతులకిది అద్దం పడుతోంది.

ఒకప్పుడు రాడికల్ పిలుపులకు వేదిగా లాల్ మసీదు

ఒకప్పుడు ఇలాంటి రాడికల్ పిలుపులకు వేదికగా ఉన్న లాల్ మసీదులో ఇలాంటి స్పందన అస్సలు ఊహించలేనిది. పాకిస్థాన్ ప్రజల నాడి ఏమిటో ఇట్టే తెలిసిపోయే వేదికల్లో ఇదీ ఒకటి. అలాంటి చోటు నుంచి భారత్ తో యుద్ధానికి సిద్ధమా? అంటే పాకిస్థానీయుల్లో కనీస స్పందన లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు.

భారత్ తో విబేధాలకు ప్రభుత్వం, సైన్యాలకు భిన్నంగా పాకిస్థానీయులు

భారతదేశంతో సైద్ధాంతిక విబేధాల విషయంలో.. పాకిస్థాన్ పౌర- సైనిక ప్రభుత్వాల ధోరణికి, సాధారణ ప్రజల అభిప్రాయాలకూ చాలానే తేడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇది పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో ఎంతటి చీలిక తెచ్చిందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

పైపెచ్చు నిరాశా నిస్పృహల్లో మునిగి తేలుతున్నారు

ఒక్క మాటలో చెప్పాలంటే, మూడ్ ఆఫ్ పాకిస్థాన్ కి సంబంధించిన వ్యవహారం. పాకిస్థాన్ వ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలకు భారత్ తో యుద్ధమనే అంశంలో ఎంత మాత్రం ఆసక్తి లేదు. మీరు మాకు సింధూ జలాలు ఇవ్వకుంటే మేము మీపై అణుబాంబులు విసురుతాం అనే రెచ్చగొట్టుడు వ్యాఖ్యలను వీరేమీ ఆస్వాదించడం లేదు. పైపెచ్చు ఇలాంటి దౌత్య పరమైన సంబంధాలను కోల్పోవాలని వారేమీ కోరుకోవడం లేదని అంటారు పాక్ వ్యవహారాల నిపుణులు. జమ్మూ- కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి ఏ క్షణంలోనే భారత్ సైనిక దాడి చేయవచ్చన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు వారేమీ ఊగిపోవడం లేదు. పైపెచ్చు ఇదంత అవసరమా? అన్న కోణంలో వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు.

ఇరుగుపొరుగు దేశాలతో వైరం పడలేక పోతున్న పాక్ ప్రజలు

ఒకప్పుడు భారత్ అంటే ఊగిపోవడం, ఆ దేశంతో శతృత్వం అంటే అదో వీరత్వం కింద భావించడం ఇప్పుడున్నట్టు కనిపించడం లేదు. ఈ కోణంలో వారి ఆలోచన సాగడం లేదన్న మాట వినిపిస్తోంది. పాక్ ప్రజా ప్రభుత్వం- సైన్యానికి మధ్య సఖ్యత లేక పోవడాన్ని కూడా వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇరుగు పొరుగుదేశాలతో వైరం వారు పడలేక పోతున్నారు.

పహెల్గాం దాడి తర్వాత ఆగిపోయిన పెళ్లి

ప్రభుత్వాలు, సైనిక పరంగా ఉన్న ఉద్రిక్తతలు వేరు. ప్రజల పరంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు వేరు. ఇక్కడి ప్రజలు అక్కడికి- అక్కడి ప్రజలు ఇక్కడికి ఎన్నో ఇచ్చి-పుచ్చుకోవడాలున్నాయి. అంతెందుకు మొన్నటికి మొన్న పహెల్గాం దాడి తర్వాత ఒక పెళ్లి ఆగిపోయింది. ఇక్కడ వైద్యం కోసం వచ్చిన వారు వెంటనే తిరిగి వెళ్లాల్సి రావడంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. భారత్- పాక్ మధ్య గల వాణిజ్య సంబంధాలు తెగిపోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే లాల్ మసీదులో ప్రతిధ్వనించిందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

జోన్ వన్- పబ్లిక్, జోన్ టూ- పాక్ ప్రజా ప్రభుత్వం, జోన్ త్రీ- సైన్యం

భారత్- పాక్ వైరం.. వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని పాకిస్థానీయులకు తెలియంది కాదు. మొన్నటికి మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ వ్యవహారంలో ఎలాంటి నష్టం సంభవించిందో తెలిసిందే. ఇలాంటి వైరం కొని తెచ్చుకోనేల? అనవసరమైన నష్టాలను చవి చూడనేల? అన్నది వారి ఆవేదనగా తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ లో మొత్తం మూడు జోన్లుగా విభజన చేయాల్సి ఉంటుంది. ఒక జోన్ కి మరో జోన్ కీ సంబంధం లేని విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మొదటి జోన్ సాధారణ పాకిస్థాన్ ప్రజలు కాగా.. వారిపై ఉన్న లేయర్ పాక్ సాధారణ ప్రజా ప్రభుత్వం. ఇక మూడోది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నది పాక్ ఆర్మీ.

ఉగ్రదాడి తర్వాతి పరిణామ క్రమాలపై..

ఈ పాక్ ఆర్మీ సాధారణ ప్రజా ప్రభుత్వం.. దాని ఆకాంక్షలు, సవాళ్లను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదని అంటారు. ఇరవై నాలుగ్గంటలూ ఐఎస్ఐ ద్వారా టెర్రరిస్టులతో సంబంధాలను నెరపడం.. భారత్ పై ఉగ్రదాడులు చేయించడం.. అనవసరవైన తగువులు కొని తెచ్చుకోవడం. తద్వారా ప్రజా ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి పగ్గాలు చేపట్టడం. ఇదే పాకిస్థాన్ ఆర్మీ తరచూ చేసే సైనిక రాజకీయ ప్రయోగంగా చెబుతారు.

విసిగి వేసారి పోయిన పాక్ ప్రజలు

భారత్ పై ఉగ్రదాడి అనగానే తదనంతర పరిణామ క్రమాలను చూసి పాకిస్థానీయులు విసిగి వేసారి పోయారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు బాగానే ఉంటారు. ఒక వేళ దాడిలో చనిపోయినా.. వారు అదంతా తెలిసే వెళ్లారు కాబట్టి వారికొచ్చే ఇబ్బంది లేదు. ఇక ఈ దాడి వెనక ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. అనుకోని వరంలా ప్రజా ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకునే వెసలుబాటు వస్తుంది. వీలైతే మరో సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. వీరు కూడా ఈ విషయంలో సంతృప్తికరంగానే ఉంటారు. ఇక మిగిలింది ప్రజా ప్రభుత్వం. ఈ తలనొప్పుల నుంచి తప్పుకుని సేఫ్ జోన్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్‌ ఇలాగే చేస్తున్నారు. ఇక మిగిలింది సాధారణ పౌరులు.

పహెల్గాం దాడి తర్వాత బలైంది మాత్రం..

పహెల్గాం దాడి వెంటనే భారత్ తీస్కున్న దౌత్య పరమైన నిర్ణయాలకు బలైంది మాత్రం.. జనరల్ పబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. అందుకే కావచ్చు.. మతాధికారి అడిగిన ప్రశ్నకు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడానికి కారణం ఇదేనని అంచనా వేస్తున్నారు దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు.

తనకు తాను వేస్కున్న సెల్ఫ్ గోల్ వివరాలేమిటి?

ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. ఇంటా బయటా.. పాక్ బోత్ సైడ్స్ దారుణమైన ఒంటరి తనం ఎదుర్కుంటుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఫలానా మతం వారిని గుర్తించి మరీ చంపుతారా? అయినా ఈ ఉగ్రదాడికీ లష్కరే తోయిబాకు ఉన్న సంబంధమేంటి? ఇలా ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నీ కలసి పాకిస్థాన్ కి చెమటలు పట్టించాయి. పహెల్గాం ఉగ్రదాడి దృష్టి మరల్చేలా చేసిన పాక్ కపట నాటకం మొత్తం బెడిసికొట్టింది. యూఎన్ వేదికగా పాక్ పన్నాగమేంటి? తనకు తాను వేస్కున్న సెల్ఫ్ గోల్ వివరాలేమిటి?

ప్రపంచ దేశాల ముందు పాక్ ఒంటరి

పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరి అయ్యింది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్ కి ఊహించని షాక్ తగిలింది. పైపెచ్చు భద్రతా మండలి నుంచి అత్యంత కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ దేశ శాశ్వత ప్రతినిథి ఆసిమ్ ఇఫ్తికార్ కి నోట మాట పెగలని దుస్థితి. మింగాలో కక్కాలో అర్ధం కాని పరిస్థితి..

ఉగ్రదాడిని ఖండించి బాధ్యులను శిక్షించాలని స్పష్టం 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ క్లోజ్డ్ డోర్ చర్చల పేరిట తీస్కొచ్చిన తీర్మానాన్ని సభ్య దేశాలు తీవ్రంగా తిరస్కరించాయి. ఉగ్రదాడిని ఖండించి బాధ్యులను శిక్షించాలని స్పష్టం చేశాయి.

దురుద్దేశ పూరిత కుట్ర కోణాన్ని తిప్పి కొట్టిన యూఎన్

మతాన్ని అడిగి మరీ పర్యాటకులు హతమార్చడాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పు పట్టింది. పాకిస్థాన్ తరచూ వినిపించే దురుద్దేశ పూరిత కుట్ర కోణాన్ని తిప్పి కొట్టింది. భారత్ తో ఏదైనా సమస్య ఉంటే ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది.

భారత్ పై పాక్ ఫిర్యాదుల బుట్ట దాఖలు

పహెల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ తీసుకుంటోన్న చర్యలపై దాదాది దేశం చేసిన ఫిర్యాదులను ఐక్యరాజ్య సమితి బుట్టదాఖలు చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే ఈ రహస్య సమావేశం ముగిసింది. సింధూనదీ జలాల ఒప్పంద రద్దు అంశాన్ని ప్రస్తావించినా పెద్దగా ప్రయోజనం లేక పోయింది.

పహెల్గాం దాడి దృష్టి మరల్చేందుకు కశ్మీర్ ప్రస్తావన

గంటన్నర పాటు సాగిన ఈ అత్యవసర సమావేశం.. ఎలాంటి తీర్మానం లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్య సమితి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేసే యత్నం చేసింది. పాక్ శాశ్వత ప్రతినిథి ఆసిమ్ ఇఫ్తికార్ మాట్లాడుతూ భారత్ పై మరోమారు ఆరోపణలు గుప్పించారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టే యత్నం చేశారు. పహెల్గాం దాడి నుంచి అందరి దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ సైనిక బలగాలను పెంచుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు.

మీరు చేసే అణు వ్యాఖ్యల సంగతేంటని నిలదీత

పాక్ ఆరోపణలు గట్టిగా తిప్పి కొట్టారు కౌన్సిల్ సభ్యులు. మరి మీరు చేస్తోన్న అణు వ్యాఖ్యల సంగతేంటని నిలదీశాయి సభ్య దేశాలు. ఇటీవల మీరు నిర్వహించిన క్షిపణి పరీక్షలు ప్రాంతీయ అస్తిరతకు దారి తీయడం లేదా? అని ప్రశ్నించాయి. మొదట పెహల్గాం దాడి కారకులపై చర్యలేవని నిలదీశారు సభ్య దేశాల వారు. లష్కరే తోయిబా సంబంధాలను కూడా వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు.

పాకిస్థాన్ అంతర్జాతీయంగా దాదాపు ఒంటరిగానే

కనీసం చైనా నుంచైనా పాకిస్థాన్ కి తగిన స్పందన వస్తుందని ఆశిస్తే అక్కడా అడియాశే అయ్యింది. చైనాతో సహా మరే ఇతర సభ్యులు కూడా పత్రికా ప్రకటన చేయలేదు. దీంతో ఎలాంటి తీర్మానం లేకుండానే, పత్రికా ప్రకటన విడుదల కాకుండానే ఈ సెషన్ ముగిసింది. ఒక రకంగా చెప్పాలంటే, పాకిస్థాన్ అంతర్జాతీయంగా దాదాపు ఒంటరిగా మిగిలిన దృశ్యం కనిపించింది.

రెండు దేశాలకు తన సలహా సూచన ఏంటంటే

ఇక యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ అయితే, భారత పాక్ మధ్య గత కొన్నాళ్లలో లేని ఎమర్జెన్సీ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోందని అన్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ స్థాయికి రావడం బాధాకరంగా ఆయన కామెంట్ చేశారు. పౌరులను లక్ష్యం చేసుకోవడం ఆమోద యోగ్యం కాదని.. ఇలాంటి వారిని చట్టబద్ధమైన మార్గాల ద్వారా శిక్షించాలని అన్నారు. ఇప్పుడు కావల్సింది సైనిక సంఘర్షణ కాదు. సంయమనం పాటించడం. రెండు దేశాలకు తన సలహా సూచన ఏంటంటే.. తప్పు చేయవద్దు.. సైనిక పరిష్కారమే పరిష్కారం కాదన్నారు యూఎన్ చీఫ్ గుటెర్రస్.

చైనా కూడా పాక్ కి మద్ధతివ్వడం లేదు

ఇప్పటి వరకూ పాక్ ఒంటరి అన్నది కేవలం మాటల్లో వినిపించేది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాక్షిగా.. తనకు తాను స్వయంగా చేసుకున్న యత్నంతో.. పాక్ నిజంగానే ఒంటరన్న విషయం తేటతెల్లమయ్యింది. అంతర్జాతీయ వేదికలపై కనీసం చైనా కూడా పాక్ కి మద్ధతివ్వడం లేదన్న విషయం.. స్పష్టమైంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×