BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలును బెదిరించిన శివ.. నిజం తెలుసుకొనేందుకు ప్రభావతి ప్రయత్నాలు..

Gundeninda GudiGantalu Today episode: బాలును బెదిరించిన శివ.. నిజం తెలుసుకొనేందుకు ప్రభావతి ప్రయత్నాలు..

Gundeninda GudiGantalu Today episode May 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. గుణ వెంట వచ్చిన శివ బాలు కాలర్ పట్టుకుని అరుస్తాడు. నా ఫ్రెండ్ ని కొడితే బావ అని కూడా చూడను కొడతానని శివ ఒక్కసారిగా రెచ్చిపోతాడు. నా కాలరే పట్టుకుంటావు రా ఎంత ధైర్యం రా నీకు అని శివని బాలు కొడతాడు. శివకు దెబ్బ తగలడంతో కారుపై పడిపోతాడు. నువ్వు ఇంట్లో కాలేజీకి పోతున్నానని చెప్పి ఇలా మళ్లీ వీడు వెనకాల తిరుగుతున్నావా నీ అమ్మ చెల్లి ఎంత కష్టపడుతున్నారో కొంచమైనా ఆలోచించవా మనిషి లాగానే కొంచమైన బుద్ధుందా అని శివ కొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ బాలు ఎంతగా ఆపాలని ప్రయత్నించినా కూడా బాలు ఆగడు. శివ ను చెయ్యి పట్టుకుని మేలు పెట్టేస్తాడు. ఇక రాజేష్ చెప్తే శివని వదిలేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శివ నొప్పిగా ఉందని బాధపడుతుందే పార్వతీ సుమతి ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్తారు.. అక్కడ శివకి చాలా నొప్పిగా ఉందని ఎక్స్ రే తీయాలని డాక్టర్ చెప్తాడు. పార్వతీ సుమతి మాత్రం శివకి ఏమైందని టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. చేతికి నొప్పిగా ఉంది అని బైక్ మీద నుంచి పడ్డాను అని శివ అబద్ధం చెప్తాడు.. వాడికి ఏదో అయింది అని చెప్పేసి పార్వతి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. మీనాకు ఫోన్ చేసి రమ్మని చెప్తే మీనా తమ్ముడికి ఏమైనా తెలుసుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని బాలుకు చెప్తే బాలు మాత్రం నాకేం తెలీదు అన్నట్లు లైట్ తీసుకుంటాడు. ఇక మీనా శివను చూసి ఇంటికి వెళుతుంది. ఇంట్లోకి రాదు అనే సత్యం ఏమైంది మీ తమ్ముడికి అని అడుగుతాడు. బైక్ మీద నుంచి కింద పడ్డాడు అంట మావయ్య చేయి చాలా నొప్పిగా ఉందని బాధపడుతున్నాడు అని అంటుంది మీనా. డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకెళ్లి ఇవ్వమ్మా అనేసి అంటాడు.

అప్పుడే బాలు పై నుంచి కిందకు వస్తాడు. మీరు ట్రిప్ కి వెళ్ళాలి అని చెప్పారు మరి వెళ్లలేదా అని అడుగుతుంది. ట్రిప్ కి వెళ్ళాను తొందరగా అయిపోయింది వచ్చాను మరి హాస్పిటల్ కి రాలేదే అని నేను అడుగుతుంది. ఏమైనా డాక్టర్ నా హాస్పిటల్ కి వచ్చి ఎలా ఉంది చెక్ చేయడానికి అని బాలు అంటాడు. మీరేనా ఇలా మాట్లాడుతున్నారు అని మీనా బాధపడుతుంది. మనోజ్ మాటలకి మీనా కౌంటర్లు ఇస్తుంది. సత్యం ఇక ఆపండి దీనిమీద గొడవలు. బాలు నువ్వు రేపు వెళ్లి హాస్పిటల్ కి వెళ్లి చూసేసి పరామర్శించి ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో మీ అత్తయ్యకు కాస్త ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నీదే అని అంటాడు.


బాలు తండ్రి మాట కాదనలేక ట్రిప్పుకు వెళ్లేముందు శివుని పలకరించాలని అనుకుంటాడు. తర్వాత రోజు శివకు ఏమైందో తెలియక అటు పార్వతీ ఇటు సుమతి బాధపడుతూ ఉంటారు. నేను వెళ్లి ఈ పూల కొట్టు తెరిచి వాళ్లకు అప్పజెప్పి వస్తానని పార్వతి వెళ్ళిపోతుంది. అలాగే సుమతి మందులు తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. నిన్ను చూడ నాకు ఇష్టం లేకపోయినా సరే మా నాన్న చెప్పాడని దగ్గరికి వచ్చాను. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది. అగునా గాడితో కలిసి నువ్వు ఇలాంటి దొంగతనాలు అవి ఇవి చేస్తే బాగోదు మీ అమ్మ చెల్లి నీ మీద ప్రాణాలను పెట్టుకున్నారు అది గుర్తుపెట్టుకో అనేసి బాలు వార్నింగ్ ఇస్తాడు.

మీ అమ్మని అన్నా నన్ను అవమానించారు అందుకే నన్ను అవమానించిన వాళ్ళ దగ్గరే దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యి నేను చేశాను అందులో నాకు తప్పేమీ కనిపించలేదని బాలును ఎదిరించి శివ మాట్లాడతాడు. హాస్పిటల్ లో ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ చేయడంతో బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండు రాజేష్ దగ్గరికి వెళ్లి ఆ శివకు వీడియో చూపించి ఇకనైనా మారతాడు అని చెప్తే వాడు నన్ను బెదిరిస్తున్నాడు. వాడిని ఎలా చూసుకున్నానో.. కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా నన్ను బెదిరించాడు. ఈ విషయాన్ని నేను మీనాకు చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మకి చెప్తే ఎలా ఉంటుంది అని బాధపడుతూ మందు తాగుతాడు..

బాలు మాటలు విన్న రాజేష్ షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు అనేది ఇంత జరిగినా కూడా ఇలా మాట్లాడటం ఏంటి ఆశ్చర్యంగా ఉంది ఆ గుణాన్ని చూసుకొని వాడి ధైర్యం అంతా అని రాజేష్ అంటాడు. పార్వతి దేవుడి దగ్గరికి వెళ్లి తన కొడుకులకి బాగావాలని మొరపెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే రిపోర్ట్స్ తెచ్చి ఆమెకి ఇస్తారు. చెయ్యి విరిగిందని అతను చెప్పడంతో పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అప్పుడే మీనా కూడా హాస్పిటల్కి వస్తుంది. తమ్ముడికి చేయి పెరిగిందని బాధపడుతుంది. ఏం జరిగిందో చెప్పరా అని అడిగిన చెప్పడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×