LPG Seizures: స్వేచ్ఛ బ్యూరో: గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధికారులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్యాస్ సిలిండర్ల ను అక్రమ నిల్వ, పక్కదారి పట్టించే వారిపై అధికారులు నిఘా ఉంచి, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా ప్రక్రియ నిబంధనల ప్రకారం సకాలంలో జరిగేందుకు బుకింగ్స్, డెలివరీలను కమాండ్ కంట్రోల్ ద్వారా ఆయా ఏజెన్సీ లతో రోజువారీగా చెక్ చేస్తున్నారు.
Also Read: గులాబీ దళం రివర్స్ గేర్.. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే ఆలోచనలో కేసీఆర్..?
గత నెల రోజులుగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, మరో 70 చిన్న సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ. కోటి 50 లక్షలు ఉన్నదని, 2,089 కేసులు నమోదు చేశామని, వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపు, డెలివరీలో జాప్యంపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫిర్యాదు చేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు కోరారు.
Also Read: అద్యక్షా అనేందుకు లేని లీడర్లు రెడీ.. ఆ 40 సీట్లపై మహిళా నేతల కన్ను..?