OTT Movie : సైకో థ్రిల్లర్ సినిమాలు క్షణ క్షణం ఉత్కంఠభరితంగా నడుస్తుంటాయి. అలాంటి సినిమాల కోసం వెతికే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ముసుగు ధరించిన సైకో కిల్లర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ స్లాషర్ మూవీ పేరు ‘స్క్రీమ్ 5’ (Scream 5). 2022 లో వచ్చిన ఈ మూవీకి టైలర్ జిల్లెట్ దర్శకత్వం వహించారు. స్క్రీమ్ ఫిల్మ్ సిరీస్‌లో స్క్రీమ్ 4కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మెలిస్సా బర్రెరా, కైల్ గాల్నర్, మాసన్ గూడింగ్, మైకీ మాడిసన్, డైలాన్ మిన్నెట్, జెన్నా ఒర్టెగా, జాక్ క్వాయిడ్ వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ వుడ్స్‌బోరో అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. అక్కడ ఒక కొత్త ఘోస్ట్‌ఫేస్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆ సైకో చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సారా అనే యువతికి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. రెండు ప్రశ్నలకు సమాధానం కరెక్ట్ గా చెప్పి, మూడో ప్రశ్నకు రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఇంతలో ఒక ఘోస్ట్‌ఫేస్ ముసుగు ధరించిన వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేస్తాడు. ఆమె హాస్పిటల్ లో ప్రాణాలతో బతికి బయట పడుతుంది. ఈ దాడితో ఆమె కజిన్ సామ్, సారాను చూడటానికి హాస్పిటల్ కి వచ్చి ఓదారుస్తుంది. ఆ తరువాత వారి స్నేహితులు వెస్, అంబర్, మిండీ, చాడ్ , లివ్ కూడా సారాను కలుస్తారు. వీళ్ళంతా కలసి ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అతన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఒక పోలిస్ సహాయం తీసుకుంటుంది సామ్. నిజానికి సామ్ కూడా ఒక సైకో కిల్లర్ కుమార్తె కావడంతో, ఆమెను కూడా అనుమానిస్తారు కొంతమంది.
Read Also : కలసి బతకడానికి కడుపు తెచ్చుకోవాలా… అబ్బాయి కాని అబ్బాయితో అలా? ఎలా?
మరోవైపు ఆ కిల్లర్ ఇంట్లోనే దాక్కుని ఇద్దరు వ్యక్తుల్ని చంపుతాడు. సామ్ కు అనుమానం వచ్చి హాస్పిటల్ లో ఉన్న తన చెల్లి దగ్గరికి వస్తుంది. ఇంతలోనే ఆ సైకో అక్కడ సెక్యూరిటీని చంపి ఉంటాడు. సారాని కూడా చంపడాని ప్రయత్నిస్తుంటాడు. సామ్ తో వచ్చిన పోలీస్ ఆ సైకోని ఘాట్ చేస్తాడు. అతనికి బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. చివరికి ఆ సైకోని పోలీసులు పట్టుకుంటారా ? అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? సారాను ఎందుకు టార్గెట్ చేశాడు ? అనే విషయాల తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.